వింత బంధం

ఓ బాబు...బీటు వేసి సైటుకొట్టమంటే
కన్నుకొట్టడమే రాదని కాలరెగరేస్తావు

ఈల వేసి ఇంగితమేదో వివరించమంటే
విజిల్ అంటే ఏమని పజిల్ ఫేస్ పెట్టావు

కూత కూసి కూనీరాగమే తీయమంటే
స్కూల్ ప్రేయర్ పదిసార్లు అప్పజెప్పావు

జీన్స్ ప్యాంట్ తో దూసుకొచ్చేయ్ అంటే
లాల్చీపైజామాలోనే  లవ్వుచేయమన్నావు

మీసకట్టైనా చూసి మురిసిపోదామనుకుంటే
మెలితిరగని మొరటుమీసమని కత్తిరించావు

స్పోట్స్ షూ వేసుకొచ్చెయ్ పారిపోదామంటే
చెప్పులేసుకొచ్చి తప్పని  చెంపలేసుకుంటావు

సిక్స్ ప్యాక్ కండలకై కసరత్తులు చేయమంటే
కండలుఏల మనసుచూసి మోహించమంటావు

ఎంతో అమాయకుడవని అక్కున చేర్చుకుంటే
అయస్కాంతమై అంటుకుని నన్ను వీడకున్నావు

24 comments:

  1. మొత్తానికి కలిసారు ఇద్దరు. కధ సుఖాంతమైనట్లు. సున్నిత హాస్యంతో బాగుంది మాడం మీ కవిత.

    ReplyDelete
  2. ఇప్పుడు అతుక్కున్నాడా అయస్కాంతంలా.Its too late madam.

    ReplyDelete
  3. అనుకున్నవన్నీ ఉంటే ప్రేమ పుట్టడం గొప్పకాదు
    ఏం లేకపోయినా అన్నీ ఉన్నాయనుకుని ప్రేమించడం గొప్ప.

    ReplyDelete
  4. ఏంటీ అయస్కాంతంలా అంటుకున్నాడా?
    మీరేమైనా ఉక్కుమనిషా....కాదు మేలిమిబంగారం ;-)

    ReplyDelete
  5. అంతా సవ్యంగా చెప్పేస్తున్నారు అనుకుంటే చివర్లో చాచికొట్టినట్లు రాసారు ముగింపు. ఆ లైన్సే మీ కవితావృక్షానికి వేర్లు పట్టుకొమ్మలు కూడాను.

    ReplyDelete
  6. నిజానికి నువ్వు కోరితే కాదనే కుర్రకారు ఎవరు పద్మార్పితా.....నువ్వు మనసులో అనుకుంటే ఎదురుగా ప్రత్యక్షమైపోతారు. అయస్కాంతం నువ్వు కానీ అతను కాదు. కాలేడు :-) సరరదాకి సీరియస్గా తీసుకోకు. కవిత చిత్రం రెండూ సింపుల్గా బాగున్నాయి.

    ReplyDelete
  7. ఇంత లొల్లిచేసి అదిగావాలే ఇదిగావాలే అని ఓకె అన్నది అన్నట్లు. ఆడోళ్ళు ఎప్పటికి అర్థంకారు.

    ReplyDelete
  8. ఏమీ లేకపోయినా మనసు ఉంది కాబట్టి ఇంకేం వద్దని ఒప్పేసుకుంది మీ కవితా నాయకి. బాగుందండి.

    ReplyDelete
  9. సరదాగా మొదలై నవ్వుల సెలపాట సాగి చల్లని హేమంతం గుండెల్లో ఒంపినట్లుగా ముగించారు... చాలా ఆహ్లాదం గా ఉంది

    ReplyDelete
  10. అయస్కాంతం కాదది వయస్కాంతం. ఆమె కోరుకున్నట్టు రాకపోయినా... మనసుకి నచ్చినట్టు వచ్చాడు తుంటరి చిన్నోడు. తెలివైనోడే. ఎంతైనా బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యమే మిన్న అని మీ చిత్రం గొప్పగా చెప్తోందండోయ్‌. అయినా యాజ్‌ పర్‌ సైకాలజీ... చిన్నదానిికి... కాస్త రఫ్‌గా ఉండే చిన్నోళ్లే నచ్చుతారని వినికిడి. అలాగే బయటకు సుతారంగా కనిపించే మొరటోళ్లే... అమ్మాయిల గుండెల్లో 'THE COMPLETE MEN' కదా.
    అందుకే తెగ నచ్చేశాడు. చిత్రం అదుర్స్‌. ఇంతకీ నాకో డౌట్‌. అయస్కాంతలా అతుక్కుపోయింది. చిన్నోడా... చిన్నదా ?

    ReplyDelete
    Replies
    1. Magnet antene North South South North.. Ammaayi Abbaayini Atukkundo ledaa abbaayiammayini attukkundo cheppadam kastam Sateesh gaaru Poliarity Reversal aite aamada dooram paaripotaaru kadaa.. North North Repels.. :)) Raymond's THE COMPLETE MAN has come to my mind seeing your comment.

      Delete
    2. ఏంటండి సతీష్ గారు. అని పొగిడేసారు. కొంపదీసి అవే క్వాలిటీస్ మీలోను ఉన్నాయా:-)

      Delete
    3. అబ్బ నిజంగా... అవునండి.. నేను అమ్మాయిల ముందు... నున్నగా షేవింగ్‌ చేసుకుని కనిపించాలని కోరుకోను. అప్పటికి నేనెలా ఉంటే... అలానే కనిపించాలనుకుంటా

      Delete
  11. వింతలో వింత .. కొంచం హాస్యం దట్టించాను అపహాస్యం అనుకోవద్దు :-)
    నుడికారాలు మెలి తిరిగితే కూరకారం అంటూ కంటనీరు పెట్టి వెటకారాలా మిరియాలు నూ రొద్దు :-)

    బీట్ కానిస్టేబుల్ కాదు నేను బీటేయ్యడానికి
    ట్రైన్ గార్డ్ ను కాదు నేను విసిల్ వెయ్యటానికి
    గాత్రమాదుర్యమే లేదు కూని రాగాలాపనకి
    జీన్స్ ఒకటే ఉంటె ఉతికారేసా పొద్దున్నే తంతికి
    తిప్పి తిప్పి అలవాటుగా మారకుండా తీయించెసా మీసం మొన్నటికి
    స్పోర్ట్స్ షూ కోరికేసింది రెండు రోజులు వేసుకునేపాటికి
    సిక్స్ ప్యాక్ బదులు పేస్ ప్యాక్ బాగుంటుందని వేసుకున్న ముఖానికి
    ఐస్ ఐ కరిగి పోకుండా అయస్కాంతమే ఐనప్పటికీ మనసు మనిషిదే ఏనాటికి

    Disclaimer: Commented just for fun purpose.

    మీ కవిత చాలా బాగుంది. చూసి నవ్వొచింది అందుకే ఈ ప్రయోగం

    కొసమెరుపు :
    మోడరన్ కవిత కు జానపదాల ఎంకి? నాయుడు మావా.. ??
    సుబ్బి గాడేడో .. !!

    వద్దులెండి రాకపోతేనే మంచిది
    ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచిందని అంటారు కదా అందుకని :-)

    ReplyDelete
  12. అయస్కాంతంలా అతుక్కుపోయాక ఇంక వింతైనా తప్పదు కదా బంధం.. :-)

    చిత్రం మాత్రం అదిరిందండీ పద్మ గారు..

    ReplyDelete
  13. మేడం.. మీరో అధ్బుతంలా అనిపిస్తారు. జీవిత సారాన్నిఅద్దంపడుతూ ఒక కవిత్వంలో ఎంతో పరిణితి చెందినట్లుగా రాస్తారు ...తేరుకోకముందే ఇలా ప్రేమ కావ్యాల్ని చిలిపిగా వర్ణింస్తారు... ఎంత వైవిధ్యం !! మాటల్లో చెప్పలేని అనుభూతుల్ని అక్షరీకరించడంలో మీరు దిట్ట. అందుకే మీరు మా అభిమాన కవయిత్రి.

    ReplyDelete
  14. "సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం" అన్నట్లు, ఏమీ కోరుకున్నవి లేకపోయినా మనసున్నదని సర్దుకోవడమే తప్పదు పద్మార్పితగారు. సామెత కోసం అలా వ్రాసాను కానీ కవిత సూపరండి.

    ReplyDelete
  15. నా తుపాకీతూట్లకి పదును తక్కువ ఆవేశం ఎక్కువ, ఎం వ్రాయాలో తెలియక ఈ తిప్పలు.

    ReplyDelete
  16. మంచి ప్రేమకవిత రాసినారు పద్మజీ

    ReplyDelete
  17. యే గతి రచియించిరేని సరికాలము వారు మెత్తురే కద?
    అనే దిగులు పద్మార్పిత గారికి మాత్రం రాదు గాక రాదు!

    ReplyDelete
  18. అచ్చమైన తెలుగు బ్లాగు

    ReplyDelete
  19. స్పంధించి స్పూర్తినందిస్తున్న స్నేహశీలులందరికీ వందనములు._/\_

    ReplyDelete