నా కనులు...

నా కనులు...
నన్ను నాకు చూపాయి
లోకాన్ని చూడమన్నాయి
మంచీచెడులను చూసాయి
ఎన్నో కలలకు రూపాలైనాయి!
నా కనులు...
ఎదఘోషను తెలిపాయి
పెదవి పలుకని పదాలైనాయి
మౌనంగా ఊసులే చెప్పాయి
భావాలకు భాష్యాలు నేర్పాయి!!
నా కనులు...
ఎన్నెన్నో కళలు నేర్చాయి
భాధలో భాష్పాలై ఓదార్చాయి
ఆలోచనలకు బంధీ అయినాయి
మనసుకు మాత్రం లొంగిపోయాయి!!!

15 comments:

 1. చాలా చక్కగా కనులు చెప్పే భావాలన్నీ చెప్పారు

  ReplyDelete
 2. భావాలకు భాష్యాలు నేర్పాయి!!....
  ఈ లైన్ చాలా బాగుంది...బాగా రాసారు!

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. కనులలో దాగిన భావాలను హృద్యంగా చెప్పారు....అభినందనలు...

  ReplyDelete
 5. నిర్మల మనో విలాస శ్రీ నిధులు గురియు
  చూడ్కిగమి తోడ ‘ మీకనుల్ ‘ చూడ చూడ
  వ్రాలి కదులాడు బ్రమర పాపలను గూడి
  తెల్ల పద్మాలు విచ్చిన తీరు దోచె

  బ్లాగు: సుజన-సృజన

  ReplyDelete
 6. wow! what a beautiful expressions by your eyes.

  ReplyDelete
 7. కనులు చెప్పే భావాలన్నీ చక్కగా చెప్పారు...

  ReplyDelete
 8. చాలా చాలా బాగుంది....కనుల గురించి మీరు చెప్పిన బాష్యం

  ReplyDelete
 9. చాలా చాలా బాగుంది....కనుల గురించి మీరు చెప్పిన బాష్యం

  ReplyDelete
 10. Hello Padmarpita, I see you have used my 'Eastern Eyes' painting in the blog-post above, you should have also included accreditation and a link-back to my website somewhere in your post, as-per my Creative-Commons licensing agreement. I would appreciate it if you would do so, thank you, Chris Chalk www.chrischalkart.com ( nice blog by the way! )

  ReplyDelete