పలుకులు

పలుకులకు పళ్ళు, దంతాలు ఉండవు,
కానీ....పరుషమైన పదాలు పలికినప్పుడు.
గాట్లు పెట్టకనే గుండెను గాయం చేస్తాయి!

కొన్ని గాయాలు జీవితకాలం మానవు,
అందుకే.... మాటలు మధురంగా మాట్లాడు.
తీయని మాటలు ఔషధములా పనిచేస్తాయి!

నరం లేని నాలుకకు పగ్గాలు ఏమీ లేవు,
అందుకే...సృష్టికర్త సైతం ధూషిస్తే శపిస్తాడు.
లేకి మాటలు జ్ఞానినైనా మూర్ఖుడ్ని చేస్తాయి!

పదం చేసే శబ్ధాలకి కాళ్ళు చేతులు లేవు,
కానీ...మంచి మాటలు చికిత్స చేసే వైద్యుడు.
శరీరానికైన వేయి గాయాలైనా మానిపోతాయి!

25 comments:

  1. చిలక పలుకుల వలె చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. మంచిమాటలే చెప్పారు పద్మగారు.

    ReplyDelete
  3. మంచిమాటలు చెబితే వింటారు
    రాస్తే చదువుతారు, కాని పలకరు.

    ReplyDelete
  4. Madam your Facebook account is not finding.

    ReplyDelete
  5. పద్మార్పిత పలుకులు, పంచదార చిలుకలు ( చిలుకలు అంటే పక్షులు కాదండో మిఠాయిలు) మరో మంచి సందేశాన్ని అందించారు.

    ReplyDelete
  6. కష్టం ఇట్లా మాట్లాడమంటే

    ReplyDelete
  7. ఆచరించాల్సిన నిజాలు..

    ReplyDelete
  8. బాగున్నాయి మీరు చెప్పిన మాటలు. మంచిసూక్తులు.

    ReplyDelete
  9. కొన్ని గాయాలు జీవితకాలం మానవు..నిజమే కదూ!

    ReplyDelete
  10. వినడానికే కానీ పలకడానికి కావు పద్మా ఈ పలుకులు.

    ReplyDelete
  11. మాటల యొక్క గొప్పదనాన్ని... పదాల్లోని మాధుర్యాన్ని... ఎదుటివారి వద్ద అవలంబించాల్సిన తీరును అక్షరాల్లో అందంగా చెప్పడం మీకే సాధ్యం/// వందనం పద్మార్పిత గారు...

    ReplyDelete
  12. మీ పలుకులు తీయగా ఉన్నాయండి.

    ReplyDelete
  13. పద్మా..గతంలో ఇలాంటిదే "మాటలు" అని నీది ఒక పోస్ట్ చదివిన జ్ఞాపకం. బాగుంది కానీ నీ నుండి వైవిధ్యమైన రచనలు ఆశిస్తున్నాము-హరినాధ్

    ReplyDelete
  14. నేటి కాలం లో కొద్ది మంది మాటలు సైతం అర్ధమవ్వవు
    కొన్ని మన ఆలోచనల సరళి దాటి ఉంటె మరి కొన్ని జీర్ణం కాని పలుకులు
    మనిషి మనిషి మాటలు అర్ధం చేసుకునే రోజంటూ వస్తే చిలుక పలుకులే చిత్రమనిపించెను కదా
    మనిషి మనసుని గౌరవిస్తె ఆ భంధమే కలకాలం నిలిచెను కదా ఈ మన్ను ఆ మిన్ను ఉన్నన్నాళ్ళు

    చిలకపలుకులని శీర్షిక తో మనిషి లో దాగిన భావాలు ఎంత విలువైనవో విపులంగా చెప్పిన తీరు బాగుంది పద్మ గారు

    ReplyDelete
  15. నరం లేని నాలుకకు పగ్గాలు ఏమీ లేవు, అందుకే మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు

    ReplyDelete
  16. అలాగే అలాగే ఇకపై పలికే ప్రయత్నం చేస్తాం

    ReplyDelete
  17. నేను రాసిన పలుకులను ప్రేమతో ప్రోత్సహిస్తున్న అందరికీ అభివందనం._/\_

    ReplyDelete
  18. పలకడం కష్టమేనండి.

    ReplyDelete
  19. రెప్లై గా మీ పలుకులు కరువయ్యాయి :-(

    ReplyDelete
  20. నీ పలుకులకి మరో కవితారూపం.

    ReplyDelete
  21. కాకి గూటి లోన కళ్ళు తెరచిన నేమి
    కోకిలే జగతిన కొలువ బడును
    మధుర భాషణంబు మంచిపేరును దెచ్చు
    మంచి మాట యిదీ విరించి మాట

    ReplyDelete
  22. కాకి గూటి లోన కళ్ళు తెరచిన నేమి
    కోకిలే జగతిన కొలువ బడును
    మధుర భాషణంబు మంచిపేరును దెచ్చు
    మంచి మాట యిదీ విరించి మాట

    ReplyDelete