చావు భయం

చచ్చిన శవం స్మశానాన్ని చూసి భయపడి
ఎముకల గూడుతో రాకాసిలా చిందులే వేస్తే
బూడిదంతా లేచి బ్రతికిన జనం పై ఎగసిపడే!

వచ్చిన జనం అదిచూసి రంకెలేస్తూ పరిగెడితే
తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ
తాతలనాటి శవాలన్నీ తాగి తూలి తాండవించె!

మెచ్చిన భూతం పరవశంతో పకపకమని నవ్వ
మర్రిఊడలకున్న కొరివిదెయ్యాలు ఉలిక్కిపడితే
బ్రతికినోడికే భయం కాని చచ్చిన నీకు ఎందుకనె!

పుచ్చిన లోకం బ్రతికిచస్తే అంతరాత్మలన్నీ కలిసి
పూడ్చడానికి బురదనీట పవిత్రంగా స్నానమాడె
పాడు జన్మ వద్దని పుర్రెలు ప్రార్ధనా గీతాలు పాడె!

60 comments:

  1. ఏం మేడం ఇలా భయపెడుతున్నారు

    ReplyDelete
    Replies
    1. నేను భయపడ కూడదు అనుకుంటున్నాను.

      Delete
  2. ఇదేం సావుకొచ్చే
    భయంతో చస్తే ఎట్లమ్మ

    ReplyDelete
    Replies
    1. ఏంటి మీ గుండె ఇంత వీక్?

      Delete
  3. Didi is it horror one.

    ReplyDelete
    Replies
    1. no, its truth about life and death :-)

      Delete
  4. కవిత చదివి చావు ఇంత అందంగా ఉంటుంది అన్నమాట అనుకుంటున్నాను. లోతైన భావకవిత.

    ReplyDelete
    Replies
    1. చీమ కుడితేనే కేర్ మంటాను , బొజ్జింకని చూస్తే బేర్ మంటాను , బల్లి కనపడిందా కెవ్వు మంటాను .... ఎందుకండీ నన్నిలా దయ్యాలు భూతాలూ ఆత్మలూ స్మశానాలూ అంటూ భయ పెడతారు ?

      Delete
    2. ఆ లోతైన భావం అర్థమైతే భయం పటా పంచెలవుతుంది.

      Delete
    3. ఈ మధ్య పసిపిల్లలే పెద్దవాళ్ళకి ధైర్యం చెబుతున్నారండి Gadepalli Venkatgaru.

      Delete
  5. తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే
    సింపుల్ గా తేల్చిచెప్పారు. మీ వ్రాతలు చూసి చావు కూడా నవ్వుకుని సంబరపడిపోతుంది

    ReplyDelete
    Replies
    1. అదే నిజమైతే నాకూ సంబరమేగా :-)

      Delete
  6. చింపేశారు! చంపేశారు!

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog...
      ఇంతకీ చింపింది ఏంటి? చంపింది ఎవరిని? :-)

      Delete
  7. అయ్యబాబోయ్...కెకెకెకెకెకెక్కెవ్వువ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూవ్వూ కేక

    ReplyDelete
  8. I LOVE GHOSTS AND DEVILS GROUP
    I LOVE YOU TOO PADMARPITA :-)

    ReplyDelete
  9. మీ కవిత చదివి చావంటే భయం పోయింది.

    ReplyDelete
  10. నేను చచ్చినా చావను. నాకు చావంటే చచ్చేంత భయం.

    ReplyDelete
    Replies
    1. నేను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను :-)

      Delete
  11. చావుభయం చిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పద్మార్పిత. అర్థవంతంగా కూర్చిన పదజాలం.

    ReplyDelete
    Replies
    1. కవితలో కనబడలేదు అనకండి. భయంతోనే కవిత రాసాను. :-)

      Delete
  12. బ్రతికినోడికే భయం కాని చచ్చిన నీకు ఎందుకనె! చావు భీతి మనుషులకే తప్ప మృతులకి లేదని బాగాచెప్పారు.ఫోటో అధ్భుతంగా ఉంది భయపెడుతూ భయపడుతూ.

    ReplyDelete
    Replies
    1. భయపడితే భయపెట్టేది చావే కదండీ ;-0

      Delete
  13. చావుని కూడా పాజిటీవ్ గా చెప్పే మీ అక్షరపరిజ్ఞానాకి జోహార్లు. అయినా జోడరా ఓ మరా. అది చావైనా పెళ్ళైనా కదండి :-)

    ReplyDelete
    Replies
    1. జోడరా ఓ మరా...తిట్టారా ఏంటి ఇలా :-)

      Delete
  14. వచ్చిన జనం అదిచూసి రంకెలేస్తూ పరిగెడితే
    తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ
    తాతలనాటి శవాలన్నీ తాగి తూలి తాండవించె
    super likes for this lines.

    ReplyDelete
    Replies
    1. ఎప్పటికైనా చేరవలసింది శ్మశానానికే కదా అని చెప్పాలనండి.

      Delete
  15. మీ కవితను చదువుతూ విజువలైజ్ చేసుకుంటే అద్భుతంగా అనిపించింది. మీ ఊహాశక్తికి జోహార్లు. ఆత్మలు ఉన్నాయో లేదో తెలీదుగానీ, ఎంత పాడు బ్రతుకు బతికినా చచ్చే నాటికి అంతరాత్మ మళ్ళీ పుడితే బాగుండు అనుకుంటుంది. అదే జీవితమంటే.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరన్నది. పెద్ద జీవితసత్యాన్ని చిన్నిమాటల్లో తేల్చి చెప్పారు.

      Delete
  16. మీరు ఎన్నైనా చెప్పండి నాకు చావు అంతే చచ్చేంత భయం.బొమ్మలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది నేనే అన్నట్లు.

    ReplyDelete
    Replies
    1. ఇలా భయపడితే బ్రతకడం కష్టం

      Delete
  17. చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనేలా రాశారు. హా హా హా భయమేస్తుంది :)

    ReplyDelete
    Replies
    1. మీరు అలా అన్నారంటే...అంత పరమ చండాలంగా రాసాననా :-)

      Delete
  18. అమ్మో... మీదైన శైలిలో అదిరిపోయేలా కవిత రాసేసారు.... చదువుతుంటే ఆత్మగా మారిపోవాలనిపిస్తోంది మేడం!! మీకు మీరే సాటి!! అందరికన్నా మేటి!!!

    ReplyDelete
    Replies
    1. మీరు ఆత్మగా మారిపోతే నేనూ మారి నా ఫాన్స్ ని ఫాలో కావలసి వస్తుంది . ఎందుకు చెప్పండి ;-)

      Delete
  19. పుట్టుక వెంట చావు అయినా ఎందుకో అందరికీ అదంటే భయం. మంచికవిత పద్మా

    ReplyDelete
    Replies
    1. సంద్యగారు. పుట్టుట గిట్టుట కొరకే కదా!

      Delete
  20. ప్రేమిస్తే చాలు చావడానికి ఇంక వేరే దారులు ఎందుకు ఇంక చస్తాము అనే భయం ఎందుకు :-)

    ReplyDelete
    Replies
    1. అంటే మీరనేది ప్రేమించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అనా ?

      Delete
  21. అమ్మో చావంటే నాకు భలే భయ్యం
    అందామంటే గుర్తొస్తుంది మీ పోయం
    బోలెడన్ని భావాలు ఇమిడిన కవిత్వం
    చదివి మెచ్చుకోవడమే అకాంక్ష కర్తవ్యం

    వ్రాసాను ఒక కవిత పద్మార్పిత పై
    చదివి తెగ మురుస్తున్నా నాలో నేనే

    ReplyDelete
    Replies
    1. Chaavulenide Puttuka ledanedi Satyam Marenduku Bhayam
      Anadaaniki Emunnadi Padaala Kooruputone Raasesaaru kadaa Poem
      Bhaavaalu Devudikerukaa Padaalu Kooda Bembelettinchelaa Kavitvam
      Aakaanksha gaaru Meeru Mechukolugaa Mechchukunna Telisenu mee Paripakvatwam

      Raayaleka Comment Kavitaki Raasaanu Ilaa Reply mee Comment Pai
      Mee Comment Chadivi Dhairyaanni Techchukuni Raayagalanemo Choodaali

      Delete
    2. Welcome to my Blog Sir.
      No fear...dhairyamgaa raaseyandi :-)

      Delete
    3. ఆకాంక్షగారి నాలుగుపాదాల కవిత్వం గురించి నేనేం చెప్పగలను...అదిరింది. :-)

      Delete
    4. Thank You Andi Padmagaaru.. Kaani Nenu Sridhar Bukya andi.. Peru Maarindi Manishi Maaraledu.. Happy Doctors' Day Meeku (Pharmacy aina Health Sciences kadandi andhuku)

      Delete
    5. Sorry Satishgaru meeru chepparu nene marachipoyanu. mee comments ki naa dhanyavadamulu.
      Hope everything is going well.

      Delete
  22. Chaavochchaakaa Elaagu Bratukugurinchi Charchinchalemu
    Kanisam Bratikunna naallaina Aa Chaavanedaanni Marichipoyelaa
    Gurthundi Gurthulenattugaa Jeeviste Jeevitaanike Artham Paramaartham..
    Kaadantaaraa Padma gaaru.. Ikanaina Kocham Jeevita Satyaalu Cheppedduru..
    Aa Chaavanedi Vachchinaa Edurukone Dhairyaanni Sati Saavitrilonu Maarkandeyudilonu Puraanaalu Cheppagaa Vinnaam..
    Janana Maranaalu Eruganivaaraite Chaavugurchi Charcha Chesukunna Baaguntundani Naa Abhimatam Abhipraayam.. Ekibhavistaaro Tiraskaristaaro Meeke Vadilestunna.. P.S.: Hushaaraina Kavitalu Vunte Baagundunani Naa Manavi..

    Request: You have not touched Spiritual/Devotional Poems. If possible, we may expect atleast two of them.

    Thank you Padma Gaaru

    ReplyDelete
    Replies
    1. To be frank...till now i didn't got that Spiritual/Devotional thoughts. If i will get those thoughts definitely i will.

      "మానవసేవయే మాధవసేవ" అనుకుంటాను.
      మనం ఎదుటివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు మన వలన వేరొకరు కష్టపడకూడదు అనే సిధ్ధాంతాన్ని నమ్ముతాను. Thanks for sharing your views.

      Delete
  23. భీభత్సం అయినా భయంకర సత్యం

    ReplyDelete
    Replies
    1. అంతలా భయపెట్టానంటారా!

      Delete
  24. జీవితం ఒక బూటకం
    చావు ఎవరూ అంగీకరించని నిజం
    అందుకే జీవితం అందంగా మృత్యువు భయంకరంగా అనిపిస్తుంది-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారండి హరినాధ్ గారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి.

      Delete
  25. తింగరోడా తిరిగి రావలసింది ఇక్కడికే అంటూ..ఆహ్వానించడం కష్టమే!

    ReplyDelete
    Replies
    1. ఆహ్వానించడం ఎందుకండి టైం వస్తే ఆటోమాటిచ్ గా వచ్చేస్తుంది :-)

      Delete
  26. నాకు భయ్యమ్మ్ భయ్యమ్మ్ చావంటే చాలా భయ్యమ్మ్

    ReplyDelete
    Replies
    1. భయపడితే వచ్చే చావు రాక మానుతుందా ;-)

      Delete
  27. ఏది రాసినా ఇంత ఫీల్ ఉండటం మీకే సాధ్య అనుకుంటా... సూపర్బ్

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానమే అలా రాయిస్తుందండి. ధన్యవాదాలు.

      Delete