మధురమైన మాటే చాలు మనసు మెత్తబడ్డానికి!
కళ్ళజోడుతో పని ఏల కన్నుగీటి రమ్మనడానికి...
కవ్వించే కనులు ఉంటే చాలు కైవశం అవ్వడానికి!
పరువాల వంపులే తాకాలా ప్రేమ తెలుసుకోడానికి...
పలకరింపుల పారవశ్యమే చాలు మర్మమెరుగడానికి!
చిందులేసి తైతెక్కలాడాలా సంతోషాన్ని తెలుపడానికి...
మోము పై విప్పారిన దరహాసమే చాలు గుర్తించడానికి!
బంధమే బిగియాలా ఒకరికొకరన్న భావం కలగడానికి...
మనసు చాలు మరోమనిషితో మనసిచ్చిపుచ్చుకోడానికి!
కవ్వించే కనులు ఉంటే చాలు కైవశం అవ్వడానికి!
పరువాల వంపులే తాకాలా ప్రేమ తెలుసుకోడానికి...
పలకరింపుల పారవశ్యమే చాలు మర్మమెరుగడానికి!
చిందులేసి తైతెక్కలాడాలా సంతోషాన్ని తెలుపడానికి...
మోము పై విప్పారిన దరహాసమే చాలు గుర్తించడానికి!
బంధమే బిగియాలా ఒకరికొకరన్న భావం కలగడానికి...
మనసు చాలు మరోమనిషితో మనసిచ్చిపుచ్చుకోడానికి!
మెత్తగా మొట్టి జోలపాడినట్లు ఏం కావాలి అంటే ఏమంటాం చెప్పండి పద్మార్పితాజీ :-)
ReplyDeleteమొట్టానా...ఏదో మాటవరుసకి అన్నానే తప్ప ఏపాపం ఎరుగను :-)
Deleteవేటి సాయం అవసరం లేదు నీకు అసలు మనసుంటే అంటున్నావు కద! నూటికి నూరు పాళ్ళు నిజం .
ReplyDeleteఏమో అనుకుంటున్నాను శర్మగారు. అదెంతవరకూ కరెక్టో మీరే చెప్పాలి.
Deleteపరువాల వంపులే తాకాలా ప్రేమ తెలుసుకోడానికి...
ReplyDeleteపలకరింపుల పారవశ్యమే చాలు మర్మమెరుగడానికి!
అందంగా అక్షరధిగ్భంధం చేసారు మేడం. చిత్రం కొంటెగా కవ్విస్తున్నది.
కవ్వింతలు గిలిగింతలు రేపెను అనకండి మరి :-)
Deletesooooooper cheppinaaru :) ;) :) :)
ReplyDeletethank you.
Deleteనాకు మాత్రం ఇంకోటేదోకావాలి
ReplyDeleteఅది ఎలేచ్షన్స్ లో మాత్రమె దొరుకుతుందండి వినోద్ గారు. "ఇంక్ ఓటు ది" కావాలి అంటున్నారు అంచేత ఇట్లా కమేటానన్నమాట మరోల భావించవద్దు.
Deleteబ్లాగులో కాలేశారు
Deleteనాక్కావాల్సిందేదో అర్పితా గార్కి తెలుసు
అది ఎలచ్చన్లో దొర్కద్ శ్రీధర్ జి
అదేదో మాతో పంచుకోవచ్చుగా వినోద్ గారూ
Deleteవినోద్ ఏమైనా కావాలి అంటే ఆత్రంగా బహిరంగంగా అడక్కూడదు. బుద్ధిమంతుడిలా ముందు ఎదిగి ఆ పై అడక్కపోయినా అన్నీ దక్కుతాయి.
Deleteవినోద్ గారు ఇంకోటి ఏదో అంటే తన్నులు అయి ఉంటాయి. అవి మీరు తట్టుకోలేరు, పద్మార్పితగారి రప్లై చదివి తట్టుకోండి చాలు. మాడంజీ ఎక్కడ ఉన్నా అర్జంట్, వచ్చి మీరు రిప్లైస్ ఇవ్వండి :-)
Deleteఏం కావాలి? అని అడిగారు కదా "రిప్లైస్"
వినోద్ నీలోని అల్లరి సృతిమించినట్లున్నది. కళ్యాణమే దీనికి మందు, ఆయుష్మాన్భవః-హరినాధ్
Deleteమీ కవిత కంటే నా కామెంట్ కె ఎక్కువ రిప్లై లు వచ్చినట్లున్నాయి... పర్వాలేదు నాక్కూడా ఫాన్స్ ఉన్నారండోయ్... రిప్లై ఇవ్వకుండా ఇలా తప్పించుకుంటే ఎలా అర్పితా గారు... రండి! ఇక్కడ జనాలందరూ ఊపిరి సలుపక ఎదురు చూస్తుంటే! :-))
Delete@ సంధ్య గారు.... అంటే ఇంకా ఎదగలేదన్నమాట నేను.. :-))
@ ఆకాంక్ష జి..... తన్నులు కాదండి... టన్నుల కొద్దీ కవితలు ... మరీ ఇంత కోపమైతే ఎలా???
@ హరినాథ్ గారు... రెండో పెళ్ళికి చట్టం ఒప్పుకోదేమో గురువుగారు.... ధన్యోస్మి!
ఇంతకీ మీక్కావసింది మీకైనా తెలిసిందా వినోద్ :-) మొత్తానికి మాంచి ఫాలోయింగ్ ఒక్క కమెంట్ తో కొట్టేసావు
Deleteవినోద్...మీకు ఫాలోయింగ్ కి లోటా...
Delete"చిన్నారి వినోదా నిన్ను ఎవరేమన్నారయ్యా...
నీకేం కావాలో తెలియకే అందరూ తికమక!!?
చిన్నవాడివైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడివైతేను బుద్ధిమతి నేర్పేను
యశోదను కానురా నిను దంఢించ
సత్యను కానురా నిను సాధించ"
ఇలా పాట పాడుకుని పారిపోతే బెటర్.
అందుకే...ఇక్కడ మీరు మీ ఫ్యాన్స్ చూసుకోండి.
నన్ను ఇన్వాల్వ్ చేయకండి...
ఇక్కడ వినోద్ అందరూ కాసేపు హాయిగా నవ్వుకునేలా చేయాలన్న ఉధ్ధేశంతో అలా కమెంట్ రాసానే తప్ప అన్యధా భావించవద్దని మెయిల్ చేసి అందరినీ కాసేపు నవ్వించినందుకు థ్యాంక్స్ చెబుతూ...మీ అందరి అభిమానానికి నా అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
Deleteనయనిగారికి కూడా రిప్లై ఇచ్చెయ్ వినోద్.
పద్మగారు రెండేసి లైన్స్ లో చాలాబాగుంది కవిత.
ReplyDeleteథ్యాంక్యూ యోహంథ్
Deleteవజ్రవైఢూర్యాలు అక్కర్లేదు ఆనందంగా ఉండడానికి
ReplyDeleteమీ ఈ కవితలే చాలు మమ్మల్ని అలరించండానికి!
:-) అంతేనంటారా :-)
Deleteవయ్యారంగా వాలుచూపు విసిరితే చెప్పింది వింటాం
ReplyDeleteఏం చెయ్యమన్నా ఎదురు ప్రశ్నించకుండా చేసేస్తాం
నో డౌట్ పద్మగారు కన్నుగీటకనే మీకు కైవసమయ్యాం.
నాకు కైవసం అవ్వడం ఎందుకండి...ఎవరి మనసుని వారు కైవసం చేసుకోండి చాలు. ;-)
Deleteఅందరు బాగుంటే ఇంకేం వద్దండి పద్మ గారు. సర్వే జనః సుఖినో భవంతు
ReplyDeleteమీరు గొప్ప మనసున్నావారు శ్రీధర్ గారు.
Deleteyes you are right. what you said its 100% truth
ReplyDeletethank you Pradhana
Deleteతుపాకీనే కావాలా గుండె తూట్లు చేయడానికి...
ReplyDeleteమధురమైన మాటే చాలు మనసు మెత్తబడ్డానికి!super like
super thanks ;-)
Deleteఎప్పటిలాగే కమనీయం
ReplyDeleteమీకు అభివందనం
Deleteమనసుంటే చాలు మొత్తం జయించవచ్చు అన్నమాట.
ReplyDeleteఉన్నమాటే అనుకుంటున్నాను.
DeleteMadhuramaina matalu chalu manasunu ranjimpacheyataniki.
ReplyDeleteWelcome to my blog. thank you andi.
Deleteముగ్ధ ముఖం మనోహరం
ReplyDeleteకవితలో భావం సుమధురం
మీకు నా వందనం
DeleteSupur...
ReplyDeleteTelugu Upakarini
thank you.
Deleteపై పై మెరుగుల్ని గాక లోతైన మనస్సు భావాల్ని కోర్కోవాలనే మీ భావన అధ్భుతం సుమండి.....
ReplyDeleteచక్కనైన కవితకు బహు చక్కనైన చిత్తరువు అమోఘం! మేడం....
భావాన్ని అర్థం చేసుకున్న మీకు ధన్యవాదాలండి
Deletenothing we required padmaji. your writings are enough :-) Lovely poem
ReplyDeleteso simple desire :-)
Deleteమాటవరుసకి ఏం కావాలి అడుగుతారు. అడిగినవి అన్నీ అందరికీ దొకేనా ఏమి :).ఈసారి చిత్రానికే ఎక్కువ మార్కులు
ReplyDeleteఅడగంది అమ్మైనా పెట్టదు
Deleteఅలాగే మన ప్రయత్నం మనం చేయక మానకూడదు అనేది నా అభిమతం.
meeru aadavaare kaavaalaa valalo padataaniki mee kavita chaaladoo
ReplyDeleteThank you. welcome to my blog. male or female ani inta pedda doubt...adii after 8yrs :-)
Deleteమంచితనం, మెత్తటి మనసు ఉంటే చాలు అంటావా పద్మా...మరి మిగిలినవి ఒప్పుకుంటాయా :-)
ReplyDeleteమెత్తటి మనసు ముందు అన్నీ బలాదూర్ :-)
Deleteమూడో పేరా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పిక్ ఎప్పటిలానే, మీ ఈ చిన్నికవితలో మంచి మాటలు మెండు.
ReplyDeleteఆకాంక్షగారు. ఏం అల్లరి చేయకుండా ఇలా వెళ్ళిపోతే ఏదోగా ఉంది :-)
Deleteతుపాకీ అవసరం ఎందుకు తూట్లు చేయడానికి మీ కవితాక్షరాలు ఆల్రెడీ తూట్లు పొడుస్తూనే ఉన్నాయి కదండీ. :-) మీ కవితలు చేసిన గాయాలకి లేపనం కూడా మీ కవితలే.
ReplyDeleteఆల్రెడీ గాయమైన వారికి లేపనం రాయడమే తప్ప ఏం చేయగలను. థ్యాంక్యూ ;-)
Deleteమనసు మంచిదైతే మనుగడ మఖ్మల్ తివాచీ అని పాతరోజులు తల్లీ, ఇప్పుడంతా మెకానికల్ లోకం. మనుషులంతా మరలైపోయారు. ఏం కావాలి ఇలా ఉండాలి అని చెబితే వినే కాలం కాదు నవ్వుకునే కాలం- హరినాధ్.
ReplyDeleteఇవి కవితకే కానీ జీవితంలో భాగం కాదులెండి. కంగారు పడకండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.
Deleteఏమడుగను ఇంకేమడుగను...
ReplyDeleteనోరు మంచిదైతే ఊరు మంచిది అగునంటే
మనసు మంచిదైతే లోకమే మోకరిల్లునంటే
అడిగినా మానినా రాసేవి మీరు చదవక తప్పదు :-)
Deleteతుంటరిపిల్ల సందేశం
ReplyDeleteAada valla letha kanureppala mundu tupaki gullu ayypaativi cheppu nestam.
ReplyDelete