వెలయాలి

వేదాలు వల్లించే వయసు నాది కాదు
ఏ రాశి కూడా నా రాత మార్చలేదు
ఎందుకిలా అని ఎవరినీ నింధించలేదు
రేయి ఏనాడు హాయిగా నిదురించలేదు
వరించలేదని వచ్చిన వాడ్ని కాదనలేదు!

పక్క ఎక్కని నాడు డొక్క ఆడలేదు
ఢోకొస్తుంది అన్నా విటుడు విడవలేదు
వెలయాలి అన్నా విరుచుకు పడలేదు
రుసరుసలాడితే రుసుము చేతికందదు
పెదవులకి రంగులద్దనిదే రసికతే లేదు!

ఊరూరు తిరిగినా ఏ ఊరు నాది కాదు
కవ్వించమన్నారే తప్ప కనికరించలేదు
తనయుడిని కూడా తల్లెవరనడగలేదు
వాధించి ఏదో సాధించాలన్న ఆశలేదు
సుఖఃమైన చావైనా నుదుటరాయలేదు!

26 comments:

 1. చాలా బాగుంది వారి ఆవేదనను చక్కని కవితగా మలచి బాగా చెప్పారు అండి...

  ReplyDelete
 2. Padmarpita....You Made it.
  This what I expected from you, keep writing my Ideal

  ReplyDelete
 3. ఆవేదనగా, ఆర్థ్రంగా బాగుందండీ...యింకొంచెం వుంటే బాగుండనిపించింది...

  ReplyDelete
 4. @♛తెలుగు పాటలు♛...నచ్చి స్పందించిన మీకు ధన్యవాదాలండి!

  @ ప్రేరణ...thanks for your inspiring words my friend!

  @ కెక్యూబ్ వర్మ...థ్యాంక్సండి!....భారంచేసే భావాల గురించి రాయడం నాకు అంతగా రాదేమోనండి! అయినా ప్రయత్నిస్తాను.

  ReplyDelete
 5. జబిల్లి వెన్నెల్లు చవిచూడ లేదు.మనసార ఒక రాత్రి కునుకైన లేదు..బ్రతుకంత మరుభూమి కాగా.. ఆమె మిగిలి0ది ఒక గాధగా..పాట గుర్తుకు తెచ్చారు.

  ReplyDelete
 6. బాగుంది పద్మ గారు! మీ కవితలన్ని చదివేసిన తర్వాత కూడా readers ని అలోచింపచేస్తాయి. అది మీలో ప్రత్యేకత! అభినందనలు మీకు.

  ReplyDelete
 7. బాధాకరం గా ఉంది. దయనీయ జీవిత గాధ.. కవిత్వంలో ఒదిగిపోయింది. బాగా వ్యక్తీకరించారు.
  అక్షరామోహనం గారు..ఆ పాట ఏ చిత్రం లోది?. చెప్పగలరా? నేను విన్నాను కానీ గుర్తుకు రావడం లేదు.

  ReplyDelete
 8. @ అక్షర మోహనంగారు....మీరు నా కవిత ద్వారా "అంగడి బొమ్మ" చిత్రంలోని ఆ పాటను తలచి పంచుకున్నందుకు నెనర్లండీ!
  @ జలతారువెన్నెలగారు...మీ ప్రత్యేకమైన అభిమానానికి ధన్యవాదాలండి!
  @వనజవనమాలిగారు...మీ స్పందనకు ధన్యవాదాలు!

  ReplyDelete
 9. !! వనజవనమాలి !! గారు..
  జాబిల్లి వెన్నెల్లు చవిచుడలేదు
  సిరిమల్లె పువ్వులు సిగముడువలేదు
  కనులార ఒకరాత్రి కునుకు అయిన లేదు
  మనసార మాటాడా మనిషి అయిన లేడు
  బ్రతుకంతా మరుభూమి కాదా
  ఆమె మిగిలింది ఒక గాధగా
  ఆమె మిగిలింది ఒక గాధగా..
  ఈ పాట అంగడి బొమ్మ మూవీ లోనిది.. ఆత్రేయ గారు రచన.. సంగీతం-- సత్యం

  download link- https://rapidshare.com/#!download|408p8|205318851|Angadi_Bomma-jabilli_vennellu_chavi_chuDalEdu.mp3|9595|R~ED6D7DB47883059B86BE0AD33DF1CF05|0|0

  ReplyDelete
 10. Padma Marvelous.
  Claps to poetry & claps to pic too dear.

  ReplyDelete
 11. తను పండై ,తనువు పుండై........అని ఒక కవి వ్రాశారు.కమలహాసన్ మహానది చూశారా మీరు !కూతురు కోసం వెతుకుతూ వెళ్లి ఆమెను రక్షించుకోవటం .అందులో వారి దయనీయ జీవితాలను చూపిస్తారు.చాలా బాగా వ్రాశారు.మీ భావాలు ఆలోచింప చేసే విధంగా వున్నాయి.

  ReplyDelete
 12. Alisetti prabhakar gaari kavita idi.

  ReplyDelete
 13. ee link lo Alisetti prabhakar gari gurinchi choodavacchu.
  http://www.youtube.com/watch?v=qZkHK5izxe0

  ReplyDelete
 14. Manavudu-Danavudu chitramlo oka paata,Mallepuvvu(shobhan babu) chitramlo EVARU VEERU..paatalu atyanta aavedanaa bharitamaina teeruku addam pattaayi. veelaite choodandi.

  ReplyDelete
 15. Its one of your best post.
  Keep go on rocking.

  ReplyDelete
 16. స్పందించిన ప్రతి హృదయానికి వందనాలు!!!

  ReplyDelete
 17. Nice pic and excellent expression.A great feel in the lines which i read in recent days.Keep going :-)

  ReplyDelete
 18. Thank Q very much Kranti garu...

  ReplyDelete
 19. Kanureppalu chemmagille laa rasaru andi

  ReplyDelete
 20. mee veliyali poem naaa kallalo kanneeru tepinchindi padma garu ...meeru ila ne mundu ku sagali ani assitu

  ReplyDelete
 21. mee veliyali poem naaa kallalo kanneeru tepinchindi padma garu ...meeru ila ne mundu ku sagali ani assitu

  ReplyDelete
 22. ఊహలకి అందని అద్భుత సృష్టి ఈ కవితాచిత్రం.

  ReplyDelete