వలపుజ్వరం

ఎడబాటుతో ఎండిన ఎదలో ఏదో తెలియని భారం
తొలకరి జల్లువై వచ్చి తనువంతా తడిపేయరాదా
మట్టిపరిమళమల్లే మనసుని మెత్తపరిచేయరాదా!

పలకరింపులే కరువైపోయి గొంతారిపోయి దాహం
మౌనాన్నే వీడి మాట్లాడి మంత్రమేదో వేయరాదా
పంతముంటే అది సడలించి పన్నీరు చల్లేయరాదా!

ఎదురుచూసి అలసిన కళ్ళలో తీరని మమకారం
నిదురబుచ్చి కలనైనా కనిపించి కనికరించరాదా
వెన్నెలంటి నీ మనసు నాదేనని నిరూపించరాదా!

నిన్ను తలచి మైమరచిన మేనుకి సోకింది జ్వరం
కౌగిట బంధించి ఇరుఎదల్లో రాపిడేదో పుట్టించరాదా
వలపురేపిన వేడిసెగలో రోగమేదైనా మాయమైపోదా!  

59 comments:

 1. wov..here padmarpita is back

  ReplyDelete
  Replies
  1. thank you... I am always here itself :-)

   Delete
 2. ప్రేమైక జీవులకు తప్పదు ఈ జ్వరం. చిత్రం అతిసుందరం

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది నిజం :-)

   Delete
 3. నీ బ్రాండ్ కవిత చిత్రంతో మరోసారి అలరించావు పద్మ

  ReplyDelete
  Replies
  1. సృజనగారు థ్యాంక్యూ

   Delete
 4. వలపుల జ్వరమా
  కాదు కాదదీ జ్వరం,
  తీయని తాపం!

  తీరని తాపమా? అది
  కాదది తీర్చుకునే తాపం
  వెన్నెల జలకాలాటలలో
  తడిసి ముద్దైన దేహాలు
  దేనికొసమో ఆరాటంతో
  ఆతృత పడిపోతుంటే

  హృదయ స్పందనలో వేగం
  నర నరాలలో రుధిర ప్రవాహం
  ప్రళయం సృష్టిస్తుంటే

  వణికే తనువులు రెండూ
  ఒకదానీ నొకటి ఓదార్చుకుంటూ
  తనువుల మధ్యన జేరిన
  గాలిని సైతం తరిమికొట్టి
  సెగ గాచుకుంటున్నాయ్
  తహ తహ లాడుతున్నాయ్ .,.,.,

  ReplyDelete
  Replies
  1. పద్మార్పితగారి వేడిఅక్షరాలకి వాడిబాణాలు తోడైనట్లు ఉందండి మీ కవిత

   Delete
  2. మీ కవిత కూడా బాగుందండి.

   Delete
  3. ఈ వలపు జ్వరంలో తడిసి మీరు వణుకుతున్నారని నిర్థారణగా తెలుస్తుంది మీ కవిత చదువుతుంటే :-). చాలా బాగుంది విశ్లేషణాత్మక కవిత.

   Delete
 5. ఎండవేడికి జ్వరం వస్తుంది కానీ వలపు జ్వరం ఏంట్రోయ్ బాబూ :-) ఫోటో కసక్ కత్తి

  ReplyDelete
  Replies
  1. అసలు జ్వరానికి మందుంది...వలపు జ్వరానికి మందులేదు బాబూ :-)

   Delete
 6. మీకు పెయింటింగ్స్ వాటికి తగిన పదాలు ఎక్కడ దొరుకుతాయో ఏమో, ఒకదాన్ని మించి మరొకటి.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ. అభిమానం ఆదరణా ఉన్నతకాలం భావాలకి లోటేం లేదండి.

   Delete
 7. ఎదురుచూసి అలసిన కళ్ళలో తీరని మమకారం
  నిదురబుచ్చి కలనైనా కనిపించి కనికరించరాదా
  వెన్నెలంటి నీ మనసు నాదేనని నిరూపించరాదా!
  మధురమైన భావన ...ఎంత రసభరితంగా రాసారు ...అక్షరాలకు సరిజోడి వర్ణచిత్రం ...

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన వ్యాఖ్యాల్లోని భావం బాగుందండి. ధన్యవాదాలు.

   Delete
 8. ఇంతలా సున్నితంగా ప్రేమను వ్యక్తం చేయడం మీకే సొంతం
  బండరాయి అయినా కరిగిపోయి అయిపోయేను మీ సొంతం

  ReplyDelete
  Replies
  1. భావాలు సొంతం ఆన్నారు బాగుంది కానీ...బండరాయి కరిగి సొంతం అయితే ఏం చేసుకోను :-) Just kidding. thank you

   Delete
 9. ప్రేమ బహుత్ పవర్ఫుల్
  జ్వరం గిరం జాంతా నహీ :-)

  ReplyDelete
  Replies
  1. ఇసీలియే ప్యార్ కర్నా మనా హై :-)

   Delete
 10. తొలకరి జల్లుతో తీరేనా తాపం, అదే వలపు జ్వరం
  అసలే ఎండలు విరగ్గాసినవని జనాలు గగ్గోలపెడితేను
  చిత్రం ఎప్పటిమాదిరిగానే అదిరింది. కవిత అబ్బో...ఏం చెప్పను :-)

  ReplyDelete
  Replies
  1. తొలకరి జల్లుతో మొదలై తరువాత కుంభవృష్టి కురుస్తుంది ఆకాంక్షగారు... కంగారు పడకండి :-)

   Delete
 11. పొందికైన అక్షరాలతో ప్రణయ పరిమళాలని అందించారు అర్పితగారు.

  ReplyDelete
  Replies
  1. పరిమళాలని ఆస్వాధిస్తున్న మీకు అభివందనాలు

   Delete
 12. తగ్గని వలపు జ్వరం
  ప్రేమలో అదేగా వరం :)
  చిత్రం కవ్విస్తూఉ, మీ కవిత్వం పరవళ్ళు తొక్కుతుందండి.

  ReplyDelete
  Replies
  1. మీరు వరం అంటున్నారు.
   వలపు జ్వరం వచ్చినవారి భాధ వేరేమొ నందుగారు.

   Delete
 13. ఈ తాపమేదో తగ్గకపోతేనే బాగుంటుంది. :-) పిక్ సూపరుంది

  ReplyDelete
  Replies
  1. మహీ తగ్గనప్పుడు శాపం అవుతుందేమో :-)

   Delete
 14. అందమైన మీ భావవాహినిలో తడిసి ముద్దవుతున్నా.
  మీ చిత్రాల ఎంపిక, కళాతృష్ణకు జోహార్లు పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. మీ స్ఫూర్తి స్పందనకు వందనాలు.

   Delete
 15. శీతలగాలులు వీస్తూ...మళ్ళీ ఋతుపవనాలు మొదలైనంత హాయిగా ఉంది కవి. వలపు జ్వరం వస్తే హాయిగా ఏంటి అంటారా...అది అంతే :-) హ హ హా

  ReplyDelete
  Replies
  1. ఎండలు తగ్గిపోయి వర్షాలు పడితే ఇంకా హాయిగా ఉంటుంది కదా నయనిగారు :-)

   Delete
 16. పద్మా ,

  ఎప్పటిలాగే నీ చిత్రం అతి సుందరం . సహజంగా చిత్రకారిణికి , రచన చేసే సదవకాశం బహు అరుదు . దానిని నీ కైవసం చేసుకొన్నావు .

  తొలకరి జల్లువై వచ్చి తనువంతా తడిపేయరాదా
  మట్టిపరిమళమల్లే మనసుని మెత్తపరిచేయరాదా!

  ఈ ప్రయోగం చాలా బాగుంది . ఓ మారు అహ , ఈ మారు తొలకరి జల్లులో మట్టి పరిమళం ఆస్వాదించాలనిపిస్తే బాగుండు అనిపిస్తోంది .


  ReplyDelete
  Replies
  1. మీలో హాయి గొల్పే భావాన్ని కలిగించిన నా అక్షరాలు ధన్యం.
   చాన్నాళ్ళకి ఇలా బ్లాగ్ వైపు తొంగి చూసారు. ధన్యవాదాలండి.

   Delete
 17. ఏం రాయాలో తెలియటం లేదు, బీటలు వారిన నేల లా ఎదురు చూపులు చూడటానికి ఎక్కడో లేడు కదా చెంతనే వున్నడాయే. చెంతన వున్నా చమత్కారముగా ఆశనిపాతాల జల్లులే కోరేనా మది ఏమది. సంశాయాన నోట మాట పెగాలకే కదా కవ్యమాయే మరల చెప్పనికి భావం ఏముంది ఎదురు ఉంది. ఎదురు చూపుల బాణాలు ఎదురుగ వుంటే సంధించినట్లు ఆ శరాలు అమ్ములపొది దాటి ఏమైనట్లు . కడలి ఎక్కడో మేఘం ఎక్కడో వీటి మధ్య దూత సూర్యుడు కదా ఆ వేడిమికి ఆవిరయ్యేను ఆ తాపమే జ్వరమని పొరబడి. కాళిదాసు కావ్యానికి మబ్బులే కరిగి వర్షమై కురియును లే. (వ్యంగ్య ప్రయోగం పద్మ గారు)

  ReplyDelete
  Replies
  1. వ్యంగ్యంగా అంటూనే వలపు కురుపించారుగా :-) థ్యాంక్యూ మిత్రమా!

   Delete
 18. తొలకరిజల్లులా రసరమ్య ప్రణయకావ్యం
  కళ్ళని మనసుని కవ్విస్తున్నది దృశ్యం

  ReplyDelete
  Replies
  1. మీలో భావుకత్వం ఉప్పొంగెను...భవ్యం :-)

   Delete
 19. చాలా రోజులకి మీదైన బాణీలో కవితని అందించారు. చిత్రం ఎప్పటిలానే కనువిందుగ ఉన్నది.

  ReplyDelete
  Replies
  1. యోహంత్....మీరు బిజీ కదా అందుకే అలా అనిపించినట్లుంది :-)

   Delete
 20. పలకరింపులే కరువైపోయి గొంతారిపోయి దాహం
  మౌనాన్నే వీడి మాట్లాడి మంత్రమేదో వేయరాదా
  సున్నిత భావవ్యక్తీకరణ మీ సొంతం.

  ReplyDelete
  Replies
  1. నచ్చినందుకు ధన్యోస్మి.

   Delete
 21. ప్రణయకావ్యం
  సుమధురం...

  ReplyDelete
  Replies
  1. ధన్యోస్మి.

   Delete
 22. sweety romantic lines by you.

  ReplyDelete
 23. ప్రణయ ప్రభంధం

  ReplyDelete
 24. ప్రణయంలో ఇంతటి వేదనే
  అయినా అది మధురభావనే-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. మీరే ఇలా అంటే ఒప్పుకోక తప్పుతుందా :-)

   Delete
 25. వలపు కురిపిస్తూ రాసిన విరహకావ్యం మధురం మేడం! చిత్రం ఎంపిక చాలాబావుంది.

  ReplyDelete
  Replies
  1. అంతా మీ అభిమానం. _/\_

   Delete
 26. ఇంత విరహమా!?

  ReplyDelete
  Replies
  1. విరహం కాదు జ్వరం :-)

   Delete
 27. This comment has been removed by the author.

  ReplyDelete
 28. ప్రాస కోసం పరితపించే కవుల మద్య ...
  సూటిగా తాకలేని పదాల మద్య...
  ఈ మీ జల్లులు జల్లెడ పట్టినా ఒక్కటి కూడా
  తీసేయలేకుండా ఉన్నాయి!
  మీ వెచ్చని భావుకత్వం చదువుతుంటే
  మా పెదాలు తీపెక్కుతున్నాయ్..!
  పలకడానికి మృదువుగా ....,
  చదవడానికి కన్నులు పెద్దవిగా చేసుకోవాల్సి వస్తుంది.
  వెలుగు చూడని ఈ తెలుగు భావాలు
  ఇంతవరకూ ఎక్కడ?!

  ReplyDelete
  Replies
  1. > ప్రాస కోసం పరితపించే కవుల మద్య ...

   క్షమించాలి. ప్రాసకోసం కవులు పరితపించటం ఎందుకు జరుగుతుంది? కవిశబ్దానికి అర్హుడైన వానికి సహజంగానే సందర్భానుగుణమైన ఛందస్సులో పద్యం వస్తుంది. పద్యానుగుణమైన పదాలు వాటికవే తమనుతాము పరచుకుంటు వస్తాయి. ఛందస్సుకు పదవిలాసానికీ భావారోపణకూ తగిన ప్రాసలూ అలంకారాలూ సహజంగానే భాసిస్తాయి. సందర్భానుగుణమైన శయ్యా,రీతీ, పాకమూ వంటివి సుష్టువులుగా సహజవిలాసంతో కుదురుతాయి.

   గురువునెత్తి గుధ్ధి కుదియించి కుదియించి
   లఘువు ముక్కుపటి లాగిలాగి

   ఆపసోపాలు పడుతూ పద్యాలు కిట్టించే వాడు కవే కాడు. వాడి వ్రాతలలు కవిత్వాలూ కావు. కవి దేనికోసమూ వెతుక్కోడండీ. కవిని వెతుక్కుంటూ అన్నీ వాటంతట అవే వస్తాయి.

   Delete