ప్రశ్నాక్షరాలు

రక్తాన్ని రంగరించి నిజాలు రాయలేని నీవు
నీటితో రాసి దాహాన్ని తీర్చుకోవడం ఎందుకు?


ఆచరించని నీతులే అందమైన పదాలల్లి నీవు
అల్పాయువాక్షరాల అభివృధ్ధి కోర్కె ఎందుకు?


జరుగుతున్న రాక్షసత్వాన్ని రాచరికమని నీవు
కోకిలవై కూడా కాకిలా మారి అరవడం ఎందుకు?


వాస్తవాలనే వర్ణవిభేదాలు అంటూ వేరుచేసి నీవు
వేషం మార్చి విడ్ఢూరమని వింతచేష్టలు ఎందుకు?


స్వార్థాన్ని సూక్తులతో ముసుగేసి సిగ్గులేని నీవు
సిధ్ధాంతాలే సిగనపూలుగా చుట్టి ఆ ఠీవీ ఎందుకు?


చీకటిలో చైతన్యాన్ని చంపేసి చితిని పేర్చిన నీవు
కల్లబొల్లి కబుర్లే వ్రాసి కాళిదాసులా ఫోజు ఎందుకు?


25 comments:

 1. అధ్భుతం పద్మగారు...
  అక్షరాలతో ప్రశ్నలని అస్త్రాలుగా సంధించారు.
  చిత్రంలో మీ ప్రతిబింబం ప్రస్ఫుటమౌతుంది.

  ReplyDelete
 2. ఎవరినో మొత్తానికి ఉతికి ఆరేసారు

  ReplyDelete
 3. ఆచరించని వాటినే అభ్యుదయ భావాలు అంటారు. వాటిని వ్రాయడమే తప్ప చేసేది ఏముంటుందని. :-)

  ReplyDelete
 4. పద్మార్పిత గారి కలం నుంచి జాలువారిన అక్షరాలు సంధిస్తున్న ప్రశ్నలు ఆలోచింపజేసేవిదంగా ఉన్నాయి... సూటిగా సుట్టిలేకుండా అన్నట్టు కవిత అద్భుతంగా వ్రాశారు... సలాం! మ్యాడం...

  ReplyDelete
 5. చీకటిలో చైతన్యాన్ని చంపేసి చితిని పేర్చిన నీవు
  కల్లబొల్లి కబుర్లే వ్రాసి కాళిదాసులా ఫోజు ఎందుకు?
  ఇంతకీ ఈ కాళిదాసు ఎవరండి? బొమ్మ బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. బహుశ ఇక్కడి సందర్భం లో కాళిదాసు ఆ కాళిదాసు కాదేమోనండి రాగిణి గారు. ఎవరో దారిన పోయే దానయ్యో లేకా పాచి పళ్ళ దాసారో మరెవరో పద్మగారికే తెలియాలి

   Delete
 6. No more questions madam.

  ReplyDelete
 7. దుమ్మెత్తి పోస్తుంది నన్ను కాదుకదా...:-)
  అయినా నేను కాళిదాసుని కాదుకదా!?
  మొత్తానికి అక్షరాలు ప్రశ్నించాయి అంటూ ఎవరినో యేకి పాడేసారు. చిత్రం సూపర్.

  ReplyDelete
  Replies
  1. దుమ్ము రేగితే కళ్ళు మూసుకోండి ఆకాంక్ష గారు. ఎండాకాలం లో షరామామూలే..పాపం కాళిదాసుచేసిందంటూ ఏమి లేదండి.. కాళికాంబ ఆశిస్సులతో కవితలు రాసారు.. అతనేమి సేల్ఫీ లకు ఫొస్ ఇవ్వలే కదండీ పద్మ గారు మరి అలా ఎందుకన్నారో అంతుపట్టలేదు. బేర్ బేర్ మంటూ అల్యూమినియం రేకు గీకిన రొద వినిపిస్తుంటే అలా అంటారేమి ఆకాంక్ష గారు.. :-(( క్షమాపణలతో

   Delete
 8. ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తూనే సమాజం లో దాగిన కొన్ని రుగ్మతలను మీ శైలి లో కాస్త కటువుగా దీటువుగా చెప్పారు పద్మ గారు. వ్యంగ్యం పాళ్ళు కనిపిస్తున్నా.. ఎండగట్టిన తీరు బాగుంది.

  ReplyDelete
  Replies
  1. అనగనగ కథ లో లాగా ఏడూ చేపలు మాదిరి ఏడూ ప్రశ్నలు వేద్దాము అనుకున్నారో ఏమో పద్మగారు.. విచిత్రముగా వైవిద్యముగా ఆరు చేపలే ఎందినట్టు ఇక్కడ కూడా ఆరు ప్రశ్నలనే ఎండగట్టారు మరి ఆ ఏడవ చేప ఎందుకు ఎందలేదో ఏమో అది కూడా ఎండి ఉంటె చక్కగా ఏడూ ప్రశ్నలు/పంక్తులు వచ్చేవేమో :-P

   Delete
 9. మిమ్మల్ని మీరే అనుకున్నారా ఏంటి??? :-)

  ReplyDelete
 10. ఈ కవిత ఖచ్చితంగా నన్ను కాదు.
  నాకు చదవడమే తప్ప రాయడం రాదు :-)

  ReplyDelete
 11. పద్మా మరీ ఇంత ఘాటుగా అంటే ఎలాగమ్మా.
  వ్రాయలేని మాలాటి వాళ్ళ సంగతి సరే, వ్రాయడం వచ్చిన వాళ్ళు వ్రాయడం మానేస్తారు. నిన్ను తిట్టుకుంటూ.

  ReplyDelete
 12. this is the style of yours. keep rocking mam.

  ReplyDelete
 13. this post belongs to poets.
  painting is good.

  ReplyDelete
 14. మమ్మల్ని ఇన్వాల్ చేయకండి...వీ ఆర్ ఓన్లీ రీడర్స్ :-)

  ReplyDelete
 15. మాడం ఇన్ని ప్రశ్నలు ఎవరిని అడిగారు, జవాబు దిరికిందా? పిక్ బాగుంది. కవిత నాకు అంతగా నచ్చలేదు.

  ReplyDelete
 16. అక్షరా సత్యాన్ని చెప్పావు. ఏవో అర్థం కాని నాలుగు పంక్తు రాసేసి, ఎందుకు రాసామో కూడా తెలియకుండా పోజులు కొటే వాళ్ళ బూజు దులిపావు. చిత్రంలో నాకు ఏ భావం గోచరించడం లేదు.-హరినాధ్

  ReplyDelete
 17. స్పందనలను వారి అమూల్యమఒన అభిప్రాయాలను అందజేసిన బ్లాగ్ మిత్రులందరికీ వందనములు_/\_

  ReplyDelete
 18. ప్రశ్నా శరాలు సూటిగా...

  ReplyDelete
 19. ఈ అక్షరబాణాలు ఎవరి పై సంధించినట్లో

  ReplyDelete
 20. అయ్యబాబోయ్ మాకు రాయడం రాదని ఇంతలా తిట్టాలా :-)

  ReplyDelete
 21. అక్షరాస్త్రాలు అయ్ బాబోయ్ అన్నీ ప్రశ్నలే...,,, జవాబు లు ఇవ్వలేనివి కాకున్నా ఇవ్వనివే అద్భుతం

  ReplyDelete