వద్దంటూనే...


నీవు ఆ దారిన వెళుతుంటే ఈ దరిన...
అసంకల్పితంగా నా తనువే పులకించెనే!

నా చూపులే గుచ్చునని తాళం వేసినా
నీ కదలికలతోనే చూపుల తాళం ఊడెనే!

సంధ్యవేళ గడిచి రేయి మిగిలిపోయినా
నిర్మలమది లోగుట్టునే దోషని నిలదీసెనే!

బుడగవంటి ఆవేశం నిన్ను చూడననినా
నీ ధ్యాస పరిమళ తాకిడికే అది పగిలెనే!

కోడికూయగానే ఎర్రబడిన కళ్ళు విచ్చినా
వెలుగుతున్న జ్ఞాపకం కనులని మూసెనే!

29 comments:

 1. ఎంకెన్ని నిదురలేని రాత్రులు గడపవలెనో :)

  ReplyDelete
 2. అందమైన ప్రేమ భావాన్ని అలవోకగా అందించారు

  ReplyDelete
 3. కోడికూయగానే ఎర్రబడిన కళ్ళు విచ్చినా
  వెలుగుతున్న జ్ఞాపకం కనులని మూసెనే! లోతట్టుభావం

  ReplyDelete
 4. కోడికూయగానే ఎర్రబడిన కళ్ళు విచ్చినా
  వెలుగుతున్న జ్ఞాపకం కనులని మూసెనే! ఎంతటి ఆహ్లాదకరమైన సన్నివేశమో

  ReplyDelete
 5. కోడికూయగానే ఎర్రబడిన కళ్ళు విచ్చినా
  వెలుగుతున్న జ్ఞాపకం కనులని మూసెనే! ఎంతటి ఆహ్లాదకరమైన సన్నివేశమో

  ReplyDelete
 6. అనుభూతికి అందని అనురాగం

  ReplyDelete
 7. తలువు పులకరిస్తే మనసుపులకరించె
  మీ కవిత చదివి మా తనువూ పరవశించె
  కవితకి తగిన చిత్రాన్ని కనులు ఆస్వాధించె

  ReplyDelete
 8. Beautiful poem.
  Well expressed.
  Happy friendship day Padma

  ReplyDelete
 9. ఎంత అందంగా వర్ణించారు.. చాలా బాగుంది పద్మాజీ.. ఇది మీకే సొంతమైన శైలి..

  ReplyDelete
 10. నీ కలం కదులుతుంటే, నా పదం పరుగులు తీస్తుంది
  నీ అక్షరం పలకరిస్తుంటే, నా మనసు వీణ పలుకుతుంది
  రేయిలో పున్నమిలా నీ కవిత, ఇంధ్రధనుసులా వర్ణాలల్లింది
  నీ కవిత చదవని ఇన్ని రోజులు, మనసు స్పందించలేదు ఊసులు
  కడలి కన్నీటి కెరటాలు, నీ కవన సాగరంలో కలువలు............
  ఇన్ని నెలలు మీ కవితలు చూడలేదు, స్పందించలేదు. అందుకే అక్షరాలతో మీరు రాసి కవితకు... ఒక్కో అక్షరానికి మరో అక్షరంతో బదులివ్వాలని... ఇలా....

  ReplyDelete
  Replies
  1. ఏంటి సతీష్ సారువారూ ఎన్నాచ్చి??????
   ఉండి ఉండి విచిత్రంగా మాయమైపోతావుండారు????
   ఎల్లారు సౌఖ్యమేనా????

   Delete
  2. చాన్నాళ్ళకి సతీష్ గారూ. అంతా క్షేమమే కదా!?

   Delete
 11. నీవు ఆ దరిన టపా వ్రాసేస్తూ ఉంటె ,
  అసంకల్పితంగా నా కా మింటు లే కెలికేనే :)

  జిలేబి

  ReplyDelete
 12. బుడగవంటి ఆవేశం నిన్ను చూడననినా
  నీ ధ్యాస పరిమళ తాకిడికే అది పగిలెనే!భావం బహుబాగుంది

  ReplyDelete
 13. నీ కదలికలతోనే చూపుల తాళం ఊడెనే..సున్నిత భావం

  ReplyDelete
 14. ఆహ్లాదకర కవిత

  ReplyDelete
 15. అద్భుతంగా చెప్పారు. మీ కవితలే నాకు ఇన్స్ఫిరేషన్

  ReplyDelete
 16. పిచ్చపిచ్చగా నచ్చేసింది పద్మా :)

  ReplyDelete
 17. అద్భుతం మీ అనురాగం , అందమైన ప్రేమ భావంతో మనసుపులకరించె , ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతున్నది పద్మాజీ

  ReplyDelete
 18. అనురాగాన్ని అధ్భుతంగా చెప్పారు.

  ReplyDelete
 19. వద్దంటే షూట్ ఎట్ సైట్ అంతే :)

  ReplyDelete
 20. మధురవాన జల్లులా

  ReplyDelete
 21. ఆస్వాధించి అభిమానిస్తున్న అందరికీ అభివందనాలు.

  ReplyDelete
 22. మరో మధురభావాల పదమాల పసందుగా ఉంది పద్మ-హరినాధ్

  ReplyDelete
 23. అవకాశం ఉన్నప్పుడైనా విడి విడిగా రిప్లైస్ ఇవ్వండి పద్మగారు

  ReplyDelete
 24. ఇలాంటి కవితలు చువుతుంటే, ఒక స్త్రీ హృదయం తాలూకు భావాలు ఆమె తలపుల్లో ఉన్న వ్యక్తిని ఎంతో ఉన్నత స్తాయికి చేరుస్తాయని అనుకోవడం బహుశ పరిపాటే కాని ఆమె ఔన్నత్యాన్ని మరింత శోభించేట్లుగా ఈ పరిపుష్టమైన కవిత్వం కళ్ళముందు కదలాడుతోంది.
  శాతవాహనుల కాలంలో లిఖించబడ్డ ‘గాధాసప్తశతి’ అనే 700 కవితల కావ్యం అచ్చం ఇలాంటి కవితలతో నిండిన అనేకమంది అజ్ఞాత రచయిత్రుల ప్రేమోద్భవసంద్రం... కానీ ఇక్కడ మీరొక్కరే ఇలా వందల కవితల్లో వేవేల భావాలు పలికించడం, అవికూడా మా హృదయాలను కట్టిపడేయడం ... కించిత్ గర్వంగా ఉంది మీ ఫ్యాన్ అయినందుకు....
  హ్యాట్సాఫ్... టు యు మేడం...

  ReplyDelete