24గంటల్లో క్షణమైనా...

ఒంటిగంటకు పడుకుంటే
రెండింటికి కలలోకి వస్తావు!
మూడుకి మగతగా కనుమూస్తే
నాలుగ్గంటలకే నన్ను లేపేస్తావు!
ఐదింటికి పక్షుల కుహుకుహూలతో
ఆరింటికి గాలితెమ్మెరవై నను తాకుతావు!
ఏడుగంటలకి ఎదురుగా లేవనుకుంటే
ఎనిమిదింటికి కర్తవ్యమంటూ కంగారుపెడతావు!
తొమ్మిదిగంటలకి తోవంతా నీ తలపుల్లో ఉంటే
పదిగంటలకి పనిలో మనసులగ్నం చేయమంటావు!
పదకొండింటికి తోటివారితో కలసి "టీ" త్రాగుతుంటే
పన్నెండుకి గడియారంలో ఏకమైనముళ్ళై కవ్విస్తావు!
పదమూడోగంటకి పదిమందితో కలసి భోంచేస్తుంటే
పద్నాల్గవగడియలో పదవే నీతోపాటే నేనున్నానంటావు!
పదిహేనుగంటలకి పని ఒత్తిడిలో మునిగి ఉంటే
పదహారుగంటలైందికదా... అల్పాహారం సేవించమంటావు!
పదిహేడవగంటకి హడావిడిగా పని ముగిస్తుంటే
పద్దెనిమిదవగడియకి పదిలంగా ఇంటికి చేరుకోమంటావు!
పంతొమ్మిదవగడియలో నీ పలకరింపుతో మురుస్తుంటే
ఇరవైగంటలకి నేనున్నాను నీతో భోజనంకానిమ్మంటావు!
ఇరవైఒకటిలో ఒంటరినై నిన్ను తలచి నేను విలపిస్తుంటే
ఇరవైరెండోగడియలోనైనా లోకంతీరు తెలుసుకోమంటావు!
ఇరవైమూడవగంటలో అలసి కునికిపాట్లు పడుతుంటే
ఇరవైనాలుగు గంటలతో ఈ రోజు గడిచింది ఇకచాలంటావు!


ఇరవైనాలుగ్గంటలూ నాతో ఉండే నీవు... నాకంటికెదురుగా క్షణమైనా లేవంటే!!!
కర్తవ్యపాలనలో నేను, ఉద్యోగరీత్యా నీవు... ఒకరికొకరం వేరైనా ఒకటేనంటావు!!!
(ఆర్మీలో పనిచేసే భర్తకు దూరంగా ఉన్న ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలి దినచర్యకు నా కవితారూపం)

39 comments:

  1. అనుక్షణం ఆరాధనం
    అది ప్రణయం అది ప్రణవం
    అద్భుతం మీ కవిత

    ReplyDelete
    Replies
    1. కవితని మెచ్చి ఆస్వాదించిన మీకు అభివందనం!

      Delete
  2. Wonderful!
    చాలా బాగా చెప్పారు ఘడియ ఘడియకీ దూరమయి తలపించే హృదయం...

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి...ఇలా తలచుకుని దూరమైన హృదయాలు చాలా ఉన్నాయండి!

      Delete
  3. హృదయాన్ని మెలిపెట్టి తిప్పాయి ఈ వాక్యాలవెంట కళ్ళు నడుస్తున్నంత సేపూ...చివరకొచ్చేసరికి కంటి కొనలో ఓ కన్నీటి బిందువు ఆర్తిగా...

    ఆమె హృదయాన్ని ఆవిష్కరించిన మీకు అభినందన మందారమాల..

    ReplyDelete
    Replies
    1. మీ సున్నిత హృదయ స్పందనకు నెనర్లు...

      Delete
  4. మీ పేంటింగ్ చాలా బాగుందండి .

    ReplyDelete
  5. Replies
    1. ధన్యవాదాలండి!

      Delete
  6. Excellent writing....n Excellent painting....
    hrudayanni take mee kavitala vennela jallullo....tadichi sedateerutu....

    ReplyDelete
  7. Its really heart touching madam, you are great.

    ReplyDelete
  8. Abha!...entha natural ga undi andi me poem!...Chala baga rasaru :)

    ReplyDelete
    Replies
    1. Hmmm...meeku nachindi kadaa!...anandamga undi:-) thank Q!

      Delete
  9. పదమార్పిత గారూ , మీరు రాసిన కవితలో ఓ స్త్రీ హృదయం కనిపిస్తుంది , తమకు ప్రియమైన వారు దూరం గా ఉంటూ నీతోనే ఉన్నాను అని ప్రతినిత్యం తెలియజేయటం ఓ అనిర్విచనీయమైన భావన . చాలా బాగా రాసారు , మరో మారు ప్రసంసిస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి!

      Delete
  10. chaalaa baagundi..

    Kshanaalu Gantalalo nibideekrutam.

    manasemo.. ksana kshanam aahladakaram.

    kshanam yugamlaa gadavadam ante Intenemo!

    hrudayame parachaanu annattu undi.

    ReplyDelete
    Replies
    1. meeku nachinanduku naaku snathoshamga undi...

      Delete
  11. ప్చ్.....ఎన్నాళ్ళో వారికి ఈ ఎడబాటు?
    కవిత మనసుని మెలిపెట్టినట్లుంది పద్మ;-(

    ReplyDelete
    Replies
    1. తప్పదుకదండి:-( కొందరి జీవితాలు అంతేనేమో!

      Delete
  12. పద్మ గారూ!
    ఆర్ధికమైన లబ్ది ఉన్నప్పటికీ
    ఇద్దరూ వేర్వేరు చోట్ల ఉంది వారు పొందుతున్న వాటికంటే...
    పోగొట్టుకోనేవి చాలా ఎక్కువని సమయం దాటిపోయాక గ్రహిస్తారు...
    చక్కటి ప్రస్తుతి....బాగుందండీ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. కొన్ని పోగొట్టుకుంటేనే
      కొన్ని పొందగలం కదండి
      ఎవరి అవసరాలు....
      ఆశయాలు వారివి....
      ధన్యవాదాలండి!

      Delete
  13. ankellante meeku chaala ishtama andi.

    ReplyDelete
  14. అంకెలైనా, అక్షరాలైనా ఆలోచనకి అవే ఆధారం కదండీ:-)

    ReplyDelete
  15. సాధారణంగా ఉద్యోగస్తులకి తప్పవులెండి ఈ ఎడబాట్లు.

    ReplyDelete
  16. Padma, le poème est trop bonne

    ReplyDelete
  17. ఎడబాటు లోని వేదనను గణితం తో కలిపి అద్భుతం గా పలికించారు.నా కెందుకో ఆర్మీ లోని వారు అలా వివాహం చేసుకొని ఇలా డ్యూటీకి వెళ్ళిపోవటం ,వీరి బాధ గురించి ఎన్నో సార్లు ఆలోచించాను.దీనికి పరిష్కారం వారు 30,or 35 కల్లా పదవీ విరమణ చేస్తారు.అప్పుడు వివాహం చేసుకుంటే బాగుంటుందేమో!

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి ఈ ఐడియా ఏదో బాగుంది:-)

      Delete
  18. chala bagundi...
    anni lines keka
    last lines.soooper..
    ika painting ki matalu levu...
    mottam wowwwwwwwwwwwwwww!! :)

    ReplyDelete
  19. ohhhhhhhh....intala mechchina meeku dhanyavaadalu:-)

    ReplyDelete
  20. చాలా చాలా చక్కగా..మనసుకు రూపం వచ్చినట్లు..బాగుంది.
    తప్పకుండా పంచుకోవాల్సిన పోస్ట్

    ReplyDelete