అలా/ఇలా ఎందుకో?

అలా.....సెలయేటి గలగలవై
సంధ్యవేళ నుదుట సింధూరమై
మెరిసే ముక్కెరవైనావెందుకో?
ఇలా.....మదిలోనే దాగిన స్ఫూర్తివై
తామరాకుపై నీటి బిందువై
శృతిని వీడిన పల్లవైనావెందుకో?

అలా.....పసివాడిలా దోబూచులాడి
అసుర సంధ్యవేళ అల్లరేచేసి
అందకుండా ఆదమరిచావెందుకో?
ఇలా.....మబ్బుల్లో దాగిన వెన్నెలవై
నీలిసంద్రంలోని నిగూఢనిశ్శబ్ధానివై
చింతల కొలిమై కాలుతున్నావెందుకో?

అలా.....శుభోదయమై పలుకరించి
మంచిమాటలతో మైమరపించి
రేయంతా జాడలేకున్నావెందుకో?
ఇలా.....మరల చిగురించే ఆశవై
నీట పెనవేసుకున్న ప్రతిబింబానివై
ఏకంకాని నింగినేలలమైనామెందుకో?

42 comments:

 1. కవిత బాగుంది...
  స్టన్నింగ్ పెయింటింగ్...చిత్రకారుడెవరో తెలుసాండీ?

  ReplyDelete
 2. మీ కవిత నచ్చేసింది ఎందుకో?.....
  :)
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. అదేంటో కవిత అలా నచ్చేసిందెందుకో? :-)

   Delete
 3. అలా నీ నుదుట సింధూరమై
  వాన నీటికి కరిగిపోనులే..
  నీ మెరిసే ముక్కెరలో
  ముత్యంలా ఒదిగిపోతాను...

  నిరంతరం నీ
  ధ్యానంలో నీ చరణాలకు
  పల్లవినై పాటలా నీ
  హృదయ తంత్రిలో చేరుదామనే
  అలా...

  వసివాడని పసివాడిలా
  నీ కొంగు చాటున చేరి
  అల్లరి చేస్తూ
  పో...రా..అని నీ తీయని
  పిలుపుకోసం అల్లరిగా అలా.,.

  మబ్బుల మాటున
  దాగిన వెన్నెల
  నీ కనుల కాంతితో
  నీలాల నింగినంతా వెలుగుతూ
  ఉల్కలా నీ ఎదలో చేరి
  ప్రకాశిద్దామనే ఇలా...

  శుభోదయపు వేళ
  నీ నామస్మరణతో
  నా ఎదలో పులకరింత
  మురిపెంగా నిను దాచుకుంటూ
  సాగిన పగటి పయనం
  నీ పాదాల చెంత ముగిద్దామనే అలా...

  అలా కలల అలలపై తేలియాడుతూ
  నిరంతరమూ నీ ప్రేమ తీరాన్ని
  చేరుకోవాలనే అని తెలిసి
  ఇలా ప్రశ్నల కొడవలితో
  తీయగా కోస్తే ఏమనగలను??

  ఇలా నీ దగ్గర ఒదిగిపోవడం తప్ప...

  ReplyDelete
  Replies
  1. అలా...అంతందంగా కవితావ్యాఖ్యానంతో అలరించి
   ఇలా...అజ్ఞాతంగా ఉండిపోయారెందుకో? ఏమో? :-)
   మీ మనఃపూర్వక స్పందనా సమాధానానికి నెనర్లు!

   Delete
 4. మీ కవిత చాలా బాగుందండి. చిత్రం కూడా చక్కగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి.... నచ్చి మెచ్చిన మీకు!

   Delete
 5. నీలిసంద్రంలోని నిగూఢనిశ్శబ్ధానివై...baagundi.good poetry.

  ReplyDelete
 6. nice poetry. nice painting...

  ReplyDelete
 7. పద్మా.....నీ భావాలు దానికి తగిన చిత్రాలు చూస్తుంటే కాస్త ఈర్ష్యగా ఉంది నీలోనే ఇన్ని కళలెందుకో?
  Marvelous...keep it up.

  ReplyDelete
  Replies
  1. ఓహ్.....అయితే మీకు నాపై బోలెడంత ప్రేమన్నమాట!
   అందుకేనేమో..ఈర్ష్య:-)Happy to hear & thank Q!

   Delete
 8. పద్మార్పిత గారు...మొదటి సారిగా మీ బ్లాగు చూసాను..నవ రసాలు మీ కవితల్లోనే కాదు అనుబంధ చిత్రాల్లోని కూడా కాన వచ్చేట్టు మీరు తీసుకుంటున్న జాగ్రత్త, అభినంద నీయం

  ReplyDelete
  Replies
  1. ధన్యవాధాలండి నా బ్లాగ్ కు విచ్చేసినందుకు!
   ప్రశంసలతో అభినందించిన మీకు వందనములు!

   Delete
 9. Seriously you should print every poem along with pictures (in color) and publish it like a book. You have an amazing collection ..every poem is written so well and every picture you chose for each poem is just mind blowing..Once again very well written and nice picture. Good work!

  ReplyDelete
 10. Thanks for your affectionate & hearty compliments which are inspiring me to write few more....

  ReplyDelete
 11. అలా, ఇలా, ఎలా అయినా మీ బ్లాగ్లో కట్టిపడేసేయడం మీకే చెల్లునండి పద్మార్పితగారు. అలా చూస్తూనే ఉన్నా బొమ్మని, ఇలా ఎలా రాసారో అని అలోచిస్తూ:)

  ReplyDelete
  Replies
  1. అబ్బో....ఎలగెలగా ఎలగా:-) thank Q.

   Delete
 12. ప్రేమ పాట లెన్నో
  పాడావు ఎందుకు?

  కన్నీళ్ళతో నన్ను
  కదిలించేందుకా?

  ReplyDelete
  Replies
  1. ప్రేమ పాటలెన్ని పాడినా
   ఆస్వాదించే మనసుంటేనేగా
   కరిగి కన్నీరైయ్యేది....థ్యాంక్సండి!

   Delete
 13. అలా.....పసివాడిలా దోబూచులాడి
  అసుర సంధ్యవేళ అల్లరేచేసి
  అందకుండా ఆదమరిచావెందుకో?" నాకునచ్చినవి.ఎప్పటిలా మీ కవిత హాయిగ ఉంది

  ReplyDelete
  Replies
  1. ఓహ్....హాయిగొల్పింది కదా?? ఆనందమాయె :-)

   Delete
 14. కవిత, చిత్రం రెండూ చాలా బాగున్నాయి.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!

   Delete
 15. chala bagumdi.... nice expressions

  ReplyDelete
 16. మరో మనోహరమైన భావఝరి మీ మదిలోయలనుండి, బాగు బాగు.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!

   Delete
 17. Replies
  1. Thanks for your compliments.

   Delete
 18. అలా.....శుభోదయమై పలుకరించి
  మంచిమాటలతో మైమరపించి
  రేయంతా జాడలేకున్నావెందుకో?...
  హూ...ఏమిటో మనసంతా....ఏమిటో నిశ్శబ్దం
  మీ కవిత చదివినాక...చాలా బాగా వ్రాశారు

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి!

   Delete
 19. ''అలాగ వచ్చి ఇలాగ వచ్చి ,ఎన్నో వరాలమాలలు గుచ్చి ''దేవులపల్లిని గుర్తు చేసారు .
  ఇటువంటి పరిమళ భరితమైన పదాలు ,సుందర సుమదురభావాలు మది నలరిస్తాయి .
  మనసున్న నిజాన్ని మరుగు పడిన మనిషితనాన్ని మరలా పునరుజ్జీవింప జేస్తాయి .
  పద్మార్పిత గారు , నిజం చెప్పాలంటే ఇలాంటి కవితలు అరుదుగా వస్తున్నాయి
  మీ కివే నా అభినందనలు

  ReplyDelete
 20. అభినందించిన మీకు అభివందనాలు!

  ReplyDelete
 21. mee aahwaanam baagundi madam! nenu dily vichhestaanu sumaa yemi anukovadde! thank you!

  ReplyDelete
 22. You are most welcome :-) thank Q!

  ReplyDelete