ఉండిపోవే!

భాధలోను భావంలోను నీవే
ఓదార్చ నా చెంత నీవు లేవే!
దూరంగా ఉన్నాను అంటావే
చెంత చేరే మార్గమేదో చెప్పవే!

పగలంతా ఏదోలా గడిపేస్తావే
రేయిమాత్రం క్షణమైనా కదలవే!
అందమైన ఆకారమేల కోరతావే
మనసునెరిగి ప్రయత్నించి పొందవే!

కలలసౌధాలను ఇకనైనా వీడవే
వాస్తవాల్ని అక్కున చేర్చుకొనవే!
అబద్ధపు ఆసరాతో చేరువకాలేవే
నిజమై నిలకడగా నాతోనే ఉండిపోవే!

21 comments:

  1. నచ్చేసిందిగా పద్మార్పితా:)

    ReplyDelete
    Replies
    1. మీరు మెచ్చితే నాకు నచ్చుతుంది:-)

      Delete
  2. చాలా బాగుంది...

    ReplyDelete
  3. చాలా బాగుంది...

    ReplyDelete
  4. meerenduku undipora ani raayaru...
    bagundi, mee feeling.

    ReplyDelete
    Replies
    1. undipora ani raaste...indipovea aneavaaremo:-)
      thanks for comment!

      Delete
  5. padma.....ur thoughts n ur way of writing is very nice...pls. keep it up.

    ReplyDelete
    Replies
    1. Thanks for your compliments and encouragement.

      Delete
  6. 'వే వే '- ల తోడ వేడుట
    యే - వేడుక - పద్మగారు ! ఎటకేగు మనో
    భావన ? మది వీడేనా ?
    పూవును వరిమళము వీడి పోవుట నిజమా ?
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు నెనర్లు.

      Delete
  7. వాస్తవికతకు సౌందర్యానద్దిన మీ భావుకతకు జోహార్లు పద్మాజీ...:-)

    ReplyDelete
    Replies
    1. ఆస్వాధించి అందించిన మీ ఆత్మీయ వ్యాఖ్యకు వందనాలు!

      Delete
  8. పద్మ గారూ!
    కవిత బాగుందండీ!
    చాలా రోజుల్నించి మీరు కవితా లోకం లో కనిపించలేదు అనుకున్నాను...:-)
    మంచి కవిత తో వచ్చారు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాధాలండి!

      Delete
  9. చాలా బాగుంది

    ReplyDelete