ఎప్పటికీ ముగియని మన సంభాషణల్లో...
నాకు నేను నవ్వుతూ నిన్ను నవ్విస్తాను!
నువ్వంటావు నిన్ను పడదోసే మాటలివని
చూపనా! మౌనంగా నీవు చేసిన పంటిగాట్లని.
ఎప్పుడోసారి తీరిగ్గా ముచ్చటిస్తావు కలల్లో...
నన్ను నేను చూసుకుంటూ నువ్వే అనుకుంటాను!
నువ్వంటావు రేయంతా కంటిపై కునుకై రాలేదేమని
చూపనా! కాయలే కాసిన కంటిలో నీ ప్రతిబింబాన్ని.
ఎడబాటు ఎన్నాళ్ళో ఈ ఎదురుచూపుల్లో...
నన్ను నేనే సముదాయించుకుని నిరీక్షిస్తాను!
నువ్వంటావు విరహంతో తాళలేక తపిస్తున్నావని
చూపనా! తమకంతో తడిచీరలో దాగిన తనువుని.
ఎదపై ఒదిగి ఒకటైపోవాలి ఊహల వాకిల్లో...
నేను నా కల నిజమయ్యేను అనుకుంటాను!
నువ్వంటావు సర్వం మరిపించు సాంగత్యంలోనని
చూపనా! నన్ను నేనే మరచి నీవైన యుగక్షణాలని.
ఇంత అలవోకగా ఇంత హృద్యంగా ఎలా రాసేస్తారో? అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్
ReplyDeleteWah waaaah. Superb Mam
ReplyDeleteమైండ్ బ్లోయింగ్ ఎక్ష్ప్రెషన్స్. ఫోటో అధ్భుతం
ReplyDeleteపద్మగారూ.....మరో కవితా బ్లాస్ట్ బ్లాగ్ లో. కెవ్వువ్వువ్వువ్వువ్వువ్వు కేక
ReplyDeleteవర్షంలో వేడిసెగలా బాగుంది కవిత
ReplyDeleteఇట్లా కవితలు రాస్తే ఏం తట్టుకోలేం :-)
ReplyDeleteనిట్టూర్పి సెగలా ఎవరికి...రొమాంటిక్ కవిత వ్రాసి నువ్వు నిట్టుర్చావేమో అమ్మాయ్, నేను మాత్రం గతస్మృతుల్లోకి వెళ్ళిపోయా కవిత చదివి హా హా హా అలరించావు-హరినాధ్
ReplyDeleteకాస్త మసాలాపాళ్ళ ఘాటు ఎక్కువైంది. వర్షాకాలం బాగుంటుందిలెండీ. :-) కవితలో చెప్పిన తీరు చాలా బాగుంది
ReplyDeleteఎప్పటికీ ముగియని మన సంభాషణల్లో...అని మొదలుపెట్టి ఎప్పటీ గుర్తుండిపోయే కవితను అందించారు..అభినందనలు అర్పిత
ReplyDeleteమంచిగా రాస్తే తర్కించడానికి ఏం ఉంటుందని
ReplyDeleteఅబ్బోసి సెగ బాగారాచుకున్నట్లు ఉంది. కవితలో నిట్టూర్పుకన్నా విరహం ఎక్కువ కనపబడుతుంటే అడిగాను అంతే.
ReplyDelete"నన్ను నేనే మరచి నీవైన యుగక్షణాలు" ఎంతో అద్భుతభావం. చిత్రం నచ్చింది.
ReplyDeleteపిచ్ చూస్తె హాత్ హాట్
ReplyDeleteటైటిల్ ఏమో నిట్టూర్పు
వెరసి పద్మార్పిత స్టైల్ పోయం
మరోసారి అందమైన అక్షరాలతో అలరించావు. అభినందనలు
ReplyDeleteBold & Beautiful
ReplyDeleteఆధ్యాంతం హృద్యంగా సాగిపోయింది మీ కవిత... నిరీక్షణలో పుట్టిన ఈ భావాలు బహు కమనీయం. చిత్రం దానికి అచ్చుగుద్దినట్లు కవిత... మీకన్నా ఇంకెవరు రాయగలరు ఇలా??? మెస్మరైజింగ్ మేడం!!
ReplyDeleteచాలా చక్కనైన భావం అందమైన అక్షరాల్లో భలేగా ఇమిడింది పద్మార్పిత గారూ !
Deleteప్రేమ భావపు సెగల వేడి బాగారాచుకుందండి. :-)
ReplyDeleteచుపారుగా కవితలో.... :-)
ReplyDeleteస్పందనలతో ప్రేరణ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ పేరు పేరునా నా నమస్సుమాంజలి _/\_
ReplyDeleteతిడుతూనే ప్రేమ ఎంతో ఒలకబోసారు. చాలా బాగుంది.
ReplyDeleteOUTSTANDING POST
ReplyDelete
ReplyDeleteవలపు విరబూసింది మీ కవితలో ఇంక సెగ మటుమాయం
ఏంటి ఇవ్వన్నీ నిట్టూర్పులే అనంటారా, లేక వలపుదాచుకుంటే పుట్టిన సెగలు అని సరిపెట్టుకోమంటారా :-) ఏదో సరదాకండోయ్, కవిత చాలా బాగుంది, చిత్రం సరిపడింది.
ReplyDeleteవామ్మో నేను ఎలా మిస్డ్ ఈ నిట్టూర్పులు :-)
ReplyDelete