నేను నేనే


నేనో కలని, కవ్వించి ప్రేమించకు
ప్రేమిస్తే పలకరించి ప్రస్తావించకు
ప్రణయవీచికలు వచ్చి పోతాయి
నిశ్చలం అని చెప్పి నమ్మించకు!

నేనో పువ్వుని, మురిసి తృంచకు
తృంచి హారమని నీవు ధరించకు
పరిమళంలేని పూలు వాడతాయి
కాగితం పువ్వేనని విసిరివేయకు!

నేనో జ్వాలని, వింజామరై వీయకు
వీచి వలపుసెగలు రేపి జ్వలించకు
రగులుతున్న కోర్కెలని ఆర్పివేయి
నివురుగప్పిన నిప్పును రాజేయకు!


నేనో కన్నీటిని, జాలిపడి తుడవకు
తుడిచి పవిత్రతను పొందాలనుకోకు
పాపపుణ్యాలు పకపకా నవ్వుతాయి
స్వచ్ఛమైన ఆరాధానని ప్రేమనుకోకు!

నేనో తెల్లకాగితాన్ని, పిచ్చిగా రాయకు
రాసి నిఘంటువులో అర్థాలు వెతుకకు
మసిబారిన మనసుకి సున్నం పూయి
నీ నిర్లజ్జ వైఖరిని వేరొకరి పై నెట్టేయకు!

25 comments:

 1. wah wah poem is good.
  eam cheyavaddu antea eam chestam :-)

  ReplyDelete
 2. Madam Padma Awesome Words.
  A Big Clap to Your Poem.

  ReplyDelete
 3. చక్కని చిక్కని భావంతో తెలుగుదనం కలబోసిన కవిత పద్మగారు.

  ReplyDelete
 4. కలలా కరిగిపోకు కలతలే నిలిపి
  పువ్వులా వాడిపోకు పరిమళాన్నే వెదజల్లి
  నిప్పు రవ్వలా మండిపోకుచిరు తీమిరాాన్ని తరిమికొట్టి
  కన్నీటి బిందువుగా కరిగిపోకు కలల కోలను వై
  భావాని కావ్యంలా మార్చి రాసుకో అక్షరాల మాలీకై కాగితానా

  బాగుంది పద్మ గారు మీ కావ్య పదబంధం

  ReplyDelete
 5. ఇంకో స్టాంజా పెట్టుంటే మీ సొమ్మేం పోయేదో... :-((

  ReplyDelete
 6. ఈ కవిత మీ చాలా కవితల కన్నా భిన్నం! దీనికి ముగ్ధులు కాని వారెవ్వరూ ఉండరు మేడం! ప్రతి స్తాన్జాలో మొదటి పంక్తులు ముక్తపదగ్రస్తాలంకారం,,, అక్కడక్కడా అనుప్రాసలతో.. చక్కటి నిర్మాణంతో... వైవిధ్యభరితంగా మీ భావాన్ని మా మనస్సులో అందంగా జొప్పించే ప్రయత్నం సంపూర్ణం అయిందండీ. _/\_

  ReplyDelete
 7. పాత పరిమళించే పదాలతో మరోకవితని అందించారు పద్మార్పితగారు. ప్రతిపంక్తి అర్థవంతంగా ఉన్నాయి.

  ReplyDelete

 8. నేనో కన్నీటిని, జాలిపడి తుడవకు
  తుడిచి పవిత్రతను పొందాలనుకోకు
  పాపపుణ్యాలు పకపకా నవ్వుతాయి
  స్వచ్ఛమైన ఆరాధానని ప్రేమనుకోకు
  సూపర్ లైక్ పద్మగారు.

  ReplyDelete
 9. నేనో తెల్లకాగితాన్ని, పిచ్చిగా రాయకు, రాసి నిఘంటువులో అర్థాలు వెతుకకు life is korakagaz, write whatever you like.

  ReplyDelete
 10. మీరు మేరే ఎప్పటికీ
  కాదన్నది ఎవరు--హా హా హా
  just kidding. FANTASTIC POEM

  ReplyDelete
 11. కలలో, పువ్వులో, జ్వాలగా, కన్నీటిగా, తెల్లకాగితానివై అన్ని లక్షణాలని పుణికిపుచ్చుకున్న భావకవిత్వం. మెండైన చిత్రంతో అలరించింది-హరినాథ్.

  ReplyDelete
 12. so beautiful painting with suitable lines.

  ReplyDelete
 13. నేనో జ్వాలని, వింజామరై వీయకు
  వీచి వలపుసెగలు రేపి జ్వలించకు
  మండే జ్వాలకు నూనెపోసి మంటను పెంచుతారు, ఇంక ప్రేమ ఎంత దాని పోకడ ఎంత చెపండి. భావాన్ని బాగా పండించారు కవితలో.

  ReplyDelete
 14. ప్రేమించలేం
  తృంచలేం
  జ్వలించలేం
  పొందలేం
  తెలుసుకోలేం

  ReplyDelete
 15. ప్రణయవీచికలు వచ్చి పోతాయి
  నిశ్చలం అని చెప్పి నమ్మించకు
  చాలాసున్నితంగా, నిర్ధిష్టంగా మీ అభిప్రాయాలని కవితలో చెప్పినట్లుందండి.

  ReplyDelete
 16. లోతట్టు భావకవిత్వం పద్మా. మరో బాణం వేసినట్లుంది :-)

  ReplyDelete
 17. మాటల తూటాలు, గాయాలు మీరే ఇక మిగిలింది ఏముందని కామెంటడానికి

  ReplyDelete
 18. నేనో తెల్లకాగితాన్ని, పిచ్చిగా రాయకు
  రాసి నిఘంటువులో అర్థాలు వెతుకకు .... సున్నితమైన వాక్యాల్లో గంభీరతను పండించడం మీకు మాత్రమే సాధ్యం ...

  ReplyDelete
 19. మీ భావాలకి నా జోహార్లు. చిత్రం చాలా నచ్చిందండి.

  ReplyDelete
 20. మాడం బ్లాగ్ పై అలిగారా? రిప్లైస్ లేవు. పోయంస్ లేవు.

  ReplyDelete
 21. ఫేస్ బుక్ పై మోజు బ్లాగ్ పై చిన్న చూపేల మాడంగారు. మీ పోస్ట్ల కోసం ఫేస్ బుక్ తెరిచా :-)
  ఇక కవిత గురించి చెప్పాలంటే...ఎప్పటిలాగే బ్రహ్మాండం అనలేను. ఈ మధ్య మీ పోస్ట్లలో ఎదో సాంద్రతా లోపం. తిట్టుకోకండి.

  ReplyDelete
 22. మీరు మీరే...మీరు యూనిక్

  ReplyDelete
 23. ఆదరించి అభిమానిస్తున్న అక్షరాభిమానులందరికీ అంజలిఘస్తున్నాను_/\_

  ReplyDelete