కలర్స్...


పసిడి మెరుపుల పసుపుతనం
చెక్కిళ్ళపై మెరవాలి ఎరుపుదనం
నలుపై విరియాలి కురుల అందం
కళ్ళలో నీలి కలల అలల చల్లదనం
పలుకులు కావలె తేనెలతీయదనం
ఆకుపచ్చని ఆరోగ్యమే హరిచందనం
గులాబి పువ్వులోని సుకుమారత్వం
మనసు మాత్రం తెల్లని మంచుముత్యం
కేసరి సూర్యతేజమై వెలగాలి మీ జీవనం
మహిళాదినోత్సవ హోలీ శుభాకాంక్షలు....

19 comments:

  1. ఇన్ని వర్ణాల కలయిక ఎంత బాగా చెప్పారండి. మీకు కూడ హృదయపూర్వక రంగుల మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. రాగరంజితం రంగులవిరచితం!మీ కవితాకీర్తన మహిళలకు శుభార్పణ.చాలా బాగుంది మీ భావం.

    ReplyDelete
  3. క్షమించండి కొన్ని తప్పులెన్నవలసివస్తున్నందుకు.
    పసుపుతనం అనే మాట సరియైన పదం కాదు - పచ్చదనం అనేది సరియైన పదరూపం.
    సుకుమారత్వం అనే మాట సరియైన పదం కాదు - సౌకుమార్యం అనేది సరియైన పదరూపం.
    నలుపై విరియాలి కురుల అందం అన్నచోట అతివ్యాప్తి అనే కవితాదోషం ఉన్నది (మిగతా రెండూ అవ్యాప్తె, అసంభవం అనేవి)
    నీలి కలలు అన్నచోట కలానేదానికి వర్ణాన్ని అద్దారే. ఇక్కడ అవ్యాప్తి (కుందేటి కొమ్ములాగా).
    ఆకుపచ్చని ఆరోగ్యమే హరిచందనం అన్నది సరిగా ఉందా? హరిచందనం ఆకుపచ్చగా ఉండదుకదా. అనన్వయం.
    మంచి భావుకత. అది చాలా నచ్చింది. మొత్తం మీద చాలా మంచి ప్రయత్నం. కొంచెం కృషి చేస్తే ఇంకా నిర్దుష్టంగా వ్రాయగలరని నమ్మకంగా ఉంది.

    ReplyDelete
  4. @వనజవనమాలి, జయ, ఉమాదేవి గార్లకు ధన్యవాదాలండి!

    ReplyDelete
  5. @ శ్యామలీయంగారు మీరు నా బ్లాగ్ కి విచ్చేసి తప్పులను సరిచేసి విశదీకరించినందుకు నెనర్లండి!
    నిజం చెప్పాలంటే...
    నాకు భాష మీద పటుత్వం గాని వ్యాకరణసుద్దికానీ లేని సాధారణ వాడుక భాషా పదాలు తెలిసిన పడతినే కానీ అమోఘమైన వాఖ్యాలతో, ఉపమానాలతో కవితామాలలు అల్లలేని అల్పజీవిని మన్నిస్తారని ఆశిస్తూ..
    సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తానండి!

    ReplyDelete
  6. భావం నలుగురికీ చేరిందన్నదా లేదా అన్నదే ముఖ్యం..నేడు చందోబద్ధంగా కవిత్వీకరిస్తే అది అందని ద్రాక్షగా మారి పుల్లనైపోతుంది కదా....

    ఇలానే సరళంగా వాడుక పదాలతోనే రంగులు విరజిమ్మండి...

    ReplyDelete
  7. ఛందోబధ్ధంగా ఉన్నంతమాత్రాన అందని ద్రాక్షగా మారి పుల్లనైపోతుంది అనుకోవటం పొరపాటు. సరళంగా వాడుక పదాలతోనే, సలక్షణంగా అందరికీ అర్థం అయేటట్లుగా వ్రాయటం యేమీ అసాధ్యం కాదు. భావం నలుగురికీ చేరేవిధంగా కూడా వ్రాయటానికి ఛందస్సు అడ్డు యేమీ కాదు. అది కవి ప్రతిభ ఉద్దేశాలపైన ఆధారపడిన విషయం.

    ఒక చిన్న ఉదాహరణ. నాళం కృష్ణారావుగారి 'చేపపిల్ల' అనే ఖండికనుండి ఈ రెండుపాదాలు చూడండీః

    " నిర్మలంబైన చల్లని నీరు గల్గి
    తావి వెదజల్లు పద్మసంతతులు గల్గి "

    ఇది చాలా కష్టంగా ఉందంటే నేనింక చెప్పలేను. ఈ కవిత మాకు 7వ తరగతి వాచకంలో ఉండినది. మనం మన తెలుగుకే యెంతదూరంగా జరుగుతున్నామంటె, ఈ రోజున 'పాట' అని యెవరూ అనటం లేదు. అందరూ 'సాంగు' అంటున్నారు. ఇంక వ్యాఖ్యానించదలచుకోలేదు.

    ReplyDelete
  8. @వర్మగారు థ్యాంక్సండి....నేను అలా అనుకునే తప్పొప్పులు వ్రాసేస్తూ, భాషను ఖూనీ చేస్తున్నానేమో అన్న భావం....

    ReplyDelete
  9. పద్మార్పితగారు,
    ఎవరినీ నొప్పించటం నా అభిమతం కాదు. కవిత్వం పండితులచేత పండితులకొరకు చేయబడే విన్యాసం అన్న భావన తప్పని నాకు తెలుసు. కాని దురదృష్ట వశాత్తు అనేకమంది కవులుకూడా అదే భావనలో కొట్టుకుపోవటం చేత తెలుగు కవిత్వం అంటే భయమూ కొండొకచో చులకన అనేవి కలుగుతున్నాయి. హాయిగా సులభమయిన తెలుగులోనే అనవసరమైన ఆడంబరాలు లేకుండానే అందంగా వ్రాయవచ్చును. కొంతమంది అజ్ఞానంతో ఛందస్సూ వ్యాకరణమూ అనేవి యేవో భూతాలన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అటువంటి దేమీ లేదు. నష్టపోతున్నది తెలుగు వాళ్ళే! నాశనమౌతున్నది మన తెలుగు భాషే! ఇది సరయిన వేదిక కాదు దేశి ఛందాల గురించి చెప్పేటందుకు. వీలు వెంబడి నా నవకవనవనంలో వ్రాస్తాను. మీరేమీ భాషను ఖూనీ చేసెయ్యలేదు. ప్రయత్నాలలో చిన్నాచితకా తప్పులు వస్తాయి దానికేం. అసలు తప్పులే రాకూడదని ప్రయత్నం మానరాదు కదా. అలాగే వచనకవిత్వం కూడా కవిత్వ ప్రక్రియే. హాయిగా వ్రాయండి.

    ReplyDelete
  10. శ్యామలీయంగారు.....:-)
    వ్రాసేవన్నీ నా మనోభావాలండి
    తప్పులుంటే తప్పక మన్నించండి
    మీరంతా సరిచేస్తారన్న ధీమాలెండి
    హాయిగా నవ్వుతూ రాసేస్తాను చూడండి!

    ReplyDelete
  11. రెండు కవితలు బాగున్నాయి...:)

    ReplyDelete
  12. Mee indradhanussu lanti andamain kavitha chusi naaku asuya kaluguthondi... Just kidding..

    Eppatilage Super...

    ReplyDelete
  13. Aha!.....colors ni entha andamga chupincharandi....chala bavundi :)

    ReplyDelete
  14. చక్కనైనా చిత్రం...అంతే చక్కనైనా మీ కవిత్వం చాలా బాగున్నాయి...పద్మప్రీత గారు మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

    ReplyDelete
  15. Thanks a lot to one and all...

    ReplyDelete