ఓదార్పు



అప్పుడప్పుడూ నేను నేను కాలేక....
అద్దంలో వికారంగా కనిపించే రూపాన్ని
నాకు నే వెగటు పుట్టి కక్కుకునే గతాన్ని
అస్తిత్వాన్ని మరచి గోల చేసే నిర్వేదాన్ని!

నాలో నిర్లిప్తత సంతోషాల్ని గెలవలేక....
మారే ఋతువులవలె మనసు మారుస్తూ
నడిరేయి కలలు ఎన్నింటినో స్కలింపజేస్తూ
ఉన్నాను గోడకి చిత్రపటంలా వ్రేలాడుతూ!

నిశ్శబ్ధాన్ని మనువాడి రాజీ పడలేక....
మాటలెన్నింటినో పదాల పందిళ్ళుగా అల్లి
నిదురోతున్నట్లు నటిస్తున్న భావాలని గిల్లి
నన్ను నే ఓదారుస్తా మదిపై కన్నీరు జల్లి!

23 comments:

  1. పద్మార్పితా ఎందుకమ్మా నీలో ఈ నిరాశ నిర్వేధం? కవితాపరంగా నీ శైలికి విభిన్నంగా చాలా బాగా వ్రాసావు. జీవితం మాత్రం ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ సాగాలని కోరుకుంటున్నాను-హరినాధ్

    ReplyDelete
  2. OUTSTANDING EXPRESSIONS WITH EXTRAORDINARY FEEL...CLAPS CLAPS CLAPS

    ReplyDelete
  3. మారే ఋతువులవలె మనసు మారుస్తూ
    నడిరేయి కలలు ఎన్నింటినో స్కలింపజేస్తూ
    ఉన్నాను గోడకి చిత్రపటంలా వ్రేలాడుతూ!
    నీవు మాత్రమే వ్రాయగలవు ఇలా...
    అత్యంత అద్భుతమైన భావప్రకంపనలు నీలో పద్మ.

    ReplyDelete
  4. పద్మార్పిత పదాలకు పవరొస్తే ఇలా ఉంటుంది కవిత...
    పూర్తిభిన్నమైన శైలిలో అధ్భుతమైన కవిత మేడం...

    ReplyDelete
  5. పద్మ పదభంగిమలో చిక్కి విన్యాసమే చేస్తున్న వ్యధాభరితం ఈ కవిత.
    చిత్రం చూసి కవిత వ్రాసారా లేక కవిత వ్రాసి చిత్రమా చెప్పండి.

    ReplyDelete
  6. ఏదైనా కామెంట్ పెడదామంటే మీ అభిమానులు కుళ్ళబోడుస్తారన్న భయం... :-D :-P
    గౌరవనీయులైన పద్మార్పిత గారు... మీ కవిత చాలా బావుందండి... మీరే రాశారా ఇది అనిపిస్తోంది :-)

    ReplyDelete
  7. Madam great lines with beautiful picture

    ReplyDelete
  8. మీరు కాదు ఓదార్చుకుంటుంది
    మీ ఆత్మబలమే ఆ పనిచేస్తుంది
    మీకు అక్షరాలతో ఆడుకోవడం తెలుసు
    మీలో ఆ పస ఉందని మరోసారి రుజువైంది
    అబ్బో ఇలా రాసుకుంటూ పోతే తెల్లారిపోతుంది
    మొత్తానికి కవితాచిత్రం గుండెలో కస్సున దిగింది

    ReplyDelete
  9. అంతరంగంలోని భావాలని ఉతికి ఆరేసినట్లుందండి కవిత. చిత్రం చాలా బాగుందండి.

    ReplyDelete
  10. నిశ్శబ్ధాన్ని మనువాడి రాజీ పడలేక....
    మాటలెన్నింటినో పదాల పందిళ్ళుగా అల్లి EXCELLENT

    ReplyDelete
  11. అర్భుతమైన భావాన్ని మర్మగర్భంగా కవిత ద్వారా పలికించారు

    ReplyDelete
  12. టైటిల్ చూసి మీరూ ఓదార్పు యాత్ర మొదలెట్టారు అనుకున్నా ఇక్కడ చదివితే అమ్మో అంతా వేదనే మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడమే

    ReplyDelete
  13. ప్రతి పదంలోనూ వ్యధతో పాటు అక్షరాలతో విన్యాసం చేయించారు. కుడోస్

    ReplyDelete
  14. మీ కవితల్లో రోజుకో కొత్త పదభంగిమను చూస్తున్నాము. మరో ఎక్సలెంట్ పోస్ట్.

    ReplyDelete
  15. అద్దంలో వికారంగా కనిపించే రూపాన్ని
    నాకు నే వెగటు పుట్టి కక్కుకునే గతాన్ని
    మీ అందవికారులేంటి, మిమ్మల్ని మీరు తిట్టుకుంటే ఎలాగండి.

    ReplyDelete
  16. ఇంత వేదన ఎందుకు పద్మగారు.
    ఎంతో చిన్నిది జీవితం, నవ్వుతూ నవ్విస్తూ బ్రతికితే పోలా :)

    ReplyDelete
  17. స్త్రీ మనోభావాలకి ప్రతిరూపం

    ReplyDelete
  18. మీకు మీరే ఓదార్పా...ఆ చాన్స్ ఎవరికీ ఇవ్వరా :) sooper painting

    ReplyDelete
  19. ఈ కవితలో మీ భావాలు చాలా ఘాటుగా ఉన్నాయి

    ReplyDelete
  20. ఆదరించి అభిమానిస్తున్న మీ స్పందనలు నా వందనములు.

    ReplyDelete
  21. చాలా నచ్చింది

    ReplyDelete