ఒంటరినై....

అందరిలో నే ఒంటరిగా ఉన్నా
ఒంటరిలో నిన్ను తలంచి...
నలుగురిలో నవ్వేస్తున్నా!

గువ్వలు గూటికి చేరుకున్నా
నువ్వులేని గూడునెంచి...
ఒంటరినై విలపిస్తున్నా!

నీవస్తావని సింగారించుకున్నా
అద్దంలో నన్ను నేగాంచి...
మిడిసిపడలేక మిగిలున్నా!

కలనైనా కనిపిస్తావనుకున్నా
మూతపడని కనులుతెరచి,,,
నిదురకై నేను ఎదురుచూస్తున్నా!

అనురాగానికి అర్థం నేనన్నా
అందని నీకేం అందించి...
ఆప్యాయతను ఇవ్వననడుగుతున్నా!

11 comments:

 1. చాలా బాగా రాశారండీ!

  ReplyDelete
 2. nice one with good flow.. congrats

  ReplyDelete
 3. ఎప్పటిలాగానే అదిరింది పద్మా...రాస్తూనే ఉండండి!

  ReplyDelete
 4. I love the new look of your web page. It's a visual treat. Your poems are very sweet too!

  ReplyDelete
 5. అందంగా అలంకరించిన మీ బ్లాగ్ మనసు దోచింది.

  ReplyDelete
 6. వీక్షించిన వారందరికీ వందనములు.

  ReplyDelete
 7. కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...
  చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు.
  మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.

  ReplyDelete
 8. అందరిలో నే ఒంటరిగా ఉన్నా
  ఒంటరిలో నిన్ను తలంచి...
  నలుగురిలో నవ్వేస్తున్నా!
  ee feeling raadhamani chaala sarlu try chesa, valla kaledu.
  kani meeru chaala bhaga express chessru, simple ga.
  keep writing

  ReplyDelete