ఎందువలనా!

తుమ్మెదవై మకరందం కావాలంటే కాదనగలనా

నాలోని అందాలన్నీ నీకోసమే అని తెలుపనా!

సీతాకోకచిలుకకి ఆ రంగులెక్కడివో నే చెప్పనా

పువ్వులపై వ్రాలి పుప్పొడిని రుచి చూడ్డంవలన!

అన్ని పూలకీ సువాసనబ్బలేదు ఎందువలనా

పూలన్నీ పూజకు పనికిరావది దైవసంకల్పన!

పుష్పాలకే ఇంత సుకుమారత్వం ఎందుకోచెప్పనా

పడతిలోని సొగసులని పూలతో పోల్చడంవలన!

ఈ తీయనైన మకరందమంతా నీదేనని అనతగునా

పరులకై ఉపయోగపడని జీవితం ఇంకెందువలనా!

15 comments:

  1. 'పరులకై ఉపయోగపడని జీవితం ఇంకెందువలనా!'
    నిజమేనండీ! పరుల కోసం ఉపయిగించలేని జీవితం వ్యర్థం.

    ReplyDelete
  2. chakkaga bhaga chepparu,
    keep writing.

    ReplyDelete
  3. హ్మ్....అంతరంగంలోని ఆవేదనను అందంగా చెప్పగలగడం మీకే సొంతం కదా పద్మార్పితగారూ...
    అభినందనలండీ..

    ReplyDelete
  4. బాగుంది పద్మ గారూ!
    చిత్రంతో సహా...
    @శ్రీ

    ReplyDelete
  5. కవిత ఎప్పటిలాగే బాగుంది, చిత్రం అదిరింది.

    ReplyDelete
  6. ఇలాంటి అందమైన భావాలు మీకెలా వస్తాయో?

    ReplyDelete
  7. పూలలోని మకరందంతో పాటు మర్మం కూడా తెలిపారుగా:)

    ReplyDelete
  8. ఈ తీయనైన మకరందమంతా నీదేనని అనతగునా

    పరులకై ఉపయోగపడని జీవితం ఇంకెందువలనా!
    manchi samdesham.

    ReplyDelete
  9. పద్మ గారూ,

    మీ కవితల గురించి నా స్టయిల్లో ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. " మీ పదాల్లో ఉహలకి అంతులేదు. మీ ఊహల్లో భావానికి అదుపులేదు. మీకేమో అలుపురాదు".

    ఇంకో మాట మీ బ్లాగు హెడర్ ఫోటో చాలా బాగుందడీ.

    మీ
    క్రాంతి.

    ReplyDelete
  10. మీరు, ప్రాస తో వ్రాయ బడుతున్న చిన్న కవితల గ్రూప్ కి ఆహ్వానించబడుతున్నారు......

    పరవశించని సంగీతప్రియుడు ఉంటాడా
    మానస వీణ తంత్రులను సుతారంగా మీటుతువుంటే
    సంబరపడని సాహిత్యప్రియుడు ఉంటాడా
    సుందర కవితకి చివరల ప్రాసలు ఊయలలు వూగుతువుంటే....16th june'12

    .http://www.facebook.com/groups/231263773656888/

    http://www.facebook.com/groups/295811307177451/

    plese visit our groups.. you may like them...

    ReplyDelete
  11. Thanks to each and everyone.

    ReplyDelete