శ్రీ-420వెనుకెనుకే వస్తావు వెంటనే మాయమవుతావు
మాయలోడివి నీవు నన్ను ఏదో మాయచేసావు

చిలిపిచేష్టలెన్నో చేసి చేతికి మాత్రం చిక్కకున్నావు
చిల్లర దొంగవి నీవు చిన్నదాని మనసు దోచినావు

సోగ్గాడివిలే నీవు సొగసరినంటూ నన్ను పొగిడేవు
సరసానికని సైగచేస్తే సంకలు ఎగరేసుకుని వస్తావు

కొంటెచూపులు చూస్తూ కొంగు పట్టుకుని తిరిగేవు
కోరమీసమే దువ్వుతూ కోమలాంగిని ఏదో కోరేవు

అన్నింటికీ సై అనంటూ అల్లరేచేసి ఆట పట్టిస్తావు
ఆలిని చేసుకోమనంటే ఆమడదూరం పరిగెడతావు

మోసగాడిని కానని మసిరాసి మంత్రమేదో వేసేవు
మొత్తానికి బ్రతుకు నేర్చిన శ్రీ-420 మగాడివి నీవు

(శ్రీ-420 పోస్ట్ తో బ్లాగ్ లో మొత్తం 420 పోస్ట్లు పూర్తి చేసానని తెలియ చేసుకుంటూ, ఎవరినైనా తెలిసీ తెలియక బాధపెట్టి ఉంటే మనసారా మన్నిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆదణాభిమానాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ...మీ పద్మార్పిత _/\_ )

28 comments:

 1. మమ్మల్ని తిట్టి మంచి మాటలు చెప్పే మీకు హృదయపూర్వక అభినందనలు.

  ReplyDelete
 2. MY HEARTY CONGRATULATIONS TO U.

  ReplyDelete
 3. మరెన్నో అహ్లాదభరిత కవితా కుసుమాలతో అందరినీ అలరించాలి అసామాన్య ప్రతిభావంతురాలైన మా అల్లరి అర్పిత. ధీర్ఘాయుష్మాన్ భవః- హరినాధ్

  ReplyDelete
 4. మగాళ్ళు శ్రీ420 అయితే ఆడాళ్ళు డబుల్ బాళ్ళు శ్రీ840 అనాల్సి వస్తది.

  ReplyDelete
 5. అభినందన మల్లెమాలలు మీకు.

  ReplyDelete
 6. నందిని ఫ్రెండ్స్ గ్రూప్ నుండి మీకు అభినందనలు పద్మార్పితగారు.

  ReplyDelete
 7. అమ్మో ఎన్ని అక్షరమూటలో
  ప్రతిమూటలో ఎన్నో వైవిధ్యాలు
  అభినందనలు అందుకోండి

  ReplyDelete
 8. 210 అయినా చదివి అర్థం చేసుకోలేదు పూర్తిగా, 420 ఎప్పుడు చదవ గలుగుతానో. కంగ్రాట్స్ మాడంజీ

  ReplyDelete
 9. మదిపూర్వక అభినందనాలు. మీరు ఇంకా ఎన్నో కవితలు వ్రాసి మెప్పించాలని కోరుకుంటున్నము.

  ReplyDelete
 10. Metipadaalato Alarinche Padmagaariki abhinandanalu..
  Ae Topic teesukunna alavokaga bhaavaalu palakaristaaru
  Kavita Naayakunni Tittinatte titti Pogidestu vuntaaru
  Kavita naayaka nu Aliginattu choopinchi maral bujjagistaaru


  Nannu Maatram Kothaga Vachchaanu Anukunnaaru..
  Nene nandi Sridhar Bukya ni.. Intakritam Mukhapustakam Aakaankshagaari Mukhaanni Maarchinatlugaane Google vaaru nenu allari ekkuva chestunnaano alaristunnaano telusukovataaniki (saradaake lendi) naa asalu peruku badulu naa nickname nu 90 days kani lock chesesaaru.

  Naalugu Noorulu Naalugu Aidulu Kalagalpi 420 poems rachinchinanduku abhinandanalu padma gaaru

  ~ Sridhar Bukya

  ReplyDelete
 11. మొత్తానికి బ్రతుకు నేర్చిన శ్రీ-420------Congratulations madem.

  ReplyDelete
 12. మొత్తానికి అందరి మగాళ్ళు మోసగాళ్ళు అని తిడుతూనే ప్రేమించేసినట్టున్నారు :-) అభినందనలు మీకు

  ReplyDelete
 13. దీనికి పదింతలు రాయాలని కోరుతూ పద్మార్పితగారికి అభినందనలు.

  ReplyDelete
 14. Hey..idi eppudo reach avalsindi already manasuni kavitalatoe eppudo dochavu. congrats

  ReplyDelete
 15. అరెరెరే కరెక్ట్ టైంకి బులెట్స్ లేవు శ్రీ-420 గారిని కాల్చేద్దామంటే. :-) మిస్సింగ్ మిస్సింగ్. Great Padmaji Congrats.

  ReplyDelete
 16. సోగ్గాడివిలే నీవు సొగసరినంటూ నన్ను పొగిడేవు
  సరసానికని సైగచేస్తే సంకలు ఎగరేసుకుని వస్తావు
  మీరు మమ్మల్ని నిర్మొహమాటం లేకుండా దుమ్మెత్తిపోస్తే ఎలా చెప్పండి.

  ReplyDelete
 17. 420 మంచిముత్యాలని అందించిన మీకు అభినందనలు.

  ReplyDelete
 18. సులభంగా ఈ సంఖ్యకి రెట్టింపు రాసేస్తారు చూడండి త్వరలో మీరు. శుభాభినందనలు.

  ReplyDelete
 19. అద్భుతంగా రాసారు. సహస్రం పూర్తి చెయ్యాలి మీరు.

  ReplyDelete
 20. గంపెడు అభినందనలు మా తరపు నుండి బుట్టెడు అభిమానంతో పద్మా.

  ReplyDelete
 21. ఎవరైనా వందా రెండొందలు పూర్తైనాయి అంటారు. మీరు 420 పోస్టులు వ్రాసి మీ మానసచోరుడు "శ్రీ-420" అంటూ పరిచయం చేసి మరీ విన్నూతనంగా చెప్పారు. అప్పుడెప్పుడో అన్నటులు మీరు "యునిక్".

  ReplyDelete
 22. మీ అందరి ఆత్మీయ అభినందనలకు అంజలి ఘటిస్తూ నమస్కారములు.

  ReplyDelete
 23. ఆలస్యంగా హృదయపూర్వక అభినందనలు పద్మ.

  ReplyDelete
 24. అద్భుతమైన భావం. ఆలస్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

  ReplyDelete
 25. కంగ్రాట్స్. ఇంకా ఎన్నో ప్రణయ కావ్యాలు మీ నుండి కోరుకుంటున్నాము.

  ReplyDelete
 26. అధ్భుతభావం మరియు చిత్రం

  ReplyDelete
 27. BELATED CONGRATULATIONS MADAM

  ReplyDelete
 28. ఇలానే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తూ మునుముందుకు తారాజువ్వలా సాగిపోవాలని కాంక్షిస్తూ .... మీ అభిమాని

  ReplyDelete