మాచెడ్డ మాయరోగం


రింగురింగులతో ఒత్తైన జుట్టుంటే
అబ్బో నా రాజు హీరోలే అనుకున్నా...
గుట్కా నమిలి ముద్దు ఇమ్మనడిగితే
మానేయి మామా ముద్దులే ముద్దులన్నా...
పరగడుపునే ప్రొగతాగి రింగులొదలడం చూసి
మెల్లగా మెత్తగా చెప్పి మార్చుకోవాలనుకున్నా!

పాలిపోయిన ముఖాన్ని చూసి
పాలమీగడంటి పసివాడనుకున్నా...
ఎర్రబడిన కళ్ళని నలుపుతుంటుంటే
ఎర్రి నా వాడికి ఎంత కష్టమో అనుకున్నా...
పొరుగూరెళ్ళి పేకాడొచ్చి ప్రేమ ఒలికిస్తే
నీకు ఇదేం పోయేకాలమొచ్చే పుండాకోరన్నా!

ఏమైనా చుక్కల్లో చంద్రుడల్లే
చూడ చక్కనోడు అనుకున్నా...
తలొంచి తూలుతూ వచ్చి వాలితే
కాయ కష్టంతో అలసినాడనుకున్నా...
చూడకనే సుందరాంగినని నన్నంటే
సందేలనే సుక్కేసుకొచ్చావేరా సచ్చినోడాన్నా!

తిడతావు ఎందుకే అని కలబడితే
వీడికి బడితపూజ తప్పదనుకున్నా...
మాటలకి మానని మాచెడ్డ మాయరోగమని
తిక్క కుదర్చడానికి తిరగబడి తన్నబోతున్నా...
మరి నాకు వత్తాసు పలికి సై అనేవారు ఎందరో
తప్పని చెప్పి తిట్టేవారు ఎవరో ఎదురు చూస్తున్నా!

24 comments:

  1. సూటిగా అడిగిన నీ ప్రశ్నకు ఒకే ఒక్కమాటలో జవాబు చెబుతున్నా...కుమ్మెయ్ ;-)

    ReplyDelete
  2. మాచెడ్డ మాయరోగం అని మీరే అన్నారు, తన్నితే తగ్గిపోతుందా ఏంటి

    ReplyDelete
  3. ఈ పోస్ట్ చదివిన పెళ్ళి కాని అబ్బాయిలు వ్యసనాపరులైతే పెళ్ళిచేసుకోరు
    పెళ్ళైన వ్యనాపరులైతే పోస్ట్ కి కమెంట్ వ్రాయరు. నన్ను తిట్టుకున్నా లేకపోయినా ఇది నిజం

    ReplyDelete
  4. అడగాలా...అనుకుంటే ఖుమ్మేయాలి, తరువాత ఏమైతే అయ్యింది ..హా హా హా

    ReplyDelete
  5. గిసోంటివన్ని మేం మస్తుగా తినున్నాం. తన్నితే ఊకుంటామా

    ReplyDelete
  6. ఏంటి మాడం రాను రాను రెబల్ రచయిత్రిలా మారిపోతున్నారు. తన్నకండి వదిలేయండి పాపం.

    ReplyDelete
  7. ప్రతి భర్తా భార్యకు లోకువే, ఏమన్నా ఏం చేసినా భరించేవాడే భర్త. ఆలస్యం ఎందుకు కానివ్వండి. మేం వద్దంటే మాత్రం వదిలేస్తారా ఏంటి :)

    ReplyDelete
  8. తిరగబడి తన్నవలసిందే...మాటలతో వినని భూతాన్ని తన్నులతోనే తరిమేయాలి కదూ, లాతోంకా భూత్ బాతోన్ సే నహీ మాంతా అని హిందీలో కహావట్ కి తెలుగు అనుకరణ బాగుందా :-)

    ReplyDelete
  9. మాడంగారు ఎందుకు మీకు మగవాళ్ళపై అంత కసి కోపం. అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది

    ReplyDelete
  10. ఇలాంటి అలవాట్లు మా ఇంటా వంటా లేవు ఉంటే మీరు చేసే పనే రైట్ :)

    ReplyDelete
  11. ఒలమ్మొలమ్మొలమ్మొ పద్మ గారు. మాబాగా సెప్పినారు. ఒక్కోపాలి ఆలకించనోళ్లకు ఇట్టాగే సెప్పాలా. నెపోతే ఎట్టా.. గుట్కా తో మాయరోగం తెప్పించుకునే బదులు అదే నోటిని చల్లని మాటలతో నింపుకుంటే లోకమే చల్లన (నోరు మంచీదైతే ఊరు మంచిది) ఇహ ముక్కు నోరు మండిపోతున్నా లోలోపలే పొగ తగిలి తిత్తుల తిత్తీ తీసి జీవితాన్ని బ్రతికుందగానే కొలిమిలోని మసిబారిన కట్టే లాగా సిల్లులు పడ్డ ఊపిరితిత్తుల కంటే సీపూరు పట్టి నాలుగు ఝళిపిస్తే ఆ పొగాకు సెగన నిత్య కొలిమి బదులు ఆత్మ జ్యోతి లో అఖండత్వాన్ని మేళవించుకోవచ్చు. మలేమో ఆలోగ్యం కోచమ్ తానితా మాత్లలు ఒంత బత్తవ్ తానీ షార గుడుంబ కల్యూ మాత్లమ్ ఒలు సేప్పకున్నాను కళ్ళు బైర్లుకమ్ముతున్న రహదారెటొ పిల్లకాలువెటొ తెలియని మైకం కంటే సుబ్బారంగా ఉతికి ఆరెస్తే నొప్పి ఎరిగైన ఒళ్లకుంటాలు. పేక ముక్క కు బదులుగా పిక్క వాచీనట్లు టీన్మార్ ఎస్తె సామీరంగా పెతి పేక ముక్క ఆట్టుకున్నప్పుడు ఆ దండోపాయం గుర్తుకురావాలా. అద్గది అట్ట ఐతేనే దారిలో రారాయె.
    (వ్యసనం బారిన పడితే జీవితాంతం తోడుంటానని ఆ తొడుకు నీడలా ఉంటానని పంచ భూతాల సాక్షిగా భార్య ను భరించాలని చేసిన ప్రమాణం బూడిడలో పోసిన పన్నీరూలా నిత్యం తన కన్నుల్లో రాలే కన్నీళ్లలా. భర్త అనే స్థానాని గౌరవాన్ని కోల్పోయిన జీవచ్చేవం లా బ్రతికే కంటే వ్యసనం బారిన పడకుండా ఉంటే గంజినీరైన అమృతమేగా)

    చాలా బాగా సెలవిచ్చారు పద్మగారు. నయని గారు మీతో ఏకీభవిస్తాను కానీ లోకంలో తాగుడు వాగుడు కంటే మహమారి. మాటలు ఒక్కోసారి మనసుని ఇబ్బంది కలిగిస్తాయి కానీ ఒక్కోసారి ఆ మాటలే మనసుని తేలికపరుస్తాయి మనవాళ్ళే అనే ధోరణిని అవగత పరుస్తాయి. కానీ వ్యసనం బారిన పడితే ఆ క్షణం నుండి అనుక్షణం నరకమె. ఇహలోకే పరలోకే మోక్షం నా ప్రాప్యతె.

    శ్రీధర్ భూక్య

    ReplyDelete
    Replies
    1. అదే మరి పద్మగారి దగ్గరే వేషాలు వేస్తే ఇలాగే తన్నేస్తారు. శ్రీధర్ గారు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాపరులు మరి పోస్ట్ చదివి. కాదంటారా!

      Delete
  12. మాటలతో తగ్గని మాసెడ్డ మాయరోగానికి సరైనా చికిత్స నువ్వు చెప్పింది చేస్తున్నది. కానియ్యి- హరినాధ్

    ReplyDelete
  13. దులిపేసెయ్ పద్దమ్మో దుమ్ము దులిపేసెయ్యమ్మో.
    వ్యసనాపరులలో మార్పు తీసుకొచ్చేయ్యమ్మో :-)

    ReplyDelete
  14. చెడు అలవాట్లు ఉన్నవారు జవాబు ఇస్తే బాగుంటుంది. ఎలాగో లేని వాళ్ళం రక్షించబడ్డాం :-)

    ReplyDelete
  15. my full support to you didi :)

    ReplyDelete
  16. మీరు చేస్తున్న పని కరెక్ట్

    ReplyDelete
  17. ఇప్పటికి ఆల్రెడీ చితగొట్టేసి ఉంటారు నేను సై అన్నా ప్రయోజనం శూన్యం. ఆలస్యంగా వచ్చాను అందుకే తప్పదులెండి.

    ReplyDelete
  18. ఇనుము పై సమ్మెటపోటు పడవలసిందే :-)

    ReplyDelete
  19. బడితపూజ కరెక్ట్

    ReplyDelete
  20. పద్మార్పిత గారు అణుకువగా ఉన్న ఆడపులి అన్నమాట.... ఫెంటాస్టిక్ లైన్స్ మేడం... pic సూపర్,,,,

    ReplyDelete
  21. ఆ ఏదో అడిగి మా మనసు తెలుసుకుంటారే తప్ప నిజంగా తన్నేస్తారా ఏంటి? మీ మమసు మాకు తెలుసులే.

    ReplyDelete
  22. బాగా చెప్పారు

    ReplyDelete