??????


ఆనందంగా ఉంటే ఓర్వలేదు ఈ లోకం

ఈ లోకానికి ఎందుకో ఈ మాయరోగం?

ప్రేమించే మనసులో నాటుతుంది ద్వేషబీజం
అది ఎదుగుతుంటే చూసి ఎందుకో అంత ఆనందం?

మాటల ముళ్ళని గుచ్చి చేస్తుంది మదిని గాయం
ఎందుకని ఆశిస్తుంది ఎదుటివారి నుండి పూలహారం?

గాయమై రోధిస్తున్న వారిని చూస్తే అదో చోద్యం
ప్రాణం వీడిన దేహానికెందుకో అభ్యంగనస్నానం?

తప్పును సమర్ధించుకుని క్షమను కోరే మనం
ఎదుటివారిలో తప్పునెంచి ఎందుకు శిక్షించడం?

అందరిలోను కొలువై ఉన్నాడు కదా దైవం
మరెందుకని గుడి-గోపురాల్లో ఆ నైవేద్యం?

19 comments:

  1. తప్పును సమర్ధించుకుని క్షమను కోరే మనం
    ఎదుటివారిలో తప్పునెంచి ఎందుకు శిక్షించడం?

    well said!

    ReplyDelete
  2. After a gap with good post Padmarpita.

    ReplyDelete
  3. చాలా బాగుంది

    వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా...

    వారికి ప్రేమించటం రాదు.. వారిని విడగొట్టి రాక్షస ఆనందము పొందుతారు..

    ఎదుటివారి ప్రశంశ మనకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది..

    ఇగ ఎలాగు చేలేరు అని (funny )

    అల చేసి అయిన ఇంక వేరే వారు అలా తప్పు చేయకుంట ఉండాలి అని..

    ఎవరిపిచ్చి వాళ్లకి ఆనందం...

    ReplyDelete
  4. chaala kaalaaniki, manchi kavitha tho vachaaru,
    bhgundi.

    ReplyDelete
  5. అన్నీ నిజాలే! ఇలా ప్రశ్నిస్తే ఏం చెప్పను?
    చెప్పలేను కాబట్టే..
    ఓ..కవిత నయ్యాను ..పద్మర్పిత కలం నుండి జాలువారాను.

    ReplyDelete
  6. hmmm..నిజమే మరి..ఇంతలా గాయమయ్యాక మాటల పలాస్త్రీ రాసే మాయలోకం కళ్ళతో పలకరిస్తూ నొసటితో వెక్కిరించేదే ఎప్పుడూనూ...అయినా మనం చేయాలనుకున్న కార్యాన్ని నెరవేర్చే దృఢ సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే కదా...బాగుందండీ కాస్తా ఎక్కువ సమయం తీసుకున్నా మంచి పోస్ట్ తో తిరిగి వచ్చినందుకు అభినందనలు..

    ReplyDelete
  7. నిజమే పద్మార్పిత గారు... మీరు రాసినవి అన్నీ నిజాలు.... చాలా మంచి పోస్టు అందించారు...

    అదంతా మనిషి నైజానికి నిదర్శనం...

    ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు.. నిజమే... కానీ తనలోనూ ఎదుటివారిలోనూ ఆయన్ని చూడలేకపోవడం మనిషి దౌర్భాగ్యానికి నిదర్శనం

    ReplyDelete
  8. నాకు ఇవే ప్రశ్నలు వస్తుంటాయి జవాబు మాత్రం దొరకదు..
    జీవితం పరీక్షా అంటారు కదా..
    ఇలాంటివి జరిగితేనే మనలోకి మనం తొంగి చూస్తాం కదా అని సరిపెట్టుకుంటాను
    అప్పుడే కదా మనలాగా మనం ఎదుటి వారిని కూడా ప్రేమిస్తాం..
    అందరు అలా చూడలేకపోవచ్చు అంతే..

    ...చిన్న వాడ్ని ఏమైనా తప్పు గా రాసి ఉంటె ignore it. :-)

    ReplyDelete
  9. "మాటల ముళ్ళని గుచ్చి చేస్తుంది మదిని గాయం
    ఎందుకని ఆశిస్తుంది ఎదుటివారి నుండి పూలహారం?"

    మంచి ప్రశ్నలు పద్మార్పిత గారూ..
    ఇవన్నీ ప్రతి మనిషికీ అనుభవమేనేమో...

    ReplyDelete
  10. చాలా బాగుంది......

    ReplyDelete
  11. పద్మార్పితా ?????? ప్రశ్నలకి జవాబులు కూడా నీ కవితలే ఇస్తాయని ఆశ:)

    ReplyDelete
  12. చాలా చాలా బాగుంది పద్మార్పిత గారు.మంచి పోస్ట్.
    అనుభవం లో కి వచ్చే ప్రశ్నలే కానీ సమాధానాలు ఎవరికి వారు అనుభవాలు చెప్పుకొవాల్సినవి.

    ReplyDelete
  13. ప్రశ్నల పరంపర బాగుంది. లోకం తీరు అనుకుంటే పోలా?
    ఓర్వలేని తనం, పోటీతత్వంతో సతమతమౌతున్న మనుషులనా ఈ ప్రశ్న అడుగుతున్నారు?
    కవిత ఎప్పటిలాగే చక్కగా రాసారు.

    ReplyDelete
  14. ప్చ్.....ఇలా మిసైయ్ పోయాను ఈ మధ్య:-(
    Good one.

    ReplyDelete
  15. జీవిత సత్యాలు వ్రాసారు.

    ReplyDelete
  16. chaalaa bagaa varninchaaru padmagaroo

    ReplyDelete