పొగడమాకు!!!

పలు పూలతో నన్ను పోల్చమాకు
నింగికెగిసేలా నన్ను పొగిడేయమాకు... 
మల్లెలవంటిది నా మనసంటావు
నిరీక్షణలో నన్ను వాడిపోనిస్తావు 
కలువరేకుల కళ్ళదాన్నంటావు
కమ్మని కలవై కరిగిపోతున్నావు 
గులాబీల గుబాళింపు నేనంటావు
మొగ్గనై ముడిస్తే గుబులేలనంటావు 
చామంతి ఛాయంటి దానినన్నావు
చాలు పొమ్మంటే సరసమాడజూస్తావు 
బంతిపూలంత బరువైనాలేనంటావు
బలమెవ్వరిదంటే బయటపడకున్నావు 
జాజులై జాలువారె నా నవ్వులంటావు
జలతారునై నవ్వితే జగడమాడతావు 
సంపెంగలెన్నైనా నాకు సరికావంటావు
వదలకుండా ఒడిసిపట్టి వాడిపోకంటావు 
ముద్దమందారంలా ముద్దుగున్నానన్నావు
మరులుగొల్పి మరల మాపటేలకంటావు 
మొగలిపూలవాసనతో మత్తెకిస్తానంటావు
మురిపించ దరిచేరితే ముళ్ళున్నాయంటావు 
పొగడపూలతో పూజింతు నన్ను వీడమాకు
పారిజాత పూలకై పైకి ఎగబడమాకు......

30 comments:

 1. ఇంతటి చక్కటి కవితను పొగడకుండా ఉండడం ఎలా?

  ReplyDelete
  Replies
  1. ఇన్నాళ్ళకి విచ్చేసి ఇలా పొగడం ఆనందదాయకమండి:-)Thank Q!

   Delete
 2. లలితమైన పూల పరిమళాలతో మనసులోని భావాలను ఏర్చి కూర్చి కవితామాలల్లడం మీకు వెన్నతో పెట్టిన విద్య పద్మగారూ...
  పొగడక మేమాగతరమా...
  అందుకోండి మా అభినందన కుసుమాల మాలలు...

  ReplyDelete
  Replies
  1. వెన్నతో పెట్టిన విద్య ఏమోకాని...మీ పొగడ్తతో మాత్రం కొలెస్రాల్ పెరుగుతుంది:-)
   (మనసుకి హాయినిచ్చింది ఇది మనలోమాటనుకోండి)....ధన్యవాదాలండి!

   Delete
 3. మల్లెలు కలువలు గులాబీలు
  చామంతులు బంతిపూలు జాజులు
  సంపెంగలు ముద్దమందారాలు
  మొగలిపూల వాసనలు పారిజాత సుమదళాలు
  ఎన్ని పూలతో అభిషేకించారో ,
  కవిత నిండా ఎన్ని సౌరభాలు ఎన్ని పరిమళాలు !
  మీది హృదయమా నందనవనమా ..?
  ఉదయా నిదుర లేచానా ......
  ఎద వాకిలి నిండా మీ సుమదళాల పరిమళాలు
  మీ సుమ సదనానికి
  మానస వీణా మధు గీతానికి
  అభినందనం అభివందనం

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానపు పూల జల్లులకి నమోఅభివందనం:-)

   Delete
 4. చాలా చాలా.. చాలా బాగుంది.వన విహారం చేస్తూ..మది భావం తెలిపినట్లు ఉంది..

  ReplyDelete
  Replies
  1. నా మదిభావం మీకు నచ్చినందుకు మదిపులకించింది:-) నెనర్లు!

   Delete
 5. పద్మ గారు,
  బాగుందండి. ఈ చిత్రాలు మీరు వేసినవేనా లేక వెబ్ నుంచి సేకరించినవా?

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి! ఈ చిత్రం నేను వేయలేదండి.

   Delete
 6. పద్మగారు ఈ ఎండాకాలం మీ కవితాపరిమళాల పులాచెండు హాయిగొల్పుతున్నది.

  ReplyDelete
  Replies
  1. హాయిగా ఆస్వాధిస్తున్న మీకు ధన్యవాదాలు!

   Delete
 7. So nice & qte andi padma garu..

  ReplyDelete
 8. కవిత బాగుంది అండి... పొగడమాకు అంటూనే తీయని ఆవేదనను కూడా తెలియచేప్పారే..

  ReplyDelete
  Replies
  1. ఓహో...పసిగట్టేసారుగా:-) థ్యాంక్సండి!

   Delete
 9. పొగడమాకు అంటూనే ఇంతలా పూలరంగులద్దిన మీ హృదయాన్ని పొగడకపోతే ఈ పూలన్నీ బోసిపోవు...పద్మార్పిత గారూ మీ భావవీవెనలో విహరిస్తున్నా..

  ReplyDelete
 10. అనికేత్...అలా విహరించి వెళ్ళండి :-)
  Thank Q!

  ReplyDelete
 11. పూలన్నీ ఏరికోరి మీరే అయితే ఇంక మిగిలిందేమిటీ మాకు ఆకులు అలములుతప్పా? :(

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!

   Delete
 12. Replies
  1. ధన్యవాదాలండి!

   Delete
 13. కుసుమ వర్షం హాయినిచ్చిందండీ....
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. తడిచి తన్మయం చెందిన మీకు ధన్యవాదాలు:-)

   Delete
 14. పూల పరిమళాన్ని ,పుప్పొడి రేనువుల్ని ప్రోది చేసి కవితలో గుమ్మరించారు.కవితల్లో మంచి ప్రయోగాలు చేస్తున్నారు.

  ReplyDelete
 15. మీ అభిమానపు పుప్పొడిరేణువులవంటి స్పందనలు మరో కవితాపుష్పాన్ని పూయిస్తుందండి!Thank Q!

  ReplyDelete