కిలకిలారావం.

నెమలి కాళ్ళకే గజ్జలు కట్టి నాట్యమే నేర్పాలని
నేర్చిన భంగిమలనే వయ్యారంగా చేసి చూపితే
బ్రతుకుబాటలో నర్తించక చూసి అడుగేయమంది!

కోయిల గొంతుకే గాననిధిని బహూకరించాలని
సరిగమలనే సాధన చేసి శృతిలయలతో పాడితే
జీవనపయనంలో శృతితప్పినా గతి తప్పవద్దంది! 

హంసకి పాలునీళ్ళని వేరుచేసే విద్యనొసగాలని
నైపుణ్యమంతా రంగరించి నాణ్యతనే తెలుపబోతే
మనుషుల్లో మంచిచెడులెంచి  మసులుకోమంది!

కోడిపుంజు తురాయినే మెలిపెట్టి తెల్లవారిందని
చెప్పి, నిదురలేపి బధ్ధకం వీడమని భయపెడితే
ప్రణాలికలు పద్ధతులు ప్రజలకే తప్ప పక్షులకేలంది!

చిలుక ఎరుగని పంచదార పలుకులే చెప్పాలని
నోటికి వచ్చిరాని మాటలన్నీ వక్కాణించి పలికితే
మనిషికి వరం మాటలే ఆచితూచి మాట్లాడమంది!

పావురాలు ఎరుగని ప్రేమపాఠాలు వివరించాలని
ఆరిందానై అనురాగబంధాల గురించి చెప్పబోతే
నేటి లోకం తీరుతెన్నులు తెలుపుతూ ప్రేమేలేదంది!

45 comments:

  1. సూపర్ డూపర్ కిలకిలరావం

    ReplyDelete
    Replies
    1. హిట్ క్లాప్ కొట్టారుగా :-)

      Delete
  2. పక్షుల కిలకిలారావాలతో మానవాళికి మీరిచ్చిన సందేశం అద్భుతంగా ఉండండి... ఒక ఆంతరంగిక భాష్యాన్ని ఎదుటివారికి నొప్పించకుండా ఒక వస్తువు తీసుకొని సందేశాన్ని మనస్సుల్లో చొప్పించడం చాలా కష్టసాధ్యమైన పని... మీ ఈ కవితలో అది నూరుపాళ్ళు పండింది అనడంలో అతిశయోక్తిలేదు మాడం... అభినందనలు మరోమారి!!

    ReplyDelete
    Replies
    1. సందేశం ఇవ్వాలని కాదు, కూసింత నేర్చుకోవాలన్న జిజ్ఞాస :-)

      Delete
  3. చాలారోజులకి కధావస్తువుతో మీదైన శైలిలో మంచు సందేశాన్ని అందించారు.

    ReplyDelete
    Replies
    1. మనుషులైతే వినరని పక్షులని పలకరించానండి :-)

      Delete
  4. పిట్టలు అరిచి గోల చేస్తాయ్ తెలుసు, ఈ తీరుగా మంచి మాటలు కూడా చెప్పంగా విన్నాం. మంచిగుంది

    ReplyDelete
    Replies
    1. ఆల్ రెడీ అవి అరిచి మరీ చెప్పాయి నీతిసూక్తులు :-)

      Delete
  5. పావురం మాత్రం మీతో అబద్ధం చెప్పింది. బహుశా అది ఆడ పావురం అయ్యుంటది. ప్రేమే లేకపోవడం ఏంటి! అది ఉండబట్టేగా పద్మార్పిత కలం నుంచి ఈ అమృత కవితా ధార. పద్మ వలచిందో, వలచి వగచిందో, వలపు పేర వేధించిందో తెలీదు కానీ, ఈ పద్మ వికాసం ప్రేమ వరమే అన్నది నిర్వివాదాంశం.

    అయినా మీ వద్ద ఉన్న ఇన్ని విద్యలు పక్షులకు నేర్పే ప్రయత్నం ఎందుకు చేయడం? మీ అభిమాన చకోర పక్షులు ఇంత మంది ఉన్నారు, గుర్తుకు రారా ఏంటి?

    ReplyDelete
    Replies
    1. చంద్రమోహన్ గారితో ఏకీభవిస్తున్నాను అని ఆడిపోసుకోకండి పద్మగారు.

      Delete
    2. chandramohangaru...ఆడ పావురం కాదండీ...ప్రేమవ్యతిరేక శక్తుల కుతంత్రం కామోసు :-)
      natana jeevitam...పార్టీ మార్చేసారా? :-)

      Delete
  6. ప్రేమ పాఠాలు చెప్పే పద్మార్పితతో ప్రేమేలేదు అన్నాయా? ఎంతమాటెంతమాట! కవితాచిత్రం రెండూ చక్కాగా ఇమిడినాయి పద్మ

    ReplyDelete
    Replies
    1. అదే కదండీ సంధ్యగారూ...అప్పటికీ ప్రేమగానే చెప్పాను. :-)

      Delete
  7. ఎట్టెట్టా!!!! ప్రేమే లేదన్న పావురం ఇంతకీ జంటగా చెప్పిందా విరహం తాళలేక వేదనతో చెప్పిందో కాస్త సెలవీయండి. కధా వస్తువుగా ఎంచుకున్న పక్షులన్నీ బహుతెలివైనవి పద్మగారు...మేము ఇవ్వలేని సమాధానాలు చక్కగా ఇచ్చాయి మీకు :-) హాహా:-)

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పినా నమ్మరుగా మీరు...నేనూ తెలివైన దాన్నే అందుకే సమాధానాలు తెలివిగా రాబట్టాను కదండీ :-)

      Delete
  8. నోటికి వచ్చిరాని మాటలన్నీ వక్కాణించి పలికితే
    మనిషికి వరం మాటలే ఆచితూచి మాట్లాడమంది
    నిజమే మనిషికి ఉన్న వరం మాటలు మెదడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని మంచి సందేశమే చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడ వద్దన్న పక్షులదే ఈ క్రెడిట్ ;-)

      Delete
  9. పక్షులకి తెలిసిన విద్యలే మీరు నేర్పాలి అనుకున్నారు, అందుకే అవి నీతిభోధనలు చేసాయి. ఈసారి రానివి చెప్పి చూడండి మాడం :-)

    ReplyDelete
    Replies
    1. వాటికి తెలిసిన విద్యలే ఇవని నాకు తెలియలేదప్పుడు :-)

      Delete
  10. పక్షులచేత కూడా మనుషులకి పాటాలు చెప్పించే నేర్పు నైపుణ్యం మీది పద్మార్పితగారు. మంచి కవితను అందించారు.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా నేర్చుకున్నానండోయ్ ఆ నైపుణ్యమేదో కాస్త :-)

      Delete
  11. బాగుంది మీరు చెప్పిన తీరు

    ReplyDelete
    Replies
    1. పక్షులు చెప్పిన తీరు కదా :-)

      Delete
  12. పావురాలు ఎరుగని ప్రేమపాఠాలు వివరించాలని
    ఆరిందానై అనురాగబంధాల గురించి చెప్పబోతే
    నేటి లోకం తీరుతెన్నులు తెలుపుతూ ప్రేమేలేదంది!....పావురం కూడా నిజమే చెప్పింది..ప్రేమ అనుకోవటమే తప్ప నిజం కాదు.ఎక్కడా లేదు..బావుంది పద్మాజీ మీ భావం.

    ReplyDelete
    Replies
    1. పక్షులు పలికినవి పంచదార పలుకులు :-) కాదంటారా!

      Delete
  13. తినగా తినగా వేప తియ్యగా ఉంటుందని విని, ప్రేమలో పడితే అదే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇదేంటి తీపిగారెలు తిని మొహమెత్తినట్లు, ప్రేమకవితలు వ్రాసీ వ్రాసి చివరికీ ప్రేమేలేదని సందేశం ఇచ్చారేం ప్రేమ/పద్మార్పితాజీ :-)

    ReplyDelete
    Replies
    1. ఇటువైపు నుండి నరికితే పని జరగదని అటువైపు నుండి ట్రై చేస్తున్నానండోయ్ :-)

      Delete
  14. ఈ కిలకిలారావంలో పాలపిట్ట లేదు :-( మాకేం చెప్పరా?

    ReplyDelete
    Replies
    1. ఆ పాలపిట్ట పలుకులేవో మీరు పలకండి మరి :-)

      Delete
  15. కిలకిలా నవ్విస్తారు అనుకున్నాను, డిఫరెంట్ గా చెప్పారు
    మీ కవితలు ఎప్పుడూ ప్రత్యేకమే

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే కదు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి :-)

      Delete
  16. Replies
    1. birds created that pleasantness payal :-)

      Delete
  17. ప్రాణులకెన్నింటికో లేని బంధాలు మనుషులకి ఎందుకో

    ReplyDelete
    Replies
    1. నేనే ప్రశ్నలు వేస్తాను, నన్నే ప్రశ్నిస్తే ఏం చెప్పను చెప్పండి :-)

      Delete
  18. నెమలి నాట్యాన్ని, కోయిల పాటకి హంస నైపుణ్యానికి, కోడిపుంజు ఆలారానికి, చిలుకల మాటలకి, పావురాల ప్రేమకి సాటి లేదంటారు. ఈ కవితలో నాకు అవగతమైనదేమంటే.. ఒక్కో పక్షికి ఒక్కొక్క లక్షణమిచ్చినా గాని ఆ లక్షణాలను ప్రస్ఫూటంగా తెలియపరుస్తాయి. కాని సమాజం లో కొంత మంది మాత్రం తమ తమ విలువలను మరిచిపోతున్నారు. అన్ని లక్షణాలకు సహేతుకంగా స్పందించే లక్షణం ఉన్నా మనిషికి అహం అడ్డు వస్తోంది తప్పితే నిజానికి అక్కడ మానవత్వం ఎదురేగితే మంచి అనే లక్షణం ప్రతి ఒకరిని పలకరించదా.. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు అనే ఈ పంచ భూతాలను సరిసమానంగా పంచుకునే మనిషికి మానవత్వం కూడా ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదని ఈ కవితలో చెప్పిన తీరు బాగుంది. నేను గతం లో రచించిన ఈ కవిత గుర్తుకు వచ్చింది పద్మార్పిత గారు. http://kaavyaanjali.blogspot.in/2013/09/blog-post_16.html

    ReplyDelete
    Replies
    1. ఓ...మీరు నాకన్నా ముందే మాట్లాడేసారన్నమాట పక్షులతో :-)

      Delete
  19. పక్షులకు పాటాలు చెప్పాలనుకుంటే ఇలానే తిక్కకుదిరిస్తాయి... :-) మనుషులు వినడంలేదని వాటిజోలికి వెళ్తారా?? హమ్మా...!!! :-)

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్ ఇంత కక్షా నాపైన మీకు :-)

      Delete
  20. ఇలాంటివి వ్రాయడంలో నీకు తిరుగులేదు. మనిషికి చురక అంటించావు.

    ReplyDelete
  21. iam sorry. late reading n comment. good poem of your style

    ReplyDelete
  22. సూపర్గా చెప్పాయి పక్షులు

    ReplyDelete
  23. పక్షులకి ఉన్న సహజ లక్షణాలని వాటికే నేర్పించాలి అనుకోవడం చోద్యమేమో అర్పితా, అందుకే అవి సహించలేక మనిషిలో అవలక్షణాలని వెలికి తీసాయి. కాదంటావా-హరినాధ్

    ReplyDelete