కొత్త పుష్పం



నాలో నీకై దాచిన అనురాగమే సుగంధాలై
విన్నవించని వలపుని అష్టోత్తరమాల పేని
అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!

నాకు నీవు నీకు నేనన్ననమ్మికే నైవేద్యమై
రెండొత్తులు ఏకమై జ్యోతిలా వెలిగిపోవాలని
పసుపు కుంకుమార్చనలే విడి విడిగా చేస్తే
మంగళప్రదమే కాదని మనసుకే మసిపూసె!

నాది నేనన్న అహంకారమే కాలిన అగరొత్తులై
గుండెలో మ్రోగవలసిన గుడిగంటలే కీచుమని
నా హావభావాలని హారతి కర్పూరంలా హరిస్తే
సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె!

నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే హోమమై
తెలిసీతెలియని పూజాపునస్కారాలు ఏలనని
మర్మంలేని మనసే మంచిని మకుటంగా ఇస్తే
కవితల కొలనులో మరోకొత్త పద్మం విరబూసె!

26 comments:

  1. మా మనసులకి మరో ఆహ్లాదం కనికట్టు చేసె ! అద్భుతః పద్మార్పిత గారు

    ReplyDelete
  2. కవితాభిమానులకు మీరు అందించిన మరో క్రొత్త పరిమళం

    ReplyDelete
  3. మీ అక్షరసంపదకు నా సలాం
    కొత్తగా విరియడం ఏమిటి రోజుకో కొత్త పరిమళాన్ని ఆస్వాధిస్తూనే ఉన్నాం. త్యాంక్యు

    ReplyDelete
  4. Extraordinary Poetry
    &
    Excellent Painting Mam

    ReplyDelete
  5. ప్రేమ పుష్పం

    ReplyDelete
  6. నా హావభావాలని హారతి కర్పూరంలా హరిస్తే
    సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె
    భావం కవితలో బాగా పండింది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. '' నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె
      మంగళప్రదమే కాదని మనసుకే మసిపూసె
      సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె ''
      ఎంత బాగా రాశారండీ ! !

      Delete
  7. మీ పద ప్రవాహానికి మాటలులేవు
    చిత్రం అతిసుందరం....

    ReplyDelete
  8. పుజాసామాగ్రిని అక్షరాలతో అభిషేకం చేసారు. కుడోస్

    ReplyDelete
  9. పద్మార్పిత చాలదా...మరో పద్మం ఎందుకు?

    ReplyDelete
  10. పుష్పాన్ని పువ్వుతో ఏం కొట్టేది అని తూటాలంటి కవితల్తో కొట్టారా :) :) :) :) :) :) :)

    ReplyDelete
  11. మాటలకి, వాక్యాలకి అందని భావాలోచనలు మీ కవితలు. వాటికి తగిన రంగున్ రంగుల చిత్రపటాలు. అధ్బుతః

    ReplyDelete
  12. చిత్రంలోని వయ్యారమే చూడనా
    పద్మాక్షరాల్లోని విన్యాసమే కాననా
    పతిపదంలో నీ ప్రతిభ కనబరిచావు. అభినందనలు.

    ReplyDelete
  13. సుపరో సూపర్ అంతే ఇంకేం లేదు.

    ReplyDelete
  14. పూజాసామాగ్రితో ప్రేమపలుకులు ఏంటి పద్మా?

    ReplyDelete
  15. అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
    నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!excellent

    ReplyDelete
  16. asalu how you will get this thoughts. marvelous mam.

    ReplyDelete
  17. పన్నీరుకి నాచుపట్టడం, సహనమే సాంబ్రాణి ధూపం అవ్వడం, ఆత్మ విశ్వాసమే హోమంగా మారడం...నీ ఊహాశక్తి జోహారులు పద్మార్పితా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లీ-హరినాధ్

    ReplyDelete
  18. గిట్ల రాస్తరనే నేను ఫిదా అయ్యినా :-)

    ReplyDelete
  19. మరో అందమైన ప్రేమకావ్యం. చిత్రం బహుసుందరం

    ReplyDelete
  20. మరో కొత్త పదపుష్ప ప్రయోగం బాగుంది పద్మార్పిత

    ReplyDelete
  21. పూజలు చేయ పూలు తెచ్చాను అనే పాట విన్నాం
    అక్షరాలని పుష్పాలు చేసి రాసిన మీ కవితల్ని చదువుతున్నాం. శభాషో శభాష్

    ReplyDelete
  22. ఆదరిస్తున్న అందరి అభిమానానికి శతకోటి వందనాలు_/\_


    ReplyDelete
  23. క్రొత్తరకం పుష్పవిలాపమా పద్మగారు

    ReplyDelete
  24. అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
    నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!పరిమళభరితమైన పన్నీరుకే నాచు పట్టిందన్న ఆ పాపాత్ముడికి పుట్టగతులు ఉండవండి. పుష్కర స్నానం అంటూ పుణ్యం కోసం ములిగి తేలుతున్న పాకుడు నీళ్ళలో కాదా ఏంటి. మనసు మలినం పెట్టుకుని పుణ్యం పురుషార్థం అంటూ ఈ పూజలు పుష్కర స్నానాలు ఎందుకో.
    మీ కవితాపటిమ నానాటికి అందనంత ఎత్తుకి ఎదిగిపోతుందండి. చిత్రం అత్యద్భుతం

    ReplyDelete
  25. సుందరరసైక భాక్తికభాష్పం
    మీ ప్రేమకవితా కొత్తపుష్పం

    సుమధుర సుమ ధూపం
    దేదీప్యమాన మీ భావపద్మం

    Congrats Madam for Wonderful conceptual poem

    ReplyDelete