చేయొద్దని...

నా భావాల్లో ఇన్ని రంగులెందుకని
బయటపడి నీకు అలుసవ్వొద్దని...

నీ ఆలోచనలని చుట్టుముట్టొద్దని
నా కంట నీరుగా బయటపడొద్దని...

నా మోముపై ఈ వెలుగెందుకని
నీ హృదయంలో నేను బంధీనని...

ఆస్వాదించలేని అందమైన ప్రేమని
బంధాల గుప్పెట్లో బందిచ్చొద్దని...

అధరాలపై ఈ ధరహాసమెందుకని
ఎదలోని వేదన నీకు తెలియొద్దని...

నేను మరణిస్తే నా చితికి నిప్పెట్టొద్దని
హృదయంలో ఉన్న నిన్ను కాల్చొద్దని.

15 comments:

 1. కవిత చదివాక బాధగా అనిపించింది.
  అయినా బాగుంది.

  ReplyDelete
 2. కవిత బాగుంది..

  పద్మార్పిత గారు.. మీ బ్లాగ్ పిక్ అంతకు క్రితం దే చాలా బాగుండేది. ఈ పిక్ బాగా డార్క్ అయింది.

  చెప్పానని ఏమి అనుకోకండి.

  ReplyDelete
 3. @ జలతారు వెన్నెలగారుగారు...మీ స్పందనకు నెనర్లు!
  @Lasya Ramakrishna...thank Q!
  @వనజవనమాలిగారు...I will try to impress you...సలహాలకి సంతసమే కాని అనుకోవడం ఎందుకండి!

  ReplyDelete
 4. నీ చెంతకు చేరని నా ప్రేమ ఈ మట్టిలో ఇంకనీ
  ......

  నీ చేతిలో ఓ గడ్డి పూరేకై రాలనీ..

  చాలా టచింగ్ గా వుందండీ మీ కవిత...
  అభినందనలతో..

  ReplyDelete
 5. కెక్యూబ్ వర్మగారు ఇలా స్పందిస్తే....
  రంగులద్దిన మోము మైనంలా కరిగిపొతుందేమోనండి:-)
  మీ ప్రేమతో కూడిన కవితా స్పందనకు...అభివాదములు!

  ReplyDelete
 6. పద్మా కంటికింపుగా బ్లాగ్ అలంకరించి...
  కమనీయమైన కవితలతో కట్టిపడేస్తున్నావు.
  Keep going on dear.

  ReplyDelete
 7. చాలా తీవ్రమైన భావావేశం.బొమ్మలు ఎక్కడివండి.చాలా బాగున్నాయి.

  ReplyDelete
 8. చాలా తీవ్రమైన భావావేశం.బొమ్మలు ఎక్కడివండి.చాలా బాగున్నాయి.

  ReplyDelete
 9. Heart touching photo and words.

  ReplyDelete
 10. మీ బ్లాగ్ లో కవితలెంత బాగున్నాయో...
  వాటికి వేసిన చిత్రాలు కూడా అంత బాగున్నాయి...
  @శ్రీ

  ReplyDelete
 11. నేను మరణిస్తే నా చితికి నిప్పెట్టొద్దని
  హృదయంలో ఉన్న నిన్ను కాల్చొద్దని.

  Excellent way of expression no words.great keep going :-)

  ReplyDelete
 12. /నేను మరణిస్తే నా చితికి నిప్పెట్టొద్దని
  హృదయంలో ఉన్న నిన్ను కాల్చొద్దని/

  అర్థం, లాజిక్ పెద్దగా పట్టించుకోకుంటే, భావకవితావేశం, సెంటిమెంటు బాగానే వుంటుంది. :)

  ReplyDelete
 13. Once again thanks to one and all...

  ReplyDelete
 14. అందమైన భావాలు మీవి.

  ReplyDelete