ఓ నేస్తమా....
వేసవితాపాన్ని చిరునవ్వుతో జయించి
వడగాల్పుల్లో వలపుమాటలతో పలుకరించి
చెమటతో శరీరం మండినా శాంతం వహించి
కరెంటుకోతను గడియలైనా క్షణాలుగా భరించి
వీటి నడుమ విధులను సక్రమముగా నిర్వర్తించి
ఎన్నో నిదురలేని రాత్రుల్ని ఎర్రబడిన కళ్ళలో దాచి
మండేసూర్యుని మనసుకునచ్చిన కవితలుగా మలచి
మదినిండా మల్లెల పరిమళాలని మెండుగా గుప్పించిన
నీకై....అర్పిస్తున్నా ఒక చిరుకవితాజల్లు!!!!!
ఓ మేఘమా....
తొలకరి జల్లుతో తడిపేయి నా నేస్తాన్ని
చిరునవ్వుకి దూరం కానీయకు అతడ్ని
వాన పాటలుగా మార్చేయి ఆ మాటల్ని
మధురమైన గడియలై మిగలనీ కాలాన్ని
చల్లని గాలులతో ఆరనీ తడిసిన శరీరాన్ని
విధినిర్వహణలో కలిగించకు అంతరాయాన్ని
సేదతీరనీ నిదురలేక అలసిన కనురెప్పల్ని
ఆలకించి అలరించ రావే నా ఈ విన్నపాన్ని
ఇంక కురిపించు వలపుల ముత్యాల జల్లుల్ని!!!!!
రాత్రి పడిందండీ, మాకో జల్లు మొదటిసారి, ఈ సంవత్సరం
ReplyDeleteOh! enjoy the monsoons of 2012:-)
Deleteమృగశిర కార్తె తొలి దినమే కురిసిన
ReplyDeleteతొలకరి వానతో పాటు
మీ మధురోహల వాన జల్లుతో
మీ నేస్తపు గుండెలో కురిపించిన
ఈ వలపుల ముత్యాల జల్లుతో
గ్రీష్మతాపం చల్లారి
ఉల్లాసంతో ఉత్సాహంతో
మీ ముంగిట నిలవాలని ఆశిస్తూ...:-) అభినందనలు..
మీ అభినందపు జల్లులకు అభివందనములు.
Deleteమీ కవిత చదువుతుంటే వేసవి తాపానికి వీడ్కోలు చెబుతూ... చిరు జల్లులకు స్వాగతం చెబుతున్నట్టు... మండుటెండలో చల్లని ఋతుపవనాల కబురును మోసుకొచ్చినట్టుంది. చాలా బాగా రాసారు పద్మార్పిత గారు!
ReplyDeleteఆహా! చల్లని కబురు నా ద్వారా అందడం నాకు సంతోషాన్ని ఇచ్చిందండి. ధన్యవాదాలు!
Deleteమీ కవితకి నిజంగానే నిన్న వర్షం స్పందించింది పద్మగారూ! కవితలో ఓ జల్లుంది. అభినందనలు
ReplyDeleteఆ జల్లు మిమ్మల్ని కూడా తాకినందుకు ఆనందమాయనండి! థ్యాంక్యూ...
Deleteపద్మార్పితగారు మీ కవితాజల్లుతో మీ నేస్తాన్నేకాదు మమ్మల్ని తడిపారుగా.
ReplyDeleteతడిచింది చాలు, టర్కీ టవల్‌తో తల తుడుచుకోండి, మరీ ఎక్కువగా తడిస్తే జలుబు చేస్తుంది.
DeleteAnonymous: తడిచే వాళ్ళని తడవనీయండి ఆనందంగా..యిలా బెదిరించకండీ..
DeleteAnonymous గార్లకి....ఎవరు ఎలా తడిచినా హాయిగా ఆనందంగా ఆశ్వాదించండి!
DeleteAnonymous...u just shu....
ReplyDeleteTHANK U SO MUCH ARPITA GAARANDI....
Eppatilaage meeru EVERGREEN......... :-) :-) :-)
Keep your :-) EVERGREEN & HEALTHY
DeleteSuper Padmarpita Garu...
ReplyDeleteThank you very much.
Deletegood bhgundandi,
ReplyDeletedhanyavadamulandi.
Deleteమీ కవితాజల్లులో తడిసిన నేస్తానికి..
ReplyDeleteఈ వానజల్లు బోనస్ ఏమోకదండీ!:)
బోనస్? లేక బోర్? తెలియడంలేదు :-)
Deleteసేదతీరనీ నిదురలేక అలసిన కనురెప్పల్ని
ReplyDeletenice poetry.
padma gaaroo kavitha chaalaa baagundi
ReplyDeleteనచ్చి మెచ్చిన మీకు సలాం!
Deletegood!
ReplyDeleteso nice to see this.thank Q!
Deleteపద్మార్పిత..ఋతుపనాల జోరు
ReplyDeleteమీ కవితల జోరు ఇలాగే సాగాలని:)
తప్పక ప్రయత్నిస్తానండి!
ReplyDeleteఅబ్బా సూపర్ అండి మీ కవిత.....
ReplyDeleteనాన్ను ఇంకా వరుణుడు కరునించలేదు వానలో తడుద్దామంటే.. కానీ మీకవితా జల్లులో తడిసాగా ఇప్పటికి ఇది చాలు...
అవునా!!! అయితే మీకో మేఘం అలంకరించుకుంటుంది కామోసు:-)
ReplyDeleteఅప్పటివరకు ఇలా అడ్జస్ట్ అవ్వండి మరి:-)Thank Q!
చాలా బాగా రాసారు
ReplyDeleteథ్యాంక్యూ...
ReplyDeleteనాకిష్టమైన పాటల్లో ఒకటి విన్నాను...:-)
ReplyDeleteమీ కవితల జల్లు...
మీ మిత్రులందరికీ(అందులో నేను ఉన్నానండోయ్)..:-))
వేసవిలో తొలకరి జల్లులా అనిపిస్తే ఆశ్చర్యం లేదు..
చాలా బాగుంది..
@శ్రీ
మిత్రుల్లో మీరు ఒకరైనప్పుడు అభిప్రాయాలు,
ReplyDeleteఇష్టాలు ఒకటవ్వక తప్పవుకదండి!!!:-)
thank Q...
మృగశిర పలకరింపులతో.. తొలకరి మెలవింపుతో.. పుడమి పులకరించే...
ReplyDelete