ఈవేళ లెక్కతప్పవా!!!

ఓ కాలమా కాసేపాగలేవా!!!
ఓ క్షణమైనా లెక్కతప్పవా!!!
తన్మయత్వంతో తనువులు (1/౧)ఒకటైనవేళ
ఇరుజతల కళ్ళు (2/౨ )రెండుగా మారినవేళ
మురిపాలు (3/౩ )మూడు ముళ్ళు కోరినవేళ
పెనవేసిన పాదాలు (4/౪)నాలుగు పరవశించువేళ
ప్రణయమే (5/౫)పంచాక్షరిపై ప్రమాణమన్నవేళ
చేసినబాసలు (6/౬)ఆరునూరైనా తప్పమని పలికేవేళ
అనురాగమే ఆనందంతో (7/౭ )సప్త స్వరాలాలపించువేళ
ఆప్యాయతలో పడ్డ (8/౮)అష్టకష్టాలు మరచి మురియువేళ
అతనిలో భాగమై అమె (9/౯)నవమాసాలు మోయనెంచినవేళ
మరోజీవి (10/౧౦)పదిమందికి ఉపయోగపడేలా ఊపిరిపోసుకునేవేళ
ఓ కాలమా కాసేపాగలేవా!!!
ఓ క్షణమైనా లెక్కతప్పవా!!!

33 comments:

 1. Replies
  1. Hi..its nice to hear:-)thank Q.

   Delete
 2. పద్మగారు...చాల చాలా చాలా బాగుంది! I should say very creative!

  ReplyDelete
  Replies
  1. Thanks a lot for your compliment.

   Delete
 3. మీ లెక్కల్లో కవిత చక్కగా కుదిరింది..

  ReplyDelete
  Replies
  1. లెక్కల్లో(కవితకు) నాకు మంచి మార్కులు వేసినందుకు ధన్యవాదాలండి!

   Delete
 4. ఎంత చక్కగా వ్రాసారండి !ఇలా వ్రాయాలనే మీ ఆలోచన లో ఎంత సృజనాత్మకత!మీరు మంచి కవయిత్రి !విభిన్న విషయాల ఫైకి మీ కాలాన్ని ,కలాన్ని మళ్ళించండి .విషాదంతో పాటు ఇలాంటి ఆనంద మిచ్చే కవితలు వ్రాయండి.

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానపు స్పందనకు నెనర్లు. తప్పకుండా మిమ్మానందిపచేయ ప్రయత్నిస్తానండి!

   Delete
 5. ఆనంద హేళ...అంతరంగ ఆంతర్యాన్ని మధించి అమృతాన్ని పంచారు...అభినందనలు పద్మగారూ..

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన ఆనందహేళ
   నా కవితలకు ప్రేరణాజ్వాల
   థ్యాంక్సండి వర్మగారు...

   Delete
 6. Mee pics collections chala bagunayi Padmarpita Garu :)
  all the best and keep writing..

  ReplyDelete
 7. బాగుందండీ మీ లెక్కలు వేసిన కవిత.
  (చిన్న సవరణలుః తన్మయంతో --> తన్మయత్వంతో; పంచమాక్షరిపై -> పంచాక్షరిపై)
  మీరంతా ఈ భలే బాగుండే బొమ్మలెలా సేకరిస్తున్నారోనని చాలా ఆశ్చర్యంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. కవిత నచ్చిమెచ్చిన మీకు ధన్యవాదాలండి!
   పదాలను సరిచేసిన మీకు వందనాలండి!(పంచమ(5) అనే అంకెకొరకై ప్రాకులాటలో అలా:-)
   అర్థం చేసుకుంటారనుకుంటాను)Once again thanks to You!

   Delete
  2. అద్థమైనదండీ. కాని చూసారూ, పంచ అన్నా చాలు అయిదే కదా!

   Delete
 8. పద్మార్పితా
  మీ కళాతృష్ణకు
  మీ క్రియేటివిటీకి
  నమఃసుమాంజలి.

  ReplyDelete
 9. ముందే- 'తనువులు ' ఒకటైన వేళ అనే కంటే , ' తలపులు 'ఒకటైన వేళ అంటే ? ...ఐనా మీ భావనా బలం బలమైనదే నేమో అనపిస్తోంది ....

  ఏమా కవితా చిత్రము !
  ప్రేమామృత తత్వమంత పేర్చి లిఖించెన్ ,
  ఈ మీ కవిత తెలుగు భా
  షా మాతకు పద్మగారు ! చక్కని మణి యౌ .

  బ్లాగు సుజన-సృజన

  తెలుగు భాషను చక్కగా తెలిసి , కవిత
  లల్లు బ్లాగరులార ! మీ ప్రతిభ ముందు
  పండితుల రాత లెందుకూ పనికిరావు ,
  పదము 'సాధువు గాద'ను వనికి దప్ప .

  ReplyDelete
  Replies
  1. మీ భావాయుక్త పద్యస్పందనకు నా మనఃపూర్వక నేనర్లు!

   Delete
 10. లెక్కల గణన బాగుందండీ!..@శ్రీ

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!!!

   Delete
 11. కాలం లెక్కతప్పినా నీ భావంలోని కమ్మదనం తక్కువ కాదు పద్మార్పితా.

  ReplyDelete
 12. మీ కవితతో కాలాన్ని ఆపేశారు, లెక్క ఓ క్షణం తప్పించారు. చాలా బాగుంది. అభినందనలు.

  ReplyDelete
 13. ధన్యవాదాలండి!

  ReplyDelete