తూట్లు చేస్తూనే ఉంటావు
నేను నవ్వుతూ నవ్విస్తూ
పెదవులకి కుట్లు వేస్తుంటాను.
నా దారిలో అడుగడుగునా
నీవు వదిలి వెళ్ళిపోతుంటావు
నేను స్నేహ హస్తం అందిస్తూ
హితుల జాబితాలో జోడిస్తుంటాను.
నాది నాదన్న స్వార్థంతో
అబధ్ధాన్ని ఆసరా కోరుతుంటావు
నేను మాత్రం నిజమని నమ్మేస్తూ
ఆశల వంతెననే నిర్మిస్తుంటాను.
నా నిర్మల మదిని తిట్టుకుంటూ
నిన్ను నీవు మెచ్చుకుని మురుస్తావు
నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.
మనసు ఎరిగిన మనిషి నమ్మకానికి నిదర్శనం మీ భావ కవిత పద్మ గారు
ReplyDeleteపెదవులపై నవ్వు సంతకమె ఎప్పటికీ చేరగాదు.
ప్రతి అడుగు మడుగులో చేతిని అందివ్వాలనే తపన కానవస్తుంది
స్వార్థం ఎప్పటికీ నిలిచి ఉండదు ఆది మనిషిని లోలోపల కృంగాదీసే మాయరోగం సూమి
మనసులో మాదిలే భావాల ఏరులో ప్రతిబింబం తేటతెల్లమై నిఖీలమై నిలిచేను. నమ్మకమె పునాది దేనీకైనా. జీవితానికి పరమార్థం అదే. చక్కని కావ్యరూపకం.
ఫేస్ బుక్ జనాలకి పద్మార్పిత గారు మీ కమెంట్ చదివే నమ్మకం నమ్మకం నమ్మకం అనే పాటను లింక్ ఇచ్చారు కామోసు!. మనమేం పాపం చేసామని ;-(
Deleteఆకాంక్ష గారు ఫేస్ బుక్ సంగతేమోగాని నాకైతే ఎం తెల్వది
Deleteఈడ నా కామెంట్ జనాలకి నచ్చనికి కాదు సొచాయించనికి
గదేం పెద్ద పాపం గాదు పాపపుణ్యాల బేరీజు వేసే వారు సమవర్తి
గాని ఇక్కడ కామెంట్ ను నమ్మకం గా చూస్తె అందులో దాగుంది సమయస్పూర్తి
నమ్మకం అనే పాట కాదు కదా నమ్మకానికి ఏ తార్ఫిదు అవసరం లేదని చెప్పనికి ఈ కవిత రాసినారు ఆకాంక్ష గారు. ఎవరి పాపానికి వారే బాద్యులు అందరి పుణ్యానికి దేవుడే ఆద్యుడు కాదంటారా. అదే నిజమైతే రెండు చేతులు జోడించి "ఓం నమో కేశవాయ మదుసూదనాయ నమామ్యహం" అనుకోండి. మీ యాకులత తీరి ఆనందం మీ కంప్యూటర్ స్క్రీన్ తడుతుంది :-)
;-( ఇలా వద్దండి :-) ఇలా ఐతే ఓకే
* వ్యాకులత కు బదులుగా యాకులత అని అచ్చైనది మన్నించగలరు
Deleteఅమ్మోయ్ నేనేదో సరదాగా అనంటే ఇంతలా ఉపదేశం చేయవలసింది అంటారా :-)
Deleteమీరు చెప్పింది అక్షరాల నిజం శ్రీధర్ గారు. థ్యాంక్యూ.
Deleteఆకాంక్షగారు మీరు ఫేస్ బుక్ విషయాలు ఇక్కడ చెప్పి కలహాలు పెడుతున్నారు కామోసు! మీలో నారదుని లక్షణాలు కనబడుతున్నాయి :-) Just kidding :-)
DeleteVery nice poem with lovely painting mam.
ReplyDeletethank you Payal
Deleteనేను నీలోని మంచితనాన్ని చూస్తూ
ReplyDeleteకానరాకపోయినా ఉందనే నమ్ముతాను.... ఎదుటి వారిలో కానరాని ( లేని ) మంచితనాన్ని కూడా నమ్మే మీ మంచితనానికి నిజంగా అభినందనలు ... మీ అందమైన మనసులా పెయింటింగ్ కూడా....
మీలోని మంచితనమే నాలో దాగిన మంచిని చూసింది మెహదీగారు. మీ స్పందనలు సదా స్మరణం నాకు.
Deletevaha vaah eam rasinaru. bagundi mie kavita
ReplyDeleteThank you Srinath
DeleteMadam where you will get such wonderful paintings. Poem is simply superb.
ReplyDeleteThanks a lot for your comments.
Deleteహృదయాన్ని తాకింది మీ కవిత ... సారీ డైరెక్టుగా పొగిడేశా :-)
ReplyDeleteఇండైరెక్టుగా కూడా పొగిడి ఉండాల్సింది వినోద్ గారు.
Deleteఅపనమ్మకాలని సైతం అందమైన నమ్మకాలుగా మార్చి కవితని అందించారు. బాగుంది
ReplyDeleteధన్యవాదాలు మీకు.
Deletenammakam lo yantha andhamundo telisina manasulani tirigi palakarinche tolakari me kavitha padma g
ReplyDeleteఅందమైన అహ్లాదకర కమెంట్ కి అభివందనం
Deleteమరో మంచి కవిత మీ కలం నుంచి
ReplyDeleteథ్యాంక్యూ లిపిగారు. ఈ మధ్య ఏం రాయడంలేదు ఎందుకనో?
Deleteఒకరిపై స్త్రీ ఇష్టం పెంచుకుంటే అది ఎంత పారదర్శకంగా స్వచ్చంగా ఉంటుందో మీ ఈ కవిత ప్రస్పుటంగా ప్రతిబింబిస్తోంది మేడం... మీరు వేసిన ఈ చిత్రం నాకెంతో నచ్చింది.. చక్కని కవితకు మరోమారు అభినందనలు....
ReplyDeleteమీ అభినందనలు ఎప్పుడూ నాకు ఉత్తేజకారకులే.
Deleteనాది నాదన్న స్వార్థంతో
ReplyDeleteఅబధ్ధాన్ని ఆసరా కోరుతుంటావు
నేను మాత్రం నిజమని నమ్మేస్తూ
ఆశల వంతెననే నిర్మిస్తుంటాను.
ప్రేమ పట్ల ఎంతో ఆశావహ దృక్పధాన్ని మీ ప్రతి కవితలో చూపుతారు. మీ కలం నుండి మరో ఆణిముత్యం. అభినందనలతో..
ఆశావాద దృక్పధమే ఆనందానికి హేతువు అని మీబోటి గొప్పవ్యక్తుల ద్వారా తెలుకున్నదేనండి. మీ స్పూర్తిదాయక స్పందనలకు నెనర్లు.
DeleteChala bagundi
ReplyDeleteThank you Radha Krishnagaru
Deleteప్రేమ పై మీకున్న నమ్మకమే మీతో ఇన్ని అందమైన కవితలు వ్రాయిస్తుందనుకుంటాను. మరొక్కమారు మురిపించారు ముగ్ధాక్షరాలతో.
ReplyDeleteరాగిణిగారు మీ పేరులాగే మీరు రాసిన అక్షరాలు నన్ను మురిపిస్తున్నాయి. థ్యాంక్యూ.
Deleteజవాబుల్లో కూడా మీ ప్రత్యేకతని నిరూపించుకున్నారు సున్నితంగా చెప్పి.
Deleteప్రేమంటే మీకు నమ్మకం
ReplyDeleteమీరు మంచి సాహిత్యాన్ని అందిస్తారని మా నమ్మకం.
చిత్రం చూడ ముచ్చటగా ఉందండి.
మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే నా ప్రయత్నం. థ్యాంక్యూ.
DeleteChala bagundi
ReplyDeletethank you sir.
Deleteఒకవైపు నిందిస్తూనే హితుల జాబితాలోకి చేర్చుకోవడం... ఆహా ఎంత జాలి పాపం ! ప్రేమికుడి స్థానం నుంచి హితుడి స్థానానికి నెట్టేయడం ఎంత అన్యాయం!
ReplyDeleteనాది అన్న స్వార్ధం లేకుండా ప్రేమ అనేది ఉంటుందా ఎక్కడన్నా? ప్రేమ కావాలి స్వేచ్చ కావాలి అంటే కుదిరే పనా? కుదరదంటే అతగాడిని ఇలా నిందిస్తారా? ఇదేనా నమ్మకం?
నేను ఏదో అమాయకంగా అందరినీ నమ్మేస్తుంటే మీరు ఇలా నిందవేయడం న్యాయమా :-) మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteకానరాని నిజాన్ని నమ్మడం కొందరికే చెల్లితుంది. ఆ వరం మీకుంది.
ReplyDeleteతెలిసీ తెలియనితనం కూడా అయ్యి ఉండవచ్చునేమో ! :-)
Deleteప్రేమంటేనే స్వార్థం కదండీ పద్మగారు. అందరూ మనలా ఉండాలి అనుకోవడం కూడా ఒక రకమైన స్వార్థమే. మీ నమ్మకం మీది. మా స్వార్థం మాది. కాదంటారా? :-)
ReplyDeleteనాలా ఉండమని నేనెందుకు అంటాను. నానమ్మకం నాది. మీ మనసు మీది అంతె కదండీ :-)
Deleteఅతి మంచితనం, నమ్మకం ఒకోసారి ప్రమాధకరం. చూసి మసలుకోవాలి. కవిత బాగుంది.
ReplyDeleteతప్పదు మంచి ఎప్పుడూ మెతగ్గానే ఉంటుంటుంది. ఆలస్యంగానే వెలుగులోకి వస్తుంది :-) థ్యాంక్యూ.
Deleteనీవు కలలలో మేల్కొని ఊహల్ని శ్వాశిస్తావు
ReplyDeleteనేను నిజాల నిష్ఠూరం అనుభవిస్తూ నిన్ను మేల్కొల్పాలని ప్రయత్నిస్తాను
నీవు నన్ను స్వార్థమని ముద్రిస్తూ నిన్ను నీవు పొగుడుకుంటావు
హన్నన్నా ఎంతమాట...
Deleteనన్ను నేను పొగుడుకుంటూ మిమ్మల్ని కూడా పొగిడేస్తాను.
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
నేను నమ్మనుగాక నమ్మను
ReplyDeleteనమ్మను అనుకోవడమే మీ నమ్మకం :-)
Deleteఎవరిని నమ్మాలో
ReplyDeleteఎందుకు నమ్మాలో
నాకేం అర్థం కావడంలేదు
మీరు నమ్మిన వాటిపై నమ్మకం లేదు :-)
అదేంటి ఆకాంక్షా...అంత ఖచ్చితంగా నమ్మకంలేదు అంటే ఎలా? జీవితాన్ని నమ్ముకుని సాగించాల్సిందే పయనమని మీకు నేను చెప్పాలా :-)
Deleteమరో మంచి భావం ఉన్న కవితను ఇచ్చారు. మనసులో దాగిపోవు భావం.
ReplyDeleteథ్యాంక్యు యోహంథ్.
Deleteమాసెడ్డ దొడ్డమనసు మీది
ReplyDeleteబులెట్ లేకుండా పేల్చారు కమెంట్ :-)
Delete
ReplyDeleteఓ కె అలా నమ్మకంతోనే బ్రతికేయండి.
అలాగేనండి :-)
Deleteమనసుని మనిషిని కుదురుగా కూర్చోనీయవు కదా నీ కవితలు. అలరించావు అర్పితా-హరినాధ్
ReplyDeleteకుదురుగా కూర్చొని నేనూ ఉండనుగా :-) thank you sir.
Deleteనీవు వదిలి వెళ్ళిపోతుంటావు
ReplyDeleteనేను స్నేహ హస్తం అందిస్తూ
హితుల జాబితాలో జోడిస్తుంటాను.
ante friend request pedutu undama madam. meke add request tho panenti :-)
Add request petti delete cheyadam enduku. asalu list antoo maintain cheyaka povadame best :-)
Deleteనాకు ఈ కవిత చదవాలనిపించలేదు.. ఎందుకంటే ఆ చిత్రం నన్ను చదవనివ్వలేదు. ఎంత ట్రై చేసినా.. నా మనసు కవిత చదవడం వైపు వెళ్లలేదు. కానీ.. ఆ చిత్రం చూస్తుంటే... పక్కన ఏం రాసుందో మాత్రం అర్థమైపోయింది. మగువ మనసు సున్నితత్వాన్ని ఆ మనసులో దాగిన ఎన్నో భావాల గుబాళింపుని... ఆ అక్షరాలు వెదజల్లాయని నాకు తెలుసు.. కానీ.. నా మనసు చదివిన చిత్రం ఊసులకు, పద్మ కలం నుంచి జారిన సిరాక్షరాలకు పొంతన కుదరమదేమో అన్న ఆందోళనలో ఆ కవిత చదవదలుచుకోలేదు. ఆ వాల్జడను అలా విసురుగా పడేస్తే... మేమేం కావాలి? ఛర్నాకోలు లాంటి ఆ వాలుకనుల దగ్గరే గాలం వేస్తే.. ఆ కవితనెలా చదవాలి...? సింగారాన్ని చీరలో రంగరించి వదిలేసి... కవిత చదవమంటే ఎలా మరి...? మొత్తానికి అతి బలవంత మీద... చదివాను కవిత. కవిత కాదది మనసు గీసిన కావ్యచిత్రమాలిక. మగువ మదిని దాటని.. ఏన్నో భావాల దృశ్యమాలిక. స్నేహానికి, ఆరాధనకు మధ్య ఏదో తెలియని ఊగిసిలాట. పెదవులతో కుట్లు వేసినా,ఆశ వంతెన వేసినా... అదో మరపురాని కథ. గెలుపైనా, ఓటమైనా... కమ్మని కల. చాలా బాగుంది అక్షరం, అక్షరాన్ని మించిన అందం.
ReplyDeleteనాకు మరో కమెంట్ పెట్టి విసుగు తెప్పించాలి అనిపించలేదు. మీరు అలా ఉండనిస్తే కదా! :-) చదవను కవితను అన్నారు ఏంటా చూద్దాం అని వచ్చి చదివితే షాక్...అంటే భయంతో కాదు మీ వాక్య చతురతకీ, మీ మీరు చెప్పిన సునిశితశైలికి పడిపోయాను పూర్తిగా అంటే ఫ్లాట్ అయిపోయాను మీ అక్షరాల కూర్పుకి. ఇంక తప్పదు కవిత చదవకుండా కమెంట్ వ్రాయగలరు కాని నేను వ్రాసింది చదవకుండా నాకు జవాబు ఇవ్వలేరు :-) హా హా హా :-)
Deleteరాసింది చదవరేమో అని నిరుత్సాహంతో నీరసంగా కమెంట్ చదివి....వెయ్యి వోల్ట్స్ వెలుగుతో ఎగిరి గెంతులేసింది నా మనసు. ఇది నిజం నమ్మండి.
Deleteనా రాతలకి, చిత్రాలని మీరు ఎప్పుడూ అద్భుతమైన మరో కోణంలో చూపిస్తుంటారు.
" సింప్లీ సెల్యూట్ టు యువర్ కమెంట్స్"
No more words Satishgaru.
ఆకాంక్షగారు...మీరు రాయను కమెంట్స్ పెట్టను అంటే నేను పడిపోతాను (ప్లాట్ కాదు మూర్చపోతాను ) రాసేద్దురూ :-)
Deleteమరో మంచి కవిత పద్మార్పితగారు
ReplyDeleteథ్యాంక్యూ అనికేత్
Deleteపోయం
ReplyDeleteకమెంట్స్
రిప్లైస్
అన్నీ బాగున్నాయి.
thank you Subbaraogaru.
Deleteనా నిర్మల మదిని తిట్టుకుంటూ
ReplyDeleteనిన్ను నీవు మెచ్చుకుని మురుస్తావు
నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.ఎంత నర్మగర్భంగా వ్యక్తీకరించారు పద్మాజీ..
>నిర్మల మదిని
ReplyDeleteనిర్మలహృది అనండి. (space ఇవ్వకూడదు. సమాసం అంటే ఏకపదం కదా). నిర్మల మది అని ఎందుకు అనకూడదంటే నిర్మల(సంస్కృత) అని ప్రక్కన మది (తెలుగు) మాటతో సమాసం చేయరాదు కాబట్టి.