ఆనందించడానికి కావలసినవన్నీ ఉన్నాయి
కాని...ఆశ్వాదించడానికే సమయం లేదు!
అహ్లాదాన్ని కోరిన నయనాలు అలసినాయి
కాని...ఆదమరచి నిదురించ సమయం లేదు!
అమ్మఒడిన నిదురించిన జ్ఞాపకాలు గుర్తున్నాయి
కాని...ఆమెను పలుకరించ సమయం లేదు!
అనుబంధాలపై భాధ్యతలు అజమాయిషీచేస్తున్నాయి
కాని...వరుసలేంటో తెలుసుకునే సమయం లేదు!
అనురాగపు నీలినీడలు మదిని కలవరపెడుతున్నాయి
కాని...ఏడ్చి హృదయ భారముదింప సమయం లేదు!
ఆశలు ఆశయాలు ఆపేక్షల కత్తిపోట్లకి చచ్చిపోయాయి
కాని...కనీసం వాటిని సమాధిచేసే సమయం లేదు!
అవయవాలన్నీ ధనార్జనకై పరుగెడుతున్నాయి
కాని...అలసటేమిటో తెలుకునే సమయం లేదు!
ఆత్మీయతలకు నా-నీ స్వార్ధాలే అడ్డంకులైనాయి
కానీ...కారణమదని ఆలోచించ సమయం లేదు!
అన్నీ సొంతం కావాలని భావాలు చెలరేగుతున్నాయి
కాని...పరుల చింతకై యోచించే సమయం లేదు!
ఆలోచనలేని అందరి జీవనశైల్లు యంత్రాలుగా మారిపోతున్నాయి
ఇలాసాగితే...పచ్చని జీవితాలు బీడుబారడానికి సమయమక్కర్లేదు!

దేన్నీ అస్వాదించే సమయంలేదు, అంతా ఉరుకులూ పరుగులే, ఎక్కడికో, ఎందుకో? దేనికో? బాగుంది.
ReplyDeleteనిజమే యంత్రాల్లా రోజంతా పని చేసీ చేసీ దేనికీ సమయమే లేదు...
ReplyDeleteబాగుందండీ కవితాలోచన.
అమ్మఒడిన నిదురించిన జ్ఞాపకాలు గుర్తున్నాయి
ReplyDeleteకాని...ఆమెను పలుకరించ సమయం లేదు!
chaala bhaga raasarandi.
pencil sketch bhagundandi,
ReplyDeleteనిజమే సమయంలేనితనాన్ని సృష్టించుకుంటూ అన్నింటినీ కోల్పోతున్నాం..బాగా చెప్పారు..అభినందనలు పద్మాజీ..
ReplyDeleteచాలా చాలా బాగుంది......
ReplyDeleteఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనిషి జీవితం
ReplyDeleteఉరుకులూ... పరుగులతోనే గడిచిపోతోంది. సంపాదనలో పడి
అన్నిటికి దూరమవుతున్నాడు. ఇక ఆనందిచడానికి , ఆస్వాదించడానికి
సమయం ఎక్కడిది? చాలా బాగా రాసారు పద్మార్పిత గారు!
బాగాచెప్పారు పద్మార్పిత.
ReplyDeletegood poetry on current situation.
ReplyDelete-
ReplyDeleteఇప్పటి పరిస్థితులను వర్ణిస్తూ చాలా బాగా వ్రాశారు పద్మార్పితగారూ...
ReplyDeleteNew look to your blog.. Nice! కవిత చాలా బాగుంది..
ReplyDeleteThanks to one and all...
ReplyDeletemee kavithaa pravaaham undagaa jeevithaalela beedubaarathaayi cheppandi. kavitha baagundi.
ReplyDelete