అబ్దుల్ కలాం..మీకు..అందరి సలాం

అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు.
ఐశ్య్వర్య వంతుడు అంత కన్నా కాదు...
అఖండ భారతాన్న దుర్భినితో వెతికినా
ఒక్క శత్రువు అయినా కానరాడు.
ఏమిటయ్య నీ గొప్పతనం.....మేరు చిన్నబోయె
మాకు తెలిసిన అతిలోకసుందరాగుడవు నీవు!
సిపాయి కాదు, కత్తి పట్టనూలేదు.
క్షాత్రం కనుచూపు మేరలో కానరాదు...
రాముడు కాదు రహీము కాదు...
విల్లంబులెత్తిన అర్జునుడు కాదు...
సారథి కృష్ణుడూ కాదు...శౌర్యం మాటే లేదు
అయిననూ శత్రుదేశాన్ని బయపెట్టని క్షణంలేదు!
ఓడిపోయి ఆగింది లేదు, విజయ గర్వం లేదు.
అసలు అలిసిన ఛాయలేవీ నీలో లేనేలేవు...
కూడ బెట్టింది ఏంలేదు...కలి అంటింది లేదు.
పదవీగర్వం లేదు...పురస్కార వాంఛ పుట్టుకతోలేదు.
ఉన్న ఆస్తి అంతా కూడా లక్ష్యసాధనే.
మాకు తెలిసిన మహోన్నత వ్యక్తివి నీవు!
అంపశయ్య లేదు... ఆసుపత్రి సూది మందులేదు.
జుట్టు చెదరలేదు....నీ మోము పై నవ్వు ఆగలేదు.
భవబంధాలు లేవు...బయపడింది లేదు.
ఎక్కడమ్మా ఓ మృత్యుమాత...నువ్వు గెలిచింది.
ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు...
మాకు తెలిసిందింతే...మేమంతా ప్రేమించే మహాత్ముడవు!

(ఈరోజు అబ్దుల్ కలాంగారికి ఆశ్రుతనివాళులు అర్పిస్తూ...పోస్ట్ రాయకూడదు అనుకున్నాను. భూలోకంలో నాకు తెలిసిన మాహాత్ముని గురించి నాలుగు అక్షరాలు రాయని నా కలం వ్యర్థం అనిపించి ఇలా మీ అందరితో-పద్మార్పిత)

31 comments:

  1. He is visible GOD. RIP

    ReplyDelete
  2. Adbhutham gaa raaasaru :) abhinandanalu

    ReplyDelete
  3. కలాం సారూ మీకు సలాం

    ReplyDelete
  4. మీకు శ్రద్ధాంజలి అబ్దుల్ కలాం సార్.
    పద్మా బాగుంది వ్రాసింది.

    ReplyDelete
  5. Chaala baaga chepparu..andari manasulo vunde bhaavalaku akshara roopam icchinanduku dhanyavaadalu..

    ReplyDelete
  6. Anonymous29 July, 2015

    Well said.

    ReplyDelete
  7. great tribute to Sri Abdul Kalam.

    ReplyDelete
  8. Rip. excellent lyrics.

    ReplyDelete
  9. అంత గొప్ప వ్యక్తికి చాలా బాగా నివాళి ఇచ్చారు ..రాధిక (నాని)

    ReplyDelete
  10. గొప్ప వ్యక్తికి గుప్పెడు మనసుతో అందించిన నీరాజనాలు. వెల్ డన్ పద్మా

    ReplyDelete
  11. మీ కలానికి నిజమైన సార్థకత కలాంగారికి అర్పించిన ఆశ్రుతనివాళులు. ధన్యురాలివి.

    ReplyDelete
  12. నిజమైన నిండు నివాళులు.

    ReplyDelete
    Replies
    1. అక్షరం అక్షరానికో నెనరు
      పదము పదముకో నెనరు
      భావానికో నెనరు
      సుధా మధుర హృదయ
      కవితాలయ దేవతకు
      వంద వేల నెనర్లు

      Delete
  13. కలాంగారికి శతకోటి ప్రణామాలు _/\_

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. ఫేస్ బుక్ లో ఒక స్నేహితుడు షేర్ చేసి, 'వేరేవాళ్ళు రాసినదాన్ని బాగుందని కాపీ చేశా.' అని పోస్ట్ చేశాడు. నేను కూడా చదివి 'అబ్బ! ఎవరోగాని బాగా రాశారు' అనుకున్నా. ఆ చివరి రెండు లైన్లు...
    '' భవబంధాలు లేవు...బయపడింది లేదు.
    ఎక్కడమ్మా ఓ మృత్యుమాత...నువ్వు గెలిచింది.
    ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు...''

    వీటిని చదివాకైనా ఇది రాసింది పద్మార్పిత అని గుర్తుపట్టలేకపోయాను చూడండి. అలవాటుగా మీ బ్లాగులో షికారుకని వస్తే ఇదిగో ఇక్కడ చూసి ''అప్పుడే అనుకున్నా... '' అని నాకు నేను మార్కులిచ్చుకున్నా.

    ఒక్కటి పద్మ గారూ! 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అనుకోమన్నాడు ఆత్రేయ. ఎందుకంటే ఎంత చెడ్దోడు అనుకున్నా, పోయాక ఏం చేయలేం కాబట్టి. కానీ ఈ కలాంగారు నిజంగానే మంచోడు. అందుకే ఇంతమంది ఇంతగా ఉద్వేగానికి గురయ్యారు.

    ReplyDelete
  16. చదివిన కొన్ని నిముషాలు నిశ్శబ్దం, ఆ తరువాత అనుకోకుందానే కొన్ని కన్నిటిబొట్లు రాలేలా చేసింది కవితలోని చివరి నాలుగులైన్లు. మీ అక్షరాలకు అభినందనలు. అబ్దుల్ కలాంగారికి అంతిమ వీడ్కోలు.

    ReplyDelete
  17. నిజమైన నివాళులు అందించారు అక్షరాలతో అభిషేకించి అర్పితగారు.

    ReplyDelete
  18. కవితతో కన్నీరు పెట్టించావు తల్లీ, జాతి మహాత్ముడికి నివాళి-హరినాధ్

    ReplyDelete
  19. అధ్భుతంగా రాశారు

    ReplyDelete
  20. ఆత్యంతము అలరించారు పద్మగారు

    ReplyDelete
  21. అబ్దుల్ కలాం గారికి సలాం
    అర్పిత వ్రాతలకు గులాం
    అనేంత అధ్భుతంగా వ్రాసారు

    ReplyDelete
  22. అలవాటు కొద్దీ రాసే పిచ్చి కవితల కన్నా వెయ్యి రెట్లు బాగుంది!
    అలవాటు లేకపోయినా కలాం గారికి కొట్టిన సలాం కదా,బాగుంది!

    ReplyDelete
  23. చాలా బాగావ్రాశారు

    ReplyDelete