మది వైశాల్యాన్ని కొలవాలంటే తలదించి కొలుచుకో రా
తప్పొప్పుల ఆటుపోట్లలో ఒప్పుల్ని మచ్చిక చేసుకుని రా
వెన్నెలే కాదు సూర్యకాంతికి మాడి మసి పూసుకుని రా
వీధినేం వెలగబెడతావు ఇంట్లో దీపం ఉందో లేదో చూసి రా
ఆనంద అలలతీరం తాకాలి అంటే కష్టాల కడలిని దాటి రా
పసిడిరధం పేదవాని గుడిసెచేరదు నడిచి లోపలికివెళ్ళి రా
నిచ్చెనెక్కే ప్రయత్నమేం చేయకనే నింగిని నింధించకు రా
ఎదుటివాడ్ని ఎత్తిచూపాలంటే నిన్నునీవు తెలుసుకుని రా
అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని వాడు చేతకాని వాడే రా!
OUTSTANDING LINES FROM YOU PADMA.
ReplyDeleteAwesome. Wonderful lines. Kudos..
ReplyDeleteరా...రమ్మని పిలిచారు అనుకున్నానే తప్ప ఇంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చి ఫూల్ చేస్తారు అనుకోలేదు.:(తల్లో మీకో నమస్కారం:)
ReplyDeleteపవర్ ఫుల్ పదాలతో పద్మార్పిత పవర్ చూపించావు. అందుకో అభినందనలు-హరినాధ్
ReplyDeleteఅద్గది అలా గడ్డిపెడుతున్నారా మాకు.
ReplyDeleteగడ్డిని కూడా తీయటి పానకంలో ముంచి మరీ..బాగుంది.
గడ్డి ఆండీ గడ్డి గడ్డి పచ్చ గడ్డి ఎండు గడ్డి
Deleteకిలో లెక్కన కూడా.. హోల్సేల్ లెక్కన కూడా..
పచ్చ గడ్డి కిలో 100 రూపాయలు
ఎండు గడ్డి కిలో 10 రూపాయలు
నయని గారు ఓ మోపెడు తీసుకుంటారా.. !
100 రూపాయలకు పచ్చ గడ్డి నా అనే కదా సందేహం .. ఈ గడ్డి మామూలు గడ్డి కాదండి "మాముల్" గడ్డి. పానకం చాలు ఆజ్యం లేకున్న భగ్గు మండే గడ్డి. అందుకే పానకం ఉచితం ~<:o)) హాహాహాహా కాస్త నవ్వుకోవటానికి సరదాగా రాశాను నయని గారు ఏమనుకోమాకండి.. మీ కామెంట్ చూశాక ఎలాగూ ఏప్రిల్ 1 కదా హుషారు కోసమని ఇలా. నవ్వుకొండి. (ఎవ్వరినీ బాధ పెట్టె ఉద్దేశం లేదు సుమండీ. )
గిట్లనివి మాకెందుకు మాడం
ReplyDeleteవాహ్ ఏం చెప్పారండి
ReplyDeleteto whom these all sayings ?
ReplyDeleteమనిషి జీవితాన అన్ని రకాల ఒడిదుడుకులు వుంటాయి ఐనకాని అధైర్య పడకూడదు అని చాల పదునైన పదాలతో అల్లిన ఈ రచన బాగుంది పద్మ గారు. మనిషి జీవితాన ఎప్పుడు అపజయాలే కాదు నిశితగా గమనిస్తే జయాలకు కూడా దారి కానవస్తుంది అని చెప్పకనే చెప్పారు.
ReplyDeleteమది వైశాల్యాన్ని కొలవాలంటే తలదించి కొలుచుకో రా
ReplyDeleteతొంగి చూసేవారే కాని మనసుని కొలిచే వారు ఉండరు.
Standing applause to your poem madam.
ReplyDeleteసందేశాత్మకంగా ఉంది మీ కవిత.
ReplyDeletesuper cheparu
ReplyDeleteపసిడిరధం పేదవాని గుడిసెచేరదు నడిచి లోపలికివెళ్ళి రా
ReplyDeleteనిచ్చెనెక్కే ప్రయత్నమేం చేయకనే నింగిని నింధించకు రా
చాలా మంచి విషయం చెప్పారు పద్మగారు.
సందేశాత్మక కవిితతో అలరించారు మేడం !!
ReplyDeleteఫ్లో చాలాబావుంది.
ధన్యవాదాభివందనాలు మీకు.....
వీధినేం వెలగబెడతావు ఇంట్లో దీపం ఉందో లేదో చూసి రా..మీ మార్క్ మాడం
ReplyDeleteవ్యక్తిత్వం అనేది... చాలా సున్నితమైన భావజాలం. అది... వ్యక్తిని బట్టి కాదు, మనసుని బట్టి ఆధారపడి ఉంటుంది.
ReplyDeleteనేను అప్పుడప్పుడు గెడ్డం పెంచుతాను, క్లీన్ షేవ్ చేసుకుంటేనే వ్యక్తిత్వం ఉన్నట్టు అని చాలా మంది సో కాల్డ్ మేధావులు నాకు చెప్తుండేవారు. ఆ క్లీన్‌షేవ్‌డ్ సోకాల్డ్ మేధావులెవరూ వ్యక్తిత్వమూర్తులు కారు. గెడ్డంతో కాస్త రఫ్‌గా కనిపించే నేను వ్యక్తిత్వ హీనుడినీ కాదు. మీ కవిత చదువుతుంటే నాకిదే గుర్తొచ్చింది. మనసు ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో ఉంటే... మీరన్న ప్రతీ వాక్యం నిజమవుతుంది. బయటకు అందంగా కనిపించి, అసమర్ధుని జీవయాత్ర సాగిస్తే లాభం ఏముంది. మది వైశాల్యాన్ని కొలవడం కాదు.. ఆ మదిని తన మదికి కలిపి.. ఆలింగనం చేసుకున్నవారే . నిజమైన వ్యక్తిత్వ మూర్తులు. అందుకు చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిజాయతీ నుంచి వస్తుంది. ఆ నిజాయతీనే మీ కవిత సందేశంగా నిప్పులు చెరిగింది. అన్నిటికన్నా నాకు నచ్చింది... ధైర్యంగా ఒక అడుగు ఆకాశానికి నిచ్చెన వేస్తూ.. మరో అడుగు భూదేవిని ప్రణమిస్తూ... పట్టువీడని లక్ష్యాన్ని కళ్లల్లో చూపుతూ... నిఖార్సైన ఆదిశక్తి రూపాన్ని కళ్లముందుంచిన చిత్రం. ఆ చిత్రంలో నిజమైన ఆడతనం. నాకు బాగా నచ్చాయి.
ఓ చిన్న డౌట్...పద్మార్పితగారి చిత్రాలు మీతో రాత్రులు కలలో ముచ్చటిస్తాయా సతీష్ గారు :-)
Deleteపద్మా ఎవరిపై ఏ పదతాండవం :-)
ReplyDeleteyes i got
ReplyDeleteఅర్థమైంది
ఒకో లైన్ ఎన్నెన్నో సందేశాలు అందిస్తున్నాయి.
ReplyDeleteWonderful lines....( రా .... రా! .., ఆహ్వానమో ..అవమానమో కానీ అర్థం చూసుకున్నవారికి అర్థం చేసుకున్నంత .. humm )
ReplyDeleteఆనంద అలలతీరం తాకాలి అంటే కష్టాల కడలిని దాటి రా
ReplyDeletegood lines
ఇలాంటివి చెప్పాలి అంటే భాషపై పటుత్వం, ధర్యం కూడా అవసరం. అవి రెండూ మీ సొంతం.
ReplyDeleteరా రా అంటూ ఏకధాటిగా తిట్టకుండా మొట్టకుండా వాయించినట్లుంది . అయినా బాగుంది మంచి సందేశంతో పాటు చురకలు వేశారు :)
ReplyDeleteమాడం ఈ సూక్తులు మాకేనా లేక అందరికీనా. మరోసారి దాడి చేసారు :-)
ReplyDeleteరా రమ్మని రారా రమ్మని అంటారనుకుంటే .. ఇలా మెలిక పెడితే ఎలా?? డియర్ పద్మా!!
ReplyDeleteప్రోత్సహిస్తున్న ప్రతి అభిమానికీ పేరు పేరునా నమస్సులు. _/\_
ReplyDelete