గుండెల్లో నక్షత్ర కూటమే మువ్వలతో మ్రోగె
నువ్వు మనసుపెట్టి ముచ్చటగా మాట్లాడితే
కనుల ఎదుట కల్పవృక్షమే గజ్జె కట్టి నర్తించె
నువ్వు నిండుపున్నమిలా నాకెదురై నవ్వితే
చంద్రుడిలోని తెలుపే మెరిసి తెల్లబోయి చూసె
నీ స్వఛ్ఛమైన మనసు నాకే ఇచ్చావని చెబితే
నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే
గోధూళి సైతం పరిమళాలని రాయబారం పంపె
నువ్వు నా కంటిపై ముంగురులే తొలగించబోతే
తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే
నువ్వు మనసుపెట్టి ముచ్చటగా మాట్లాడితే
కనుల ఎదుట కల్పవృక్షమే గజ్జె కట్టి నర్తించె
నువ్వు నిండుపున్నమిలా నాకెదురై నవ్వితే
చంద్రుడిలోని తెలుపే మెరిసి తెల్లబోయి చూసె
నీ స్వఛ్ఛమైన మనసు నాకే ఇచ్చావని చెబితే
నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే
గోధూళి సైతం పరిమళాలని రాయబారం పంపె
నువ్వు నా కంటిపై ముంగురులే తొలగించబోతే
తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే
అత్యధ్భుత శృంగార కావ్యం. కుడోస్ టు యు
ReplyDeleteమెచ్చిన మీకు వందనములు
Deleteచాలా బాగుంది మేడం
Deleteగిట్లా రొమాంటిచ్ చిత్రం పెడితే బూతులు రాసినారు అంటారని భయతో చాలామంది రాయనీకి భయపడుతురు. పద్మకు గసోంటి భయాలు ఏం లేవని మరొకపారి రుజువు చేసినవు. నమస్తే తల్లో నీకు.
ReplyDeleteఏముచ్చట ఎట్లున్నా కవిత మస్తుగుంది. ఇక చిత్రం మంచిగ మాచింగ్ :)
బూతులు రాస్తే బుగుల్ కానీ భావం రాయనీకెందుకు :-)
Deleteమాడం మీకు మీరే...అమ్మో ఎంత ధైర్యం కావాలో శృంగార రసాన్ని అందులోను స్త్రీ నిర్భయంగా ఈ భావాలని వ్యక్తపరచాలంటే. అందుకే మీరు మా అభిమాన కవయిత్రి.
ReplyDeleteథ్యాంక్యూ... ఇక్కడ నేను రాసింది అసభ్యకరమైన శృగారం ఏమీ కాదనే ధైర్యంతోనే రాసానండి.
Deleteఅసభయ మనడమే అసభ్యం.
Deleteఅసభ్యయ మనడమే అసభ్యం.
Delete(సవరణ)
మీకు సరస్వతీదేవి కటాక్షంతో పాటు కాళిదాసు మీపై పూనకం వచ్చి వ్రాయించినట్లున్నారు. రసరమ్యకవిత
ReplyDeleteకటాక్షం వరకూ ఓకే మరీ పూనకం అంటేనే :-)
Deleteకవితలో భావం బాగుంది, చిత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది.
ReplyDeleteపోస్ట్ కి ఆప్ట్ గా ఇండాలని ఎంచుకున్నదండి.
Deleteఇబ్బందేమీ లేదు.
Deleteమధురభావాల కుసుమాలు మనసులో పూస్తున్నాయి మీ కవిత చదివి చిత్రం చూస్తుంటే.
ReplyDeleteఆస్వాధించండి
Deleteమేము ఎప్పుడైనా భావాలని రాద్దాం అంటే కనీసం అక్షరాలు కూడా సహకరించవు అదేం విచిత్రమో మీలో భావాలకి అక్షరాలేకాదు అందరితోపాటు సూర్యచంద్రులు, గోధూళి అబ్బో ఇంకా ఇలా ఎన్నెన్నో సహకరిస్తాయి పద్మగారు. అందుకే మీరు వ్రాయకలుగుతున్నారు మేము వ్రాయలేక పోతున్నాము. :)
ReplyDeleteఆకాంక్ష నిజం చెప్పండి మీఎఉ రాయ తలపెట్టాలే కానీ అబ్బో అందరూ మీకు తోడు :-)
Deleteవ్రాయాలని తలపెట్టి పెట్టి తల బ్రద్దలైపోతుంటేను. ఏం వ్రాస్తాము చెప్పండి.
Deleteనక్షత్ర మువ్వలు మ్రోగడం
ReplyDeleteకల్పవృక్షం నర్తించడం
చంద్రుడు తెల్లబోవడం
తంత్రులు రాగాలు పాడడం
ధూళి రాయబారం పంపడం
ఈ ఫాటసీలన్నీ మీ పోయంస్లోనే కనబడతాయండి. అబ్బురం
నిజ జీవితంలో జరగని వాటిని ఫాంటసీగా చూడ్డంలో తప్పులేదండి.
Deleteఅక్షర సత్యం.
Deleteమరికాస్త అలోచించి ఉంటే ఇంతకన్నా అమోఘంగా భావాన్ని మరింత రసాత్మకంగా చెప్పేదానివి అర్పితా. ఈ కవితలో ఏదో కొరవడింది అనిపిస్తుంది. నీ పాత కవితల్లో మంచి రసరమ్య భావాలని చదివిన వ్యక్తిగా ఈ విషయాన్ని చెప్పడానికి సంకోచమే అయినా తప్పడంలేదు. ఆశిస్సులతో-హరినాధ్
ReplyDeleteఅవునేమో. కానీ నిజానికి ఆలోచించే రాసాను. చిత్రం పెట్టే విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగి ఉండవచ్చును. ఇక పై శ్రద్ధ తీసుకుంటానండి.
Deleteమీరు ఏ టాపిక్ అయినా ఫీలుండేలా రాస్తారు.
ReplyDeleteMadam you have lot of guts. Iam fond of your attitude.
థ్యాంక్యూ. Nothing like that Sindhoo :-)
Deleteఅవును
Deleteచాలా రసోత్తర ప్రణయకావ్యం పద్మగారు. బాగుంది
ReplyDeleteమీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteచాలా బాగుంది. చిత్రం చాలా అధ్భుతం.
ReplyDeleteవిశ్వేస్వరరావుగారు అభివందనములు.
Deleteనరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
ReplyDeleteనీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే
sooooooooooo beautiful feel.
thank you very much
Deleteశృంగారానికి శ్రీకారం చుట్టి ఆత్యంతము అలరించిన కవిత. పద్మార్పిరగారి పదాలతో పాటుగా చిత్రం కూడా శృంగారానికి న్యాయం చేకూర్చింది. అభినందనలు.
ReplyDeleteమీకు నా అభివందనములు.
Deleteబహుముఖ ప్రాజ్ఞాత్వం మీ కవితల్లో గోచరిస్తాయి... ఈ కవితలో ప్రేమతత్వాన్ని ఒక ఉచ్ఛస్తాయికి తీసుకెళ్ళి శృంగార భావాలతో ముగింపు పలికారు... చాలా అరుదుగా ఇటువంటి కవితలు పుడతాయి... మీ కవిత్వం లో రమ్యత్వానికి ఇదొక మచ్చుతునక.... మీ కవితల్లో కొద్దిగా విభిన్నత్వాన్ని పునికిపుచ్చుకున్న ఈ కవిత భావకుడికి.... ఒక కాల్పనిక లోకంలో ఒక అధ్బుతాన్ని ఆవిష్కరించబోయే ముందు అలుముకొన్న నిశ్శబ్దంలా .... విచ్చుకోబోయే ముందు మేఘంలా మారి పుప్పొడిని వర్షించే ఆకాశంలా... అలరింతలకు గురిచేస్తోంది మేడం... సూపర్.... చక్కటి భావచిత్రం మీ అభిరుచికి పరాకాష్ట....
ReplyDeleteచిత్రం చూసి ఇది ఒక శృంగార కవిత అని చాలా మంది నిర్ణయానికి వచ్చేస్తే ఎలా ? ఇదో అందమైన ప్రేమ కవిత .కొంతమేర పద్మారిత అభిమానులు సరిగ్గా విశ్లేషించారు . మిగిలినవారు మరొక్కమారు కవితను చదివి చూడండి . ప్రతి అక్షరంలోనూ ఎంత ప్రేమ దాగి ఉందో తెలుస్తుంది . ఆ నాయిక ఎంత గాడంగా అతడిని వలచిందో కనిపిస్తుంది . ముమ్మాటికీ ఇది అత్యన్నత మయిన ప్రేమ భావన , అత్యంత అనురాగంతో చేసుకునే ఆత్మ నివేదన , సర్వస్య సమర్పణ . ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ తప్ప మరోటి లేదు ఇందులో . సృష్టి కార్యం అన్న టైటిల్ , సన్నిహితంగా ఉన్న జంటను చూసి కవిత చదివితే ... అరె , శృంగారోద్దీపన మొహమ్మీద చెళ్ళున కెరటంలా కొట్టలేదు సరి కదా.... లలిత మనోజ్ఞమైన ప్రణయ భావనలు బొగడ పూల పరిమళంలా నాసికా పుటాలకి సోకుతాయి . అందుకేనేమో , కొందరికి ఇందులో ఏదో లోపం ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు . నిజానికి ఏకాంతంలో ఇవే మాటలు అందరూ వారి వారి మనోహరులకు చెప్పినవే కదా ! అవే కొంచెం కవితా ధోరణిలో ఇక్కడ చూస్తున్నాము .
Deleteమీరు చూసిన దృష్టితో చూస్తే అంతా ప్రేమ మయం, కానీ అందరికళ్ళు చూపు ఒకే మాదిరి లేదు గాడేపల్లిగారు. ఎవరు ఏ విధంగా ఊహించుకుంటే వారికి ఆ విధంగా అనిపించడం పద్మార్పిత స్పెషాలిటీ ఇది నిజం :-) హా హా
Delete@ Padmarpita Fans మీ వ్యాఖ్యలకు నా దగ్గర జవాబు లేదు. రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప _/\_
Deleteమీ సునిశిత పరిశీలనకి నాభావాలని ఆస్వాధించడంతో పాటుగా లోతట్టు భావాన్ని వెలికితీసి నన్ను సమర్ధిస్తూ స్పూర్తినిచ్చే మీ వాఖ్యలకు నమోఃవందనాలు గాడేపల్లి వెంకట్ గారు._/\_
Deleteనయనిగారు...ఈ కమెంట్ లో ఏమీ ట్విస్ట్ లేదు కదా :-)
Deleteచిత్రం చూసి ఇది ఒక శృంగార కవిత అని చాలా మంది నిర్ణయానికి వచ్చేస్తే ఎలా ?వెంకట్ గారు...పద్మార్పితగారి చిత్రాలే కాదు మాటలు అంతకన్నా రెచ్చ గొడుతుంటాయి. మరి వీక్ మైండ్ వాళ్ళు అలాగే అనుకుంటారు. మీరు తప్పు పడితే ఎలా :-)
Deleteఆకాంక్షా...మరీ ఇంతటి అభియోగమా అందునా అమాయకురాలి పై :-)
Deleteశృంగార రసాన్ని రమ్యమైన రీతిలో పండించారు. ప్రణయానికి ప్రతిసృష్టిలా ఉంది చిత్రం.
ReplyDeleteధన్యవాదములు
Deleteవలపు శృంగారాన్ని అందంగా సింగారించారు. చిత్రం ఎంపికలో మీకు ధీటైన వారు లేరు. నేను ఈ మధ్య ప్రయత్నిస్తున్నను. కొంచెం లుక్కండి పద్మగారు
ReplyDeleteధన్యవాదములు.
Deleteమీరు పోస్ట్ చేసే ఆర్ట్ పిక్స్ చాలా బాగుంటాయి.
పద్మగారు నాకు ప్రశ్నలు అడగడమే తెలుసు అన్నింటిలో నెగెటీవ్ చూడ్డం అలవాటైనా మీరు వ్రాసే కవితల్లో పాజిటివ్ మాత్రమే కనిపిస్తుంది అందుకేనేమో మీ ఈ సృష్టికార్యంలో అడగడానికి సందేహించడానికి ఏంలేదు.
ReplyDeleteనో డౌట్ ఇది మీ కలం నుండి జాలువారిన మరో అద్భుత ప్రణయకావ్యం.
ప్రశ్నలకి కొదవ ఎక్కడిది నందినీ....మనం వేసిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వక తప్పించుకునే నేర్పరి పద్మార్పిత.
Deleteఅడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లు అడుగుతూ ఉండండి తెలిసీ తెలియని జవాబులు ఇచ్చేస్తానుగా ;-)
Deleteనయనీ నేర్పరి అంటూ మరో నిందనా నా పై. :-)
Deleteనవ్విపోతారు కవితలో శృంగారం, చిత్రంలో నగ్నత్వం ఉందని ఎవరైనా అంటే. అయినా ఎవరి అలోచనా ధోరణి వారిది మనం కాదంటే మాత్రం వారి బుధ్ధి మారేనా. మీరు అనుకున్నది, నచ్చింది రాయండి పద్మగారు.
ReplyDeleteకవితలోని భావం దానికి అనుగుణంగా చిత్రం చాలా బాగున్నాయి.
బాగాచెప్పారు. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటారు అని వదిలేయలేం కదా. థ్యాంక్యూ.
Deleteగోధూళి పరిమళాలని రాయబారం పంపడం చాలా బాగుంది పద్మా.
ReplyDeleteథ్యాంక్యూ సంధ్యగారు..
Deleteమధుర రసభరితం ఈ కవిత పద్మగారు
ReplyDeleteఅబ్బా..గన్ షాట్ కవిత
ReplyDeleteగుండె జివ్వుమంది. పిక్ కిరాకు పుట్టించింది :)
మరో తుపాకీ గుండులాంటి కమెంట్ :-)
Deleteromantic rythm of love.
ReplyDeletethank you Payal
Deleteఏమని పొగిడేది మా పద్మమ్మను
ReplyDeleteరోజుకో కవిత రాసి మురిపిస్తుంటే...
విరహం ప్రేమ వైరాగ్యం వేదాంతం
అన్నీ సమపాళలో కురిపిస్తుంటే...
ఏమని పొగిడేది మా అర్పితమ్మను
నయనిగారూ...రాసేయండి మీలో మరో కవయిత్రి దాగిందండోయ్
Deleteawesome poetry and picture.
ReplyDeletethank you very much.
Deleteబాగుంది మీ ప్రేమాలాపన
ReplyDeleteనా బ్లాగ్ కి స్వాగతం శాంతకుమారీగారు
Deleteరతీదేవినీ.మించిన ప్రచోధిని లా ఉన్నావ్ ..మీ కవిత సూపర్
ReplyDeleteచాలా చక్కని కవిత.. తగిన చిత్రం కూడా.. అభినందనలు మేడం������
ReplyDeleteసృష్టికార్యమైనా శృంగారక్రీడైనా..కామసూత్రకారుడు జన్మించిన భూమి లో ఖజూరాహో శిల్పాల సాక్షిగా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పడం అవసరం.లౌకిక జీవనంలో అది ఒక ఆనందయోగం.అద్భుతమైన ఔషధం.అనవసరమైన వ్యామోహాలతో,ఇతర వ్యాపకాలతో ఈ ఆనందానికి దూరం కాకుండా దంపతులు దీర్ఘకాలం జీవించాలి. మీకు హృదయ పూర్వక అభినందనలు..
ReplyDeleteమీ పద ప్రయోగం అద్భుతం. చాలాబాగుంది. ఎంతో అందముగా గౌరభావంకలిగేటట్టు గా ఉండి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
ReplyDeleteనీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే
తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే
entha chakkani vivarana .prathi okka dhampathula enno theepi gnapakaalu entha baaga vivarinchaaru .srungaaram venuka dhagi vunna pavithratha ee kaalam vaallaki telidhu.