భావాలెన్నో..

నాలో పొంగే భావాలే నన్నుమరి మరి వెంటాడి వేధిస్తున్నాయ్..
నాతో సహకరించని నిజాలు నన్నుతప్పు చేయమంటున్నాయ్..
నా ఈ చేతకాని ఆలోచనలు కలల నిప్పుల్లో కాలిపొతుంటే..
ఆనంద గడిలెన్నోఆదర్శాల అగ్నికి ఆహుతి అవుతుంటే..
నీవు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిదురపోతున్నావ్..
నాలో నీ తలపులతో కూడిన చింత ఎందుకు రేపుతున్నావ్..
నీపై నాకు లేని అధికారానికై ఎందుకింత తాపత్రయం..
నీ ఆనందం తప్ప ఇంకేమీ ఆశించని నా ఈ ప్రయత్నం..
నిర్మలమనసు నియమనిబంధనలను లెక్కచేయకన్నాయ్..
భీతులెన్నో ముసురువీడిన మబ్బులవోలె వెంటాడుతున్నాయ్..
అయినా చంచలమైన భావాలు చెలరేగిపోతూనే ఉన్నాయ్..
తెలిసీ తెలియకుండానే తీయని భాధను వెతుకుతున్నాయ్..

14 comments:

  1. భావాలు ఎంత చంచలమో! చాలా బాగుందండి.

    ReplyDelete
  2. మనసునిండా మల్లెలున్నట్టున్నాయ్
    ఎన్నో భావాలు వెదజల్లుతున్నారు
    మనసును రంజింపజేసే కవితలు
    మీ బ్లాగ్ నిండా పరచుకొని ఉన్నాయ్
    మంచి గంధం వంటి మీ హృదయానికి
    కవితాంజలి

    ReplyDelete
  3. మండు వేసవిలో మీ కవిత మలయ సమీరంలా తాకి మనసున మల్లెల పరిమళాన్ని పంచింది...యింక ఆయనకు నిదుర పట్టుతుందా:-)

    అభినందనలు పద్మ గారూ...

    ReplyDelete
  4. హుమ్మ్.. బాగుంది మీ సంఘర్షణ!

    ReplyDelete
  5. ప్చ్....భావాలెన్నో???
    వాటి భాష్యాలెన్నో???
    బాగున్నాయి!:-)

    ReplyDelete
  6. స్పందించిన ప్రతి హృదయానికి నా భావ సుమాంజలి!!!

    ReplyDelete
  7. nice expression!మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  8. స్పందించే హృదయముంటే వెల్లువెత్తే భావాలెన్నో...మీ కవతలు చాలా బాగుంటున్నాయి

    ReplyDelete
  9. బాగున్నాయి మీ భావాలు.

    ReplyDelete
  10. చిత్రానికి కవిత రాస్తారా ,కవితకు తగ్గ బొమ్మ గీస్తారా ! తెలీకుండా వుంది . బావుంది

    ReplyDelete