నిదురరాని భావాలని నిదురపొమ్మని
నిశిరాతిరి ఒంటరితనమే జోలపాడుతుంటే
నిట్టూర్పులు జతగా సన్నాయి ఊదుతూ
హృదయ సవ్వడులే మద్దెల వాయిస్తుంటే
జ్ఞాపకాలే నాట్యం చేస్తూ మదిని వెక్కిరించె!
చిరుగాలులే వచ్చి పక్కపరచి పలకరింపని
గోడ గడియారాన్ని ఆగమని సైగ చేస్తుంటే
కదలని క్షణాలన్నీ కక్ష కట్టి మదినిదువ్వుతూ
మెదడునే మభ్యపెట్టబోయి మొద్దుబారుస్తుంటే
నిద్ర నటిస్తున్న ఆలోచనలే లేచి దిక్కులుచూసె!
చెప్పుకున్న ఊసులు చంద్రుడు చాటుగా విని
అదును దొరికెనని కన్నుగీటి మరీ పిలుస్తుంటే
అలిగిన కనురెప్పలు బరువుగా మూతపడుతూ
విరహం తాళలేక విధిననలేక తననే తిట్టుకుంటే
కీచురాళ్ళతోచేరి యుగళగీతమని రాగమాలపించె!
ఇంతకీ కునుకు పట్టిందా మాడంజీ...:)
ReplyDeleteపదాలు పదనిసలు ఆడుకున్నాయి
పట్టి ఉంటే కవిత కాదు గురక వినిపించేది కదా :-)
Deleteచిరుగాలులే వచ్చి పక్కపరచి పలకరింపని
ReplyDeleteగోడ గడియారాన్ని ఆగమని సైగ చేస్తుంటే
కదలని క్షణాలన్నీ కక్ష కట్టి మదినిదువ్వుతూ
మెదడునే మభ్యపెట్టబోయి మొద్దుబారుస్తుంటే
నిద్ర నటిస్తున్న ఆలోచనలే లేచి దిక్కులుచూసె!...........కునుకు పట్టదు విరహంలో నిద్దురే రాదు ఎదబాటులో ఎంత హృద్యంగా రాసారు పద్మాజీ ...
:-) అర్పితగారు అంతేనండి...ఆమె నిద్రపోదు మనకి నిద్రపట్టనీయదు (కవితలతో)
Deleteఎండవేడికి అప్పుడు అలా నిదుర రాలేదు...ఇప్పుడు ఋతుపవనాలు వచ్చేసాయిగా కునుకు పడుతుందిలెండి. Ghousuddin ji :-)
Deleteఆకాంక్ష...మీరు కూడా నిదుపొండి.
ఎదబాటు కాదు ఎడబాటు అని చదువుకోగలరని మనవి
ReplyDeleteఅలాగే
Deletedidi your kavita remembering me this song..."mujhe neendh na aaye chain na aaye jaawo jarah dhood ke laavo, na jaane kaha mere dil kho gaya" :) so beautiful art.
ReplyDeletePayal ye pyaar ka rog hi :-)
Delete'నిశిరాతిరి ఒంటరితనమే జోలపాడుతుంటే
ReplyDeleteనిట్టూర్పులు జతగా సన్నాయి ఊదుతూ
హృదయ సవ్వడులే మద్దెల వాయిస్తుంటే'
జ్ఞాపకాలే నాట్యం చేస్తూ మదిని వెక్కిరించె. మాడం అనదంగా అమరింది పదకూర్పు.
మీ కవితాప్రవాహంకి అడ్డు అలుపులేదు.
కొనసాగనివ్వండి. ఈ ఫోటో కొన్నాళ్ళు నన్ను వెంటాడుతుంది.
ఫోటో వెంటపడి పోస్ట్లు చదవడం మరచిపోకండి. :-)
Deleteనిశి రాతరి భావాలని నిదుర పుచ్చె జోలపాటకు
ReplyDeleteనిట్టూర్పు సన్నాయి రాగమైంది, హృదయరవళీ
మద్దేల వాయీద్యం కాగా జ్ఞాపకాలు నృత్యం చేసాయీ......అమోఘం
గడీయారపు సడినీ ఆజ్ఞాపీంచి ఆపితే కాలం ఆగిపోయిందీ .
నిద్రనటించే ఆలోచనలను చంద్రుడు కన్ముగీటి పిలుస్తుంటే .......
వెళ్ళే తెగింపు లేక..... అందీవచ్చిన తోడు వదలలేక .......విరహం
తో వేగుతూ వేదనననుభవిస్తున్న ఓ సాంప్రదాయం చట్రంలో ఓదిగి
పోయిన ఓ కన్నె తాపం అది
పద్మార్పిత గారి భావతరంగాలలోంచి విరిసిన కునుకు కుసుమించిన
స్వర్ణకుసుమం ......భేషో భేష్
శర్మాజీ...కౌంటర్ కవిత బాగుందండి.
Deleteసతీష్ కొత్తూరిగారు ఏమైపోయినట్లో
ధన్యోస్మి శర్మగారు.
Deleteఆకాంక్షగారు...లేనిపోనివి నేర్పిస్తున్నారా ఏంటి :-)
Deleteచిరుగాలులే పక్క పరచడం...ఎంతో అందమైన భావం.
ReplyDeleteనచ్చినందుకు...హ్యాపీ
Deleteఏకాంతపు యుగళ గీతం...
ReplyDeleteథ్యాంక్యూ సురేష్ గారు
Deleteభావ యుగళగీతాని చక్కని కవితారూపాన్ని ఇచ్చి చిత్రంతో కనువిందు చేసారు పద్మగారు.
ReplyDeleteధన్యవాదాలు
Deleteచెప్పుకున్న ఊసులు చంద్రుడు చాటుగా విని
ReplyDeleteఅదును దొరికెనని కన్నుగీటి మరీ పిలుస్తుంటే
అలిగిన కనురెప్పలు బరువుగా మూతపడుతూ
విరహం తాళలేక విధిననలేక.....వన్స్ మోర్
thank you Nandu
Deleteఎడబాటు భారమంటూ కునుకురాక నిదురపోక ఆరోగ్యం చెడిపోవును. జాగ్రత్త అర్పితా :-) చిత్రం కవితాభావం మురిపిస్తున్నాయి-హరినాధ్
ReplyDeleteమీ అభిమానానికి నెనర్లండి
Deleteకునుకుపడితే మనసు కాస్త కుదుట పడతది
ReplyDeleteకుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది...అని అప్పుడే సినీకవి చెప్పారు. ఏదో విధంగా నిదురపోవడమే తప్పదు :-)
అదే ప్రయత్నించాలి :-)
Deleteమీ ఎడబాటు జడివానలో తడిసి ముద్దయ్యాము మేడం ... సరళమైన పదాలతో ప్రేమభావాన్ని పోందిగ్గా పండించారు! అమోఘం..!
ReplyDeleteఋతుపవనాలకి ముందే తడిస్తే ఎలాగండి.:-)
Deleteనీవు రావు నిదుర రాదు అని పాడుకుని నిదురపొండి మాడం :-)
ReplyDeleteపాడుతూ నిదురేమిటో !!!! :-)
Deleteచూడ చక్కగున్నది చిత్రంలో చిన్నది
ReplyDeleteదాని విరహమేదో మమ్ము ఉసిగొల్పుతున్నది
కునుకు కవిత్వం కత్తిలా కసుక్కుమన్నది
చదువుతుంటే మా మనసు జిలు జిల్లుమంటున్నది
పద్మగారు ఇది నేను కాదు మిత్రబృందం అల్లినది
మీ మిత్రబృందానికి మీకు నమోఃవందనం._/\_
DeleteMarvelous Blog. Resembles with Art Gallery
ReplyDeletethanks a lot Prardhanaji.
Deleteబాగుంది కునుకు పట్టనీయని భావలహరి
ReplyDelete:-) థ్యాంక్సండి.
DeleteSuperb painting and poetry mam
ReplyDeletethank you.
Deleteawesome
ReplyDeletethanks a lot.
Deleteరేయిని పగలు, పగలుని రేయిగా మార్చే మీ భావనలముందు, కునుకేం పడుతుంది. ఆకలి దప్పికలు ఏం ఉంటాయి చెప్పండి.ఇలా చదివి చదివి అలుపొచ్చి మేము నిద్రపోవాలే తప్ప మీకు కునుకురాదు :-) ఎప్పుడూ బాగుంది, సూపర్ అని అనలేక ఇకపై నిష్టూరాలు వేయాలని కమిటీ తీర్మానించింది. ఇక పై తప్పవు మీకు తిప్పలు. :-) మీరు రిప్లైస్ ఇవ్వరు అన్న ధీమాతో రాసేస్తున్నాను. మున్ముందు ఏం జరగనున్నదో
ReplyDeleteఆకాంక్షగారు...మరీ కమిటీ నిర్ణయాలదాకా ఎందుకులెండి. నేను నిదురపోక పోయినా మీరైనా నిదురపొండి :-)
Deleteఎంద చాట :-) నిద్రరావట్లే బొమ్మచూసి, కవిత చదివి :-)
ReplyDeleteచాట పీట కాదు...శుభ్రంగా నిదురపొండి.
Deleteనాకు మాత్రం కునుకు బ్రహ్మాండంగా పడుతుంది అందుకే లేట్ కమెంట్. పిస్ సూపరో సూపర్.
ReplyDeleteయు ఆర్ లక్కి :-)
Deleteపగలు వగలు
ReplyDeleteభావానికి సెగలు
ఆవిరి పొగలు
కలగలిపి కుండపోతలు
కంటికి కానరాని వాతలు
కునుకుకు కుకునుకు కొక్కోరోక్కోలు
నేను శ్రీధర్ నేనండి. లాస్ట్ సండే చిన్న పొరబాటు వలన ఆ లక్ష్మి వేంకటేశ్వరుని పేరు 90 రోజులకి ఫిక్స్ ఐపోయింది.
such a big blog name :)
Deleteపేరు మారినా మీ అభిమానం మారనందుకు కృతజ్ఞతలు.
Deleteవిరహరసరాగోల్లసాలు :-)
ReplyDeleteగోల అంటే సరిపోయేదేమో :-)
Deleteఅత్యంత సుందరం
ReplyDeleteథ్యాంక్సండి
Delete