చెప్పకనే చెబుతున్నా...ఎవరికై ఈ అన్వేషణో వారికే ఎరుకేలేదు
నా అనురాగానికి కొలతలు వేయనేలేదు
నా పై తనకున్నది ప్రేమా అని అడిగితే...

నవ్వి అన్నాడు...తనకి అదేమో తెలీదని!
ఏదో అప్పుడు అనుకున్నాను నచ్చావని
ఇప్పుడు నే తప్ప తనకేదీ నచ్చడంలేదని
నన్ను తలవనిదే ఊపిరి ఉక్కిరిబిక్కిరని
శ్వాసతోనే జీవితమా లేక నీతోటేనా అని!!

తెలీదంటూనే తాను సర్వం నేనని చెబితే...
నేను అన్నీ చెప్పానంటూనే ఏం చెప్పలేదు
ప్రేమంటూ పెదవులతో పలికితేనే సరిపోదు.

23 comments:

 1. చెప్పకనే మీ కళ్ళతో అంతా అడిగి చెప్పించుకున్నారు..ఇంకేం ఉందని చెప్పడానికి చెప్పక పోవడానికి :-) pic is too good.

  ReplyDelete
 2. అలవోకతో చెప్పిన ప్రణయకవిత

  ReplyDelete
 3. అవును.ప్రేమంటే పెదవులతో పలికితేనే సరిపోదు..చదవడానికి సాధరణ కవితలా ఉన్నా...లోతైన అర్థం దాగి ఉంది మీ కవితాఝరిలో.. మంచి ప్రయత్నం

  ReplyDelete
 4. మరో అందమైన ప్రేమవిలాపం

  ReplyDelete
 5. పుష్కర స్నానం చేసిండ్రా పుణ్యంతో ప్రేమ మస్తుగొస్తాది ;)

  ReplyDelete
 6. అంతలేసి కళ్ళేసుకుని ప్రేమ ఉందా అంటే తెలియదు అంటూనే అంతలా చెప్పాడంటే యమప్రేమికుడేనండి :-)

  ReplyDelete
 7. తలనెరసిపోయి,జుట్టు ఊడిపోయి, కళ్ళు తేలిపోయిన లేత కోమలాంగి ఎవరికై నిరీక్షణో,అనురాగానికి కొలతలేమిటో తనకైనా తెలుసా ? జీవిత చరమాంకంలో కూడా నోరువిప్పి చెప్పదా ? అసలు మీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి ? మీ కవితలు బోర్ కొట్టేసాయి, ఒక మంచి ప్రేమ కధ చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. కవితలు బోర్ కొట్టాయి అంటున్నారు ఇంక కధలు ఏం వింటారు? అందులోనూ ప్రేమ కధలు బోర్ బోర్ బోర్ :)

   Delete
 8. అతడు చెప్పింది అక్షరాల నిజం. నిజమైన ప్రేమ అతడిది

  ReplyDelete
 9. ప్రేమ ఎప్పుడూ అందాన్ని అహ్లాదాన్ని ఇస్తుంది అందులో వేదనైనా మురిపిస్తుంది. ప్రేమని ఆస్వాధించలేని వారు తమని తాము ప్రేమించికోలేరు. మీకున్న ప్రేమభావాలని ఎవరికో నచ్చవని మార్చుకోవలసిన అవసరంలేదు. మీరు రాస్తూండండి మేము చదివేస్తూ ఉంటాము పద్మగారు.

  ReplyDelete
 10. Direct ga cheparu artham avaka chastunda :)

  ReplyDelete
 11. మరోసారి ప్రేమని కమనీయంగా వెల్లడించారు అన్నమాట. proceed :-)

  ReplyDelete
 12. ఇద్దరిదీ ప్రేమే చెప్పిన దారులే వేరు

  ReplyDelete
 13. ప్రేమకి అతడు ఇచ్చిన నిర్వచనం బాగుంది.

  ReplyDelete
 14. నన్ను తలవనిదే ఊపిరి ఉక్కిరిబిక్కిరని
  శ్వాసతోనే జీవితమా లేక నీతోటేనా అని!!
  Heart Touching Poem.

  ReplyDelete

 15. నీహారిక గారికి స్వాగతం సుస్వాగతం పద్మార్పిత బ్లాగు ఇక పద నిసలు బ్లాగు అగ్రిగేటర్ లో ఝుంఝా మారుతమై వెలయు ననియు , సరి క్రొత్త ప్రేమ కథ - శ్రీ రామ శూర్పణఖోపాఖ్యానం పద్మార్పిత గారు వ్రాస్తారనిన్నూ ఆశిస్తో - నారదాయ నమః

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఓస్లా కూస్లా కుర్యే కుట్టా హ్టా.

   Delete
  2. "శూర్పణఖోపాఖ్యానం" మాంచి టాపిక్. ఆలస్యమేల వ్రాసేయ్ పద్మార్పిత :)

   Delete
 16. అలా అన్న గుంటడు ఎవరో..యమ తెలివైనోడే :)

  ReplyDelete
 17. అభిమానిస్తున్న అందరికీ అభివందనాలు.

  ReplyDelete
 18. ఇంత అందమైన కళ్ళతో ఇలా అలరించే కవితతో అడిగితే ఇంకేస్తారండీ పాపం.... చిత్రం , కవిత చక్కగా ఉన్నాయి..

  ReplyDelete