నిట్టూర్పు సెగ



ఎప్పటికీ ముగియని మన సంభాషణల్లో...
నాకు నేను నవ్వుతూ నిన్ను నవ్విస్తాను!
నువ్వంటావు నిన్ను పడదోసే మాటలివని
చూపనా! మౌనంగా నీవు చేసిన పంటిగాట్లని.

ఎప్పుడోసారి తీరిగ్గా ముచ్చటిస్తావు కలల్లో...
నన్ను నేను చూసుకుంటూ నువ్వే అనుకుంటాను!
నువ్వంటావు రేయంతా కంటిపై కునుకై రాలేదేమని
చూపనా! కాయలే కాసిన కంటిలో నీ ప్రతిబింబాన్ని.

ఎడబాటు ఎన్నాళ్ళో ఈ ఎదురుచూపుల్లో...
నన్ను నేనే సముదాయించుకుని నిరీక్షిస్తాను!
నువ్వంటావు విరహంతో తాళలేక తపిస్తున్నావని
చూపనా! తమకంతో తడిచీరలో దాగిన తనువుని.

ఎదపై ఒదిగి ఒకటైపోవాలి ఊహల వాకిల్లో...
నేను నా కల నిజమయ్యేను అనుకుంటాను!
నువ్వంటావు సర్వం మరిపించు సాంగత్యంలోనని
చూపనా! నన్ను నేనే మరచి నీవైన యుగక్షణాలని.

25 comments:

  1. ఇంత అలవోకగా ఇంత హృద్యంగా ఎలా రాసేస్తారో? అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్

    ReplyDelete
  2. Wah waaaah. Superb Mam

    ReplyDelete
  3. మైండ్ బ్లోయింగ్ ఎక్ష్ప్రెషన్స్. ఫోటో అధ్భుతం

    ReplyDelete
  4. పద్మగారూ.....మరో కవితా బ్లాస్ట్ బ్లాగ్ లో. కెవ్వువ్వువ్వువ్వువ్వువ్వు కేక

    ReplyDelete
  5. వర్షంలో వేడిసెగలా బాగుంది కవిత

    ReplyDelete
  6. ఇట్లా కవితలు రాస్తే ఏం తట్టుకోలేం :-)

    ReplyDelete
  7. నిట్టూర్పి సెగలా ఎవరికి...రొమాంటిక్ కవిత వ్రాసి నువ్వు నిట్టుర్చావేమో అమ్మాయ్, నేను మాత్రం గతస్మృతుల్లోకి వెళ్ళిపోయా కవిత చదివి హా హా హా అలరించావు-హరినాధ్

    ReplyDelete
  8. కాస్త మసాలాపాళ్ళ ఘాటు ఎక్కువైంది. వర్షాకాలం బాగుంటుందిలెండీ. :-) కవితలో చెప్పిన తీరు చాలా బాగుంది

    ReplyDelete
  9. ఎప్పటికీ ముగియని మన సంభాషణల్లో...అని మొదలుపెట్టి ఎప్పటీ గుర్తుండిపోయే కవితను అందించారు..అభినందనలు అర్పిత

    ReplyDelete
  10. మంచిగా రాస్తే తర్కించడానికి ఏం ఉంటుందని

    ReplyDelete
  11. అబ్బోసి సెగ బాగారాచుకున్నట్లు ఉంది. కవితలో నిట్టూర్పుకన్నా విరహం ఎక్కువ కనపబడుతుంటే అడిగాను అంతే.

    ReplyDelete
  12. "నన్ను నేనే మరచి నీవైన యుగక్షణాలు" ఎంతో అద్భుతభావం. చిత్రం నచ్చింది.

    ReplyDelete
  13. పిచ్ చూస్తె హాత్ హాట్
    టైటిల్ ఏమో నిట్టూర్పు
    వెరసి పద్మార్పిత స్టైల్ పోయం

    ReplyDelete
  14. మరోసారి అందమైన అక్షరాలతో అలరించావు. అభినందనలు

    ReplyDelete
  15. ఆధ్యాంతం హృద్యంగా సాగిపోయింది మీ కవిత... నిరీక్షణలో పుట్టిన ఈ భావాలు బహు కమనీయం. చిత్రం దానికి అచ్చుగుద్దినట్లు కవిత... మీకన్నా ఇంకెవరు రాయగలరు ఇలా??? మెస్మరైజింగ్ మేడం!!

    ReplyDelete
    Replies
    1. చాలా చక్కనైన భావం అందమైన అక్షరాల్లో భలేగా ఇమిడింది పద్మార్పిత గారూ !

      Delete
  16. ప్రేమ భావపు సెగల వేడి బాగారాచుకుందండి. :-)

    ReplyDelete
  17. చుపారుగా కవితలో.... :-)

    ReplyDelete
  18. స్పందనలతో ప్రేరణ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ పేరు పేరునా నా నమస్సుమాంజలి _/\_

    ReplyDelete
  19. తిడుతూనే ప్రేమ ఎంతో ఒలకబోసారు. చాలా బాగుంది.

    ReplyDelete

  20. వలపు విరబూసింది మీ కవితలో ఇంక సెగ మటుమాయం

    ReplyDelete
  21. ఏంటి ఇవ్వన్నీ నిట్టూర్పులే అనంటారా, లేక వలపుదాచుకుంటే పుట్టిన సెగలు అని సరిపెట్టుకోమంటారా :-) ఏదో సరదాకండోయ్, కవిత చాలా బాగుంది, చిత్రం సరిపడింది.

    ReplyDelete
  22. వామ్మో నేను ఎలా మిస్డ్ ఈ నిట్టూర్పులు :-)

    ReplyDelete