ఎప్పుడైనా అడుగు

ఎప్పుడైనా మీకు ఆస్తి అంతస్తులన్న అహం పెరిగితే
శ్మశానాన్ని ప్రదక్షణ చేసి సమాధులు చూసి రండి
కుదిరితే చనిపోయినోడు ఏం తీసుకెళ్ళాడో అడగండి!

ఎప్పుడైనా మీకు పరమాత్ముని పై ప్రేమనేది కలిగితే
ఆకలితో ఉన్న వాడికి మీ చేతులతో అన్నం పెట్టండి
కడుపునిండా దీవెనలతో మీ ఆత్మ నవ్వేను చూడండి!


ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు మేల్కొని నవ్వితే
వాడిని ముక్కలు చేసి తలెత్తి గర్వంగా మిడిసిపడండి
మన ప్రవర్తనే మనకి దిక్సూచని తెలిసి మసులుకోండి!


ఎప్పుడైనా మీ కొవ్వుపెరిగి కండల బలం పొగరుబోతే
ఏదైనా ఒక వృధ్ధాశ్రమానికి వెళ్ళి ఒకచుట్టుచుట్టి రండి
సత్తువ తగ్గినవారు కాటివైపు నడుస్తున్నారు చూడండి!

20 comments:

 1. A BIG CLAP TO POST AND PAINTING.

  ReplyDelete
 2. సూపర్బ్, ఆవేశాన్ని రంగరించి అక్షరాలని అల్లినట్లున్నారు.

  ReplyDelete
 3. మరోసారి ప్రభంజనం మారుమ్రోగింది. :-)

  ReplyDelete
 4. అసలే ఎండలకి వేడెక్కిపోతుంటే అడు కోరు అని మీరు కూడా మంటలురేపితే ఎలా మాడంజీ. అలాగని చదవకుండా ఉండలేం అన్నీ మంచి విషయాలాయె. :-)

  ReplyDelete
 5. పద్మగారు మేము ఒక బ్లాగ్ ఓనర్లమే...కాస్త అటువైపు కూడ ఒక చూపు చూడండి.
  మీ కవితా ప్రశ్నావళి ఎప్పటిలానే సూపర్.

  ReplyDelete

 6. ఎప్పుడైనా మీ కొవ్వుపెరిగి మీ బ్లాగే దేశం లో గొప్ప బ్లాగ్ అనుకున్నారంటే
  ఓ మారు పద్మార్పిత గారి బ్లాగు కెళ్ళి టపాలు చదివి రండి
  టపా లంటే ఎట్లా ఉండాలో చూసి రండి !

  జిలేబి

  ReplyDelete
 7. అమ్మాయ్ ఏమైంది ఈ మధ్య వేదాంత ధోరణిలో పడ్డావు. ఇప్పుడే నీకు అవసరం లేదు. చక్కగా ప్రేమ కవితలు రాసి హాస్యాన్ని పండించు. నిజానికి కవితలో భావాన్ని అద్భుతంగా పండించావు. ఆశిస్సులతో-హరినాధ్

  ReplyDelete
 8. శ్మశానాన్ని ప్రదక్షణ చేసి సమాధులు చూసి రండి
  కుదిరితే చనిపోయినోడు ఏం తీసుకెళ్ళాడో అడగండి!

  ReplyDelete
 9. జీవితం లో ఎంత ఎదిగిన ఒదిగి వుండటం అవసరమని
  భువిపై నీవున్నంతకాలం మనషులే మనషులకు ఆప్తులని
  అపోహ వ్యసనాలు ప్రలోభాలు ఆడంబరాలను మించిన ఆస్తి మనిషిలోని సద్గుణమే
  మనిషికి ఆయువున్నన్నాళ్ళు పరోపకారం చేసి నలుగురికి హితము కూర్చితే పరుల కనుల్లో ఆనందభాష్పాలు చూసిన ఆ నిమిషం మనిషిగా మన పుట్టుకను సార్థకం చేసే అసలైన ఆస్తి.. అదే జీవిత పరమార్థమని చెప్పకనే చెప్పారు పద్మగారు. బాగుంది కాని వేదన పాళ్ళు కనిపిస్తున్నాయి ఆ చిత్రం లో.

  ReplyDelete
 10. ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు మేల్కొని నవ్వితే
  వాడిని ముక్కలు చేసి తలెత్తి గర్వంగా మిడిసిపడండి
  superga chepparu

  ReplyDelete
 11. moodu mukkallo chepparu jivitam gurinchi

  ReplyDelete
 12. ఎవరిని అడగాలి ఏమని అడగాలి:-)

  ReplyDelete
 13. ఇక పై ఏం డౌట్స్ వచ్చినా అడగమంటావా పద్మా :-) సూపర్బ్ పద్మా

  ReplyDelete
 14. ఈ మధ్యా అన్నీ అడగండీ. ఎందుకు ఏమిటి అంటున్నారు, హాయిగా ఒక మాంచి రొమాంటిక్ పోయం వ్రాయండి మాడం

  ReplyDelete
 15. స్పందలతో ప్రేరణలు అందించిన ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు._/\_

  ReplyDelete
 16. ఔను సూపర్బ్ మనిషిని మనిషిగా చూడాలన్న ఆరాటం పదం పదంలో కనిపిస్తుంది. పద్మార్పిత గారూ...,,, ఇంతకంటే బాగా రాయడం ఎవరికి చేతవును.... మీకు తప్ప

  ReplyDelete
 17. ఆత్మ వివేచన.... అద్భుతం

  ReplyDelete
 18. జీవిత లోతుల్ని చూసిన మెచూరిటీ మీ ఈ కవితలో ప్రతిబింభిస్తోంది. హ్యాట్సాఫ్ మేడం!

  ReplyDelete