చచ్చిన శవం స్మశానాన్ని చూసి భయపడి
ఎముకల గూడుతో రాకాసిలా చిందులే వేస్తే
బూడిదంతా లేచి బ్రతికిన జనం పై ఎగసిపడే!
వచ్చిన జనం అదిచూసి రంకెలేస్తూ పరిగెడితే
తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ
తాతలనాటి శవాలన్నీ తాగి తూలి తాండవించె!
మెచ్చిన భూతం పరవశంతో పకపకమని నవ్వ
మర్రిఊడలకున్న కొరివిదెయ్యాలు ఉలిక్కిపడితే
బ్రతికినోడికే భయం కాని చచ్చిన నీకు ఎందుకనె!
పుచ్చిన లోకం బ్రతికిచస్తే అంతరాత్మలన్నీ కలిసి
పూడ్చడానికి బురదనీట పవిత్రంగా స్నానమాడె
పాడు జన్మ వద్దని పుర్రెలు ప్రార్ధనా గీతాలు పాడె!
ఎముకల గూడుతో రాకాసిలా చిందులే వేస్తే
బూడిదంతా లేచి బ్రతికిన జనం పై ఎగసిపడే!
వచ్చిన జనం అదిచూసి రంకెలేస్తూ పరిగెడితే
తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ
తాతలనాటి శవాలన్నీ తాగి తూలి తాండవించె!
మెచ్చిన భూతం పరవశంతో పకపకమని నవ్వ
మర్రిఊడలకున్న కొరివిదెయ్యాలు ఉలిక్కిపడితే
బ్రతికినోడికే భయం కాని చచ్చిన నీకు ఎందుకనె!
పుచ్చిన లోకం బ్రతికిచస్తే అంతరాత్మలన్నీ కలిసి
పూడ్చడానికి బురదనీట పవిత్రంగా స్నానమాడె
పాడు జన్మ వద్దని పుర్రెలు ప్రార్ధనా గీతాలు పాడె!
ఏం మేడం ఇలా భయపెడుతున్నారు
ReplyDeleteనేను భయపడ కూడదు అనుకుంటున్నాను.
Deleteఇదేం సావుకొచ్చే
ReplyDeleteభయంతో చస్తే ఎట్లమ్మ
ఏంటి మీ గుండె ఇంత వీక్?
DeleteDidi is it horror one.
ReplyDeleteno, its truth about life and death :-)
Deleteకవిత చదివి చావు ఇంత అందంగా ఉంటుంది అన్నమాట అనుకుంటున్నాను. లోతైన భావకవిత.
ReplyDeleteచీమ కుడితేనే కేర్ మంటాను , బొజ్జింకని చూస్తే బేర్ మంటాను , బల్లి కనపడిందా కెవ్వు మంటాను .... ఎందుకండీ నన్నిలా దయ్యాలు భూతాలూ ఆత్మలూ స్మశానాలూ అంటూ భయ పెడతారు ?
Deleteఆ లోతైన భావం అర్థమైతే భయం పటా పంచెలవుతుంది.
Deleteఈ మధ్య పసిపిల్లలే పెద్దవాళ్ళకి ధైర్యం చెబుతున్నారండి Gadepalli Venkatgaru.
Deleteతింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే
ReplyDeleteసింపుల్ గా తేల్చిచెప్పారు. మీ వ్రాతలు చూసి చావు కూడా నవ్వుకుని సంబరపడిపోతుంది
అదే నిజమైతే నాకూ సంబరమేగా :-)
Deleteచింపేశారు! చంపేశారు!
ReplyDeleteWelcome to my blog...
Deleteఇంతకీ చింపింది ఏంటి? చంపింది ఎవరిని? :-)
అయ్యబాబోయ్...కెకెకెకెకెకెక్కెవ్వువ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూ కేక
ReplyDeleteహ హ హ హ హ హ :-) :-) ;-)
DeleteI LOVE GHOSTS AND DEVILS GROUP
ReplyDeleteI LOVE YOU TOO PADMARPITA :-)
ME TOO FRIEND
Deleteమీ కవిత చదివి చావంటే భయం పోయింది.
ReplyDeleteదట్స్ గుడ్ :-)
Deleteనేను చచ్చినా చావను. నాకు చావంటే చచ్చేంత భయం.
ReplyDeleteనేను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను :-)
Deleteచావుభయం చిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పద్మార్పిత. అర్థవంతంగా కూర్చిన పదజాలం.
ReplyDeleteకవితలో కనబడలేదు అనకండి. భయంతోనే కవిత రాసాను. :-)
Deleteబ్రతికినోడికే భయం కాని చచ్చిన నీకు ఎందుకనె! చావు భీతి మనుషులకే తప్ప మృతులకి లేదని బాగాచెప్పారు.ఫోటో అధ్భుతంగా ఉంది భయపెడుతూ భయపడుతూ.
ReplyDeleteభయపడితే భయపెట్టేది చావే కదండీ ;-0
Deleteచావుని కూడా పాజిటీవ్ గా చెప్పే మీ అక్షరపరిజ్ఞానాకి జోహార్లు. అయినా జోడరా ఓ మరా. అది చావైనా పెళ్ళైనా కదండి :-)
ReplyDeleteజోడరా ఓ మరా...తిట్టారా ఏంటి ఇలా :-)
Deleteవచ్చిన జనం అదిచూసి రంకెలేస్తూ పరిగెడితే
ReplyDeleteతింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ
తాతలనాటి శవాలన్నీ తాగి తూలి తాండవించె
super likes for this lines.
ఎప్పటికైనా చేరవలసింది శ్మశానానికే కదా అని చెప్పాలనండి.
Deleteమీ కవితను చదువుతూ విజువలైజ్ చేసుకుంటే అద్భుతంగా అనిపించింది. మీ ఊహాశక్తికి జోహార్లు. ఆత్మలు ఉన్నాయో లేదో తెలీదుగానీ, ఎంత పాడు బ్రతుకు బతికినా చచ్చే నాటికి అంతరాత్మ మళ్ళీ పుడితే బాగుండు అనుకుంటుంది. అదే జీవితమంటే.
ReplyDeleteనిజమే మీరన్నది. పెద్ద జీవితసత్యాన్ని చిన్నిమాటల్లో తేల్చి చెప్పారు.
Deleteమీరు ఎన్నైనా చెప్పండి నాకు చావు అంతే చచ్చేంత భయం.బొమ్మలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది నేనే అన్నట్లు.
ReplyDeleteఇలా భయపడితే బ్రతకడం కష్టం
Deleteచచ్చిపోతే ఎంత బాగుంటుంది అనేలా రాశారు. హా హా హా భయమేస్తుంది :)
ReplyDeleteమీరు అలా అన్నారంటే...అంత పరమ చండాలంగా రాసాననా :-)
Deleteఅమ్మో... మీదైన శైలిలో అదిరిపోయేలా కవిత రాసేసారు.... చదువుతుంటే ఆత్మగా మారిపోవాలనిపిస్తోంది మేడం!! మీకు మీరే సాటి!! అందరికన్నా మేటి!!!
ReplyDeleteమీరు ఆత్మగా మారిపోతే నేనూ మారి నా ఫాన్స్ ని ఫాలో కావలసి వస్తుంది . ఎందుకు చెప్పండి ;-)
Deleteపుట్టుక వెంట చావు అయినా ఎందుకో అందరికీ అదంటే భయం. మంచికవిత పద్మా
ReplyDeleteసంద్యగారు. పుట్టుట గిట్టుట కొరకే కదా!
Deleteప్రేమిస్తే చాలు చావడానికి ఇంక వేరే దారులు ఎందుకు ఇంక చస్తాము అనే భయం ఎందుకు :-)
ReplyDeleteఅంటే మీరనేది ప్రేమించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అనా ?
Deleteఅమ్మో చావంటే నాకు భలే భయ్యం
ReplyDeleteఅందామంటే గుర్తొస్తుంది మీ పోయం
బోలెడన్ని భావాలు ఇమిడిన కవిత్వం
చదివి మెచ్చుకోవడమే అకాంక్ష కర్తవ్యం
వ్రాసాను ఒక కవిత పద్మార్పిత పై
చదివి తెగ మురుస్తున్నా నాలో నేనే
Chaavulenide Puttuka ledanedi Satyam Marenduku Bhayam
DeleteAnadaaniki Emunnadi Padaala Kooruputone Raasesaaru kadaa Poem
Bhaavaalu Devudikerukaa Padaalu Kooda Bembelettinchelaa Kavitvam
Aakaanksha gaaru Meeru Mechukolugaa Mechchukunna Telisenu mee Paripakvatwam
Raayaleka Comment Kavitaki Raasaanu Ilaa Reply mee Comment Pai
Mee Comment Chadivi Dhairyaanni Techchukuni Raayagalanemo Choodaali
Welcome to my Blog Sir.
DeleteNo fear...dhairyamgaa raaseyandi :-)
ఆకాంక్షగారి నాలుగుపాదాల కవిత్వం గురించి నేనేం చెప్పగలను...అదిరింది. :-)
DeleteThank You Andi Padmagaaru.. Kaani Nenu Sridhar Bukya andi.. Peru Maarindi Manishi Maaraledu.. Happy Doctors' Day Meeku (Pharmacy aina Health Sciences kadandi andhuku)
DeleteSorry Satishgaru meeru chepparu nene marachipoyanu. mee comments ki naa dhanyavadamulu.
DeleteHope everything is going well.
Chaavochchaakaa Elaagu Bratukugurinchi Charchinchalemu
ReplyDeleteKanisam Bratikunna naallaina Aa Chaavanedaanni Marichipoyelaa
Gurthundi Gurthulenattugaa Jeeviste Jeevitaanike Artham Paramaartham..
Kaadantaaraa Padma gaaru.. Ikanaina Kocham Jeevita Satyaalu Cheppedduru..
Aa Chaavanedi Vachchinaa Edurukone Dhairyaanni Sati Saavitrilonu Maarkandeyudilonu Puraanaalu Cheppagaa Vinnaam..
Janana Maranaalu Eruganivaaraite Chaavugurchi Charcha Chesukunna Baaguntundani Naa Abhimatam Abhipraayam.. Ekibhavistaaro Tiraskaristaaro Meeke Vadilestunna.. P.S.: Hushaaraina Kavitalu Vunte Baagundunani Naa Manavi..
Request: You have not touched Spiritual/Devotional Poems. If possible, we may expect atleast two of them.
Thank you Padma Gaaru
To be frank...till now i didn't got that Spiritual/Devotional thoughts. If i will get those thoughts definitely i will.
Delete"మానవసేవయే మాధవసేవ" అనుకుంటాను.
మనం ఎదుటివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు మన వలన వేరొకరు కష్టపడకూడదు అనే సిధ్ధాంతాన్ని నమ్ముతాను. Thanks for sharing your views.
భీభత్సం అయినా భయంకర సత్యం
ReplyDeleteఅంతలా భయపెట్టానంటారా!
Deleteజీవితం ఒక బూటకం
ReplyDeleteచావు ఎవరూ అంగీకరించని నిజం
అందుకే జీవితం అందంగా మృత్యువు భయంకరంగా అనిపిస్తుంది-హరినాధ్
బాగా చెప్పారండి హరినాధ్ గారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి.
Deleteతింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ..ఆహ్వానించడం కష్టమే!
ReplyDeleteఆహ్వానించడం ఎందుకండి టైం వస్తే ఆటోమాటిచ్ గా వచ్చేస్తుంది :-)
Deleteనాకు భయ్యమ్మ్ భయ్యమ్మ్ చావంటే చాలా భయ్యమ్మ్
ReplyDeleteభయపడితే వచ్చే చావు రాక మానుతుందా ;-)
Deleteఏది రాసినా ఇంత ఫీల్ ఉండటం మీకే సాధ్య అనుకుంటా... సూపర్బ్
ReplyDeleteమీ అందరి అభిమానమే అలా రాయిస్తుందండి. ధన్యవాదాలు.
Delete