...వేధించే వేసవిలో చల్లని వెన్నెలనై రానా...
...నీ కనుపాపల సన్నలలో నేనుండిపోనా...
...నీవు కాదన్నవేళ నేను కడదేరిపోనా...
...నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
...మరి నా నిఛ్ఛ్వాసలో నాకు దూరమౌతావు...
...ఎందుకిలా అంటే నవ్వి నా ఊపిరై పోతావు...
...కంటికి కనబడలేదు కాని నీలో నేను లేనా...
...తలచి చూడు నీ తనువంతా నేనే కానా...
...పిలిచి చూడు చితినుండి నేను లేచిరానా...
...నీ అందమైన ఊహల్లో నేనున్నానంటావు...
...మరి కలనైనా నన్ను మురిపించకున్నావు...
...ఎందుకిలా అంటే ప్రేమకు పరిభాషే నీవంటావు...
...నీవు కాదన్నవేళ నేను కడదేరిపోనా...
...నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
...మరి నా నిఛ్ఛ్వాసలో నాకు దూరమౌతావు...
...ఎందుకిలా అంటే నవ్వి నా ఊపిరై పోతావు...
...కంటికి కనబడలేదు కాని నీలో నేను లేనా...
...తలచి చూడు నీ తనువంతా నేనే కానా...
...పిలిచి చూడు చితినుండి నేను లేచిరానా...
...నీ అందమైన ఊహల్లో నేనున్నానంటావు...
...మరి కలనైనా నన్ను మురిపించకున్నావు...
...ఎందుకిలా అంటే ప్రేమకు పరిభాషే నీవంటావు...
...ఇంక అడిగే సాహసం నేనేమైనా చేయగలనా...
...నిన్ను వీడినచో నా అస్తిత్వాన్ని నేకోల్పోనా...
...నీ తనువు అణువులో నేను ఏకమైపోనా...
wow
ReplyDeleteపద్మ గారు, బాగుంది మీ కవిత.
ReplyDeleteమీ కవితలన్ని బాగున్నాయి.ఈ మధ్యనే చదివాను చాలమటుకు.కాని నాకు నచ్చనది ఒక్కటే..
మీరు కొన్ని కవితలలో చితి, కడతేరిపోవటం,మ్రుత్యువు అన్న పదాలు వాడారు.అది మాత్రం నాకు నచ్చలేదు. ఇలా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినటైతే క్షమించండి!
...నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
ReplyDelete...మరి నా నిఛ్ఛ్వాసలో నాకు దూరమౌతావు...
...ఎందుకిలా అంటే నవ్వి నా ఊపిరై పోతావు...
very nice...
పద్మగారు,
ReplyDeleteమీ అందమైన కవితలో నైరాశ్యపు నీలినీడలు నన్ను కొంచెం కలవర పెడుతున్నాయి.
జలతారు వెన్నెలగారికి అశుభసూచకపదాలు పాయసంలో నలకల్లాగ అనిపించి ఇబ్బంది పెట్టాయి.
కాని విప్రలంభం శృంగారంలో అత్యంత కవితావేశాన్ని కలిగించే అంశం. దాంట్లో మరణంలాంటి దారుణమైన స్థాయీ భావామూ కడపట ఉంది.
అయితే, కవయిత్రి నేర్పుగా సమాగమప్రస్తావనాపూర్వకంగా అమంగళాన్ని ప్రతిహతం చేస్తూ మంగళాద్యాని మంగళాంతాని అని చక్కగా ముస్తాబు చేసారు కవితని.
మనఃపూర్వక శుభాభినందనలు.
ఇలాగే అనేక మంచి కవితలు వ్రాయాలి పధ్మగారూ.
no words...just feel the fragrance of touching lines...:-)
ReplyDeleteఏమో...ఈ భావావేశాలు, ప్రేమలో ప్రాణత్యాగాలు ఎంతవరకూ నిజమో తెలీదు కానీ
ReplyDeleteపద్మార్పిత ప్రాణం తీయడమైనా పోయడమైనా సున్నితంగా చెపుతారు అనేది మాత్రం నిజం.
కవితలకు మీరెన్నుకునే బొమ్మలు,కవితల్లోని గాఢత చాలా లోతయిన అర్థాలను చెబుతున్నాయి.
ReplyDelete@ ♛ తెలుగు పాటలు ♛...thank Q.
ReplyDeleteIts my pleasure!
@ జలతారువెన్నెలగారు... అన్నీ సవ్యంగా ఉండి అహ్లాదకరమైన వాతావర్ణంలో ఆనందంగా ఉన్నప్పుడు, అడిగినవి అందించడం గొప్పతనం ఏముంది?
కష్టమైనా నష్టమైనా ఏమీ ఇవ్వలేక పోయినా ఇవ్వగలను, అడిగిచూడు ప్రాణమైనా అని చెప్పాలన్నదే నా ప్రయత్నమండి!
అయినా మనలోమాట ప్రాణం ఇవ్వమని నేనడగనులెండి, ఇస్తానంటానేకాని...so don't worry:-)
భాధ ఎందుకండీ? ఇలా కాస్త కమెంట్స్ టఫ్ గా ఉంటేనేకదా నా మెదడుకి పని...so be happy:-)
Thanks for comment.
@ వనజవనమాలిగారు... ధన్యవాదాలండి!
@ శ్యామలీయంగారు... నా కవితలోని నీలినీడలు మిమ్మల్ని కలవరపెడితే.
ReplyDeleteమీ అభినందనల గాలితెమ్మెరలు నన్ను ఆహ్లాదపరిచాయండి.
జలతారువెన్నెలగారి పదాలు పాయసంలో నలతలు కావనిపిస్తున్నాయి,
అవి సువాసననిచ్చే యాలకుగింజల పొడి అనుకుంటానండి.......:-)
మీ మనఃపూర్వకాభినందనాలకు ధన్యవాదాలండి!
@ కెక్యూబ్ వర్మగారు...Just enjoy the feel of fragrance. Thank Q!
@ ప్రేరణగారు...మీ అభిమానపు భావదొంతరులకు కృతజ్ఞతలండి!
ReplyDelete@ oddula ravisekharగారు... నా కవితలు, బొమ్మలు మీరు నచ్చి మెచ్చినందుకు ఆనందమండి!
పద్మార్పితగారి భావాలధాటికి నుజ్జు అయిపోదా ప్రేమప్రపంచం:)
ReplyDeleteThat's Great.
" జలతారు వెన్నెలగారికి "అశుభసూచకపదాలు" పాయసంలో నలకల్లాగ అనిపించి ఇబ్బంది పెట్టాయి. "
ReplyDeleteశ్యామలీయంగారు అన్నది నాకు మీ కవితలలో ( పాయసం) లో మీరు వాడుతున్న కొన్ని పదాలు ( చితి, కడతేరిపోవటం) నలకలుగా కనిపించాయని పద్మ గారు. Just want to clarify, that you express yourself so well, that you deserve Kudos for your writing skills.
nice padma.......
ReplyDeleteగజల్ బాణిలో, గాన యోగ్యంగా, రమణీయ కమనీయ పదాలతో, మీ కవిత గొప్పగా ఉంది
ReplyDeleteఇలా ప్రేమ, ప్రణయ కవితలు రాసే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు .
'చితి' నుండి అనే పద మొక్కటే అంత అవసరం లేనిది అనిపించింది
మీ కవితా గేయానికి అభినందనలు
good
ReplyDeleteThanks to everyone...
ReplyDeleteకవిత బావుంది అంతకుమించి బొమ్మ బహుబాగుందండీ!
ReplyDeletePadma...U R different & Ur thoughts R superb.
ReplyDelete