ఏది ఏమిటో!


అక్షరాలకీ ఆలోచలకీ లింకు దొరక్క లంగరువేసి
అంతరంగాన్ని అదిమేసి సంబరమే చేసుకోబోతే
పదానికీ పద్యానికీ వ్యత్యాసమడిగితే ఏంచెప్పేది?
అక్షరాలనే అందంగా అమర్చి పదమని పలకనా
పదాల సమూహాన్నే మాటల మూటలని చెప్పేసి
మదిమాటల్ని పదిలంగా పోగుచేసి పద్యమననా!!

ఊహలకీ ఉధ్వేగాలకీ పొత్తు కుదరదని వదిలివేసి
మంచీ చెడని మనసునే మధించి మచ్చిక కోరితే
బంధమే పెనవేసి మదిని బంధించబోతే ఏంచేసేది?
పైకి కనబడేది శిల్పమైనా లోన కరిగేది వెన్నకాదా
కలనైనా చెప్పలేని ఊసుల రంగుల చిత్రమే గీసేసి
భావాలకే అక్షర రూపమిచ్చి కవిత్వమంటే కాదా!!

ఆశలకీ ఆశయాలకీ సాంగత్యమే లేక సంకెళ్ళువేసి
బ్రతుకున సంకల్పమే లేదని సంఘర్షణే చేయబోతే
నీట ప్రతిబింబమే చూపి నింగినని పొగడ ఏంకోరేది?
సరదాగా తాకి సాన్నిత్యమే చూపితే స్నేహమననా
కలిసి చెలిమని చేతులు నలుపుతూ కబుర్లే చెప్పేసి
వ్యంగ్యంగా వరుసలే కలిపేసి రాస్తే సాహిత్యమగునా!


(బ్లాగ్ లో 400 పోస్ట్లని రాసి మీ అభిమానాన్ని పొందాలని నేను చేసిన ప్రయత్నంలో మీరు ఇబ్బంది పడి నన్ను సంబరపెట్టిన మీ అందరికీ అంజలి ఘటిస్తూ పద్మ అర్పిస్తున్న చిరు చందన కుసుమాలే ఈ వందనాలు_/\_ _/\__/\_ )

30 comments:

 1. అభినందనలు మీకు పద్మార్పితగారు
  మీ అక్షరకుసుమావళి
  మా కనులకు రంగవల్లి
  మది పై రంగులహోళీ

  ReplyDelete
 2. పైకి కనబడేది శిల్పమైనా లోన కరిగేది వెన్నకాదా
  కలనైనా చెప్పలేని ఊసుల రంగుల చిత్రమే గీసేసి
  భావాలకే అక్షర రూపమిచ్చి కవిత్వమంటే కాదా!!
  సున్నిత భావాలని కాదనే కుసంస్కారులు ఎవరు?
  కంగ్రట్స్ అర్పితా,,,,,,,,అంకిత భావాక్షరాలకి

  ReplyDelete
 3. Excellent post on woman empower with sensitive heart touching words mam..kudoos

  ReplyDelete
 4. మీ అంతరంగంలో గల అంతులేని భావాలే కదండి మమ్మల్ని అలరించే కవితాకుసుమాలు!!
  ఈసారి లేట్ అయినా కాూడా చక్కటి పదచిత్రంతో కనువిందుచేశారు...
  మీ పదాలు పద్యాలో సాహిత్యమో కవిత్వమో ఏదైనప్పటికీ అక్షరానికీ అక్షరానికీ మద్య అందమైన బంధమేదో వేసి మా మనసు మాత్రం దోస్తారు ....
  Hats off to you Madam. and Happy Women's Day

  ReplyDelete
 5. పద్యాలు, కవితలు. తెలుగు సాహిత్యాన్ని అవలీలగా రాసి మెప్పించే మీరు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాము.

  ReplyDelete
 6. నేటి సొసైటీ మీరన్నట్ట్లుగానే ఉన్నది. కానీ, మీ కవితను చదివినవారు అక్షరాన్ని అక్షరంగానే తీసుకుంతారుకానీ ఆచరణకి కాదు.

  ReplyDelete
 7. అక్షరాలలో ఎమున్నది భావం తప్ప
  ఊహలలో ఎమున్నది నిజానిజాలు తప్ప
  ఆశాలలో ఎమున్నది నిస్వార్థం తప్ప
  కల్మషాలే ఎరుగని రాధా మాధవుల ఆరాధన భావం
  నిరాడంబరతకే నిలయం ఆ బంధం ఆ రాధకృష్ణులకే సొంతం

  ఇది మీ కవితకు ప్రత్యుత్తరం కాదు పద్మ గారు మీ 400 కవితల ప్రస్థానానికి అభినందన

  ReplyDelete
 8. మనిషి నాడి చూసి వాతపెడతారు మీరు.
  ప్రస్తుతం ఎవరెవరికి వాతపెట్టారు తీరిగ్గా చెప్పండి
  నాలుగు శతకవితలు పూర్తిచేసిన మీకు అభినందనలు.

  ReplyDelete
 9. నాకేం సమజ్గాలే...మొత్తానికి మస్తుగ రాసినవ్

  ReplyDelete
 10. ఊహలకీ ఉధ్వేగాలకీ పొత్తు కుదరదని వదిలివేసి
  మంచీ చెడని మనసునే మధించి మచ్చిక కోరితే

  పైకి కనబడేది శిల్పమైనా లోన కరిగేది వెన్నకాదా
  భావాలకే అక్షర రూపమిచ్చి కవిత్వమంటే కాదా!!

  కాదనే దమ్ము ధైర్యం ఎవరికుంది చెప్పండి??????!!!!!!,,,,,

  ReplyDelete
 11. Outstanding poem with honorable thoughts

  ReplyDelete
 12. మీకు నా మనస్పూర్తి అభినందనలు
  కవిత మీ స్థాయికి మరో మచ్చుతునక.
  మీ భావ వింజామర వీచిక.

  ReplyDelete
 13. Wish you happy Women's day Padma.
  అఖండురాలివి అనడం కరెక్టేనా ఇక్కడ.
  ఏమైనా కవిత మాత్రం నీ భావదర్పణం

  ReplyDelete
 14. badaayi ho padmaji.
  its too hard to digest such poetry. :-(

  ReplyDelete
 15. నాలుగువందల బులెట్స్ దూసుకెల్లాయా ఇప్పటి వరకు మీ కలం నుండి. ఎంతమంది గాయపడ్డారో :-) ha ha ha
  CONGRATS MADAM

  ReplyDelete
 16. మాడం మమ్మల్ని దెప్పిపొడిచింది చాలు. హాస్యరసాన్ని అందించండి

  ReplyDelete
 17. ఆశలకీ ఆశయాలకీ సాంగత్యమే లేక సంకెళ్ళువేసి...చాలా సౌమ్యమైన శైలి మాడం. అభినందనలు.

  ReplyDelete
 18. హెల్ఫ్ హెల్ఫ్....నా ముఖపుస్తకం దొబ్బింది. ఎవరైనా నన్ను బ్రతికించండి. నేనేం పాపం చేసానని నన్ను వెలివేసారో తెలీదురా భగవంతుడా!!!!!!?????
  పద్మార్పితగారు మీరేమైనా చేయగలరా.....హెల్ఫ్ హెల్ఫ్ ప్లీజ్ ప్లీజ్

  ReplyDelete
  Replies
  1. ayyo ayyo ayyayo
   login with proper ID proof :-)

   Delete
  2. Ayyo Paapam.. Ponilendi.. Evari paapaanaa vaaru potaaru.. Meeku kaastaina Manasshanti Dorukutundi. Anduke Nenu ee Mukhapustakaalu, Aa Pakshi Kuvakuvala Joliki Poneledhu eppudu nu.. Ippudaina kaasta oopiri peelchukondi Aakaanksha gaaru.. [Atunundi Chembulu Tapelaalu Emi Visarakandi.. Screen Pagilite [[Unnadi kaastaa vudindi sarvamangalam paadindi anna chandaanaa aitadi]]

   P.S.: Mee Comment ki koncham haasyam vyangyam jodinchina reply idi.. emanukokandi


   If you want, you may create another account on Facebook. (Sincerely, I never have used the Facebook or Twitter, Aakaanksha gaaru)

   Sincere Apologies, if my language is out of context

   ~Sri

   Delete
  3. హు...అవును మీలాగే నేను బుద్ధి బ్లాగ్ చుసుంటే బాగుంటుంది అని నిర్ణయించేసుకున్నాను మీరు రాసినది చదివి. అయినా మరోసారి ప్రయత్నిస్తాను ఎంతైనా అల్లరి చేయడానికి అనువైన ప్లేస్ ముఖముస్తకమనే అందరూ అక్కడ బారులు తీరి ఇక్కడ బ్లాగ్ ని మరిచారు అనుకుంటాను,,,,ఏమంటారు శ్రీధర్ బుక్యాగారు.
   No more apologies between blog friendships.

   Delete
  4. Sridhar Bukyagaru cheppindi follow aipondi Akaansha. twaraloe nenu adea cheyabotunnanu. Facebook is uncertain :-)

   Delete
  5. Blog Lo Chittipotti kavitalato elaagu alaristaaru kadaa ide follow aipondi.. marem parvaaledu lendi padma gaaru koodaa ade antunnaaru kadaa.. :)
   Annattu mee Chittipotti kavitala blog ki ee chitti URL:

   http://goo.gl/4vWrJf

   Padmagaaru Idi Mee Blog ku:
   http://goo.gl/xd1Gu1

   Thank you Padma gaaru
   Thank you Aakanksha gaaru

   Delete
 19. Padmagaroo suprrr kavita.
  miku abhinandanaloo

  ReplyDelete
 20. 400కి ఇంకొక సున్నా చేర్చి 4000కవితలు వ్రాయాలని ఆశిర్వధిస్తూ, భవ్య కవిత-హరినాధ్

  ReplyDelete
 21. అభినందనలతోపాటు ప్రోత్సాహాన్ని అందిస్తున్న అందరికీ అభివందనార్పితం _/\_

  ReplyDelete
 22. congratulations on completion of 400 wonderful poems Padma.

  ReplyDelete
 23. మీ అంతరంగాన్ని మీరు కూడా చుసుకోరాదని నా విజ్ఞప్తి!

  ReplyDelete
 24. ఈ లక్ష్యం సాధించడం వెనుక ఉన్న మీ కృషికి అభినందనలు ....

  ReplyDelete