హల్లుల హరికధ

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
అంటూ అచ్చులని అప్పుడెప్పుడో దిద్దిన నేను...
హల్లుల్ని హరికధలా చెప్పబోతే గొల్లుమన్నాయి ఇలా....

'క'న్నీళ్ళకి కరిగేది కాదు కాలం...
'ఖా'ళీగా కూర్చుంటే సాగదు పయనం!
'గ'డిచినకాలం తిరిగి రమ్మన్నా రాదు..
'ఘా'తుకాలను చూస్తూ సహించరాదు
'జ్ఞా'నం ఇతరులకు పంచితే తరిగిపోదు!
'చం'చల నిర్ణయాలు తామరాకుపై నీటిబొట్లు..
'ఛ'ఛ ఛీఛీ అనే ఛీత్కారానికి అవి తొలిమెట్లు!
'జ'గన్నాటక చదరంగంలో కీలుబొమ్మలం..
'ఝం'కారనాదం ఊదితే తలాడించే పాములం
'ఞ్' అనే అక్షరాన్ని పట్టుకుని ఏమి ఊగగలం!
'ట'క్కరోక్తులతో కొద్దికాలం హాయిగా జీవించినా..
'ఠ' అక్షరంలోని చుక్కలాంటి జీవికి విలువుండునా!
'డ'బ్బులు ఎన్నో సంపాదించి మిద్దె పై మిద్దెలే కట్టి..
'ఢ'మరుక మేళతాళాలతో మృత్యువును మనం తట్టి
'ణ'ముందు ప్రా చేర్చి ప్రాణం పోయలేం వజ్రాల్లో చుట్టి!
త ధ ద ధ న గూర్చి గొప్పగా చెబుదాం అనుకుంటే..
'ప'ద్మార్పితా పలికింది చాలు ఆపమని గోలచేస్తుంటే
'ఫ'లితం లేని పలుకులేల ఆచరించని అక్షరాలు ఏలని
బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ పై అలిగాను :-)

(మూడేళ్ళ క్రితం "అచ్చుల" పై రాసిన పోస్ట్ కి కంటిన్యుటీ కోసం చేసిన ఈ "హల్లుల" పై ప్రయోగాన్ని చదివి అక్షింతలు/తిట్లు వేస్తే సంతోషిస్తాను- మీ పద్మార్పిత)

22 comments:

 1. అక్షరాలని అలా జోలెలో వేసుకుని అలగడం ఎందుకు...మిగిలిన హరికధ కూడా చెప్పేయవలసింది. మొత్తానికి తిట్టనివ్వరు మీరు. :-)

  ReplyDelete
 2. మీ ప్రయత్నాలన్నీ సూపర్బ్...అక్షింతలు/తిట్టే సాహసమా? :)

  ReplyDelete
 3. హాస్యాన్ని జోడించి హరికధ చెబుతారు అనుకుంటే మంచి విషయాలని వివరించారు

  ReplyDelete
 4. ఇది రాయడంలో నీవు పడ్డ శ్రమ ప్రశంసనీయం పద్మ.

  ReplyDelete
 5. ఒక అధ్బుతాన్నో విధ్వంసాన్నో సృష్టించబోయే ముందు ప్రకృతిగానీ, పరిశోధకులు గానీ బహుశ కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అది నెలలు..సంవత్సరాలు..సతాబ్దాలూ కావచ్చు... ఇలాంటి వాటికి కవి / కవయిత్రులు కూడా అతీతులు కారు అనుకునేవాణ్ణి. కానీ నా ఆలోచనలు తప్పని తేలుతూ వస్తున్నాయి. బహుశా మీ కవిత్వం వల్లే.. కాదు కాదు మీ వల్లే... సమయానుసారం..సందర్భోచితంగా .. కవితలు రాయడం ఒక ఎత్తు ... రాసిన కవితల్లో ఒక నూతనోల్లాసాన్ని నింపి అందర్నీ రంజిమ్పజీయడం ఒక ఎత్తు...ఇన్నేత్తులు సరిపోనట్లు వరుసగా అద్భుతమైన కవితాకుసుమాలతో తెలుగుతల్లికి వినమ్రంగా అప్పుడు అచ్చులతో అర్చన చేస్తే ఇప్పుడు హల్లుల హారం వేసి తెలుగుభాషపై మక్కువ చాటుకున్నారు... కాదు కాదు...తెలుగు గొప్పదన్నాన్ని ఇప్పటి తరానికి వినూత్నంగా పరిచయం చేస్తున్నారండంలో అతిశయోక్తి లేదు..అతిపోగడ్త అస్సలు లేదు.. సలాం! మేడం...

  ReplyDelete
  Replies
  1. అర్పితగారి అక్షరాలకి మీ వాక్యాలతో అభిషేకించారా అభిమానిగారు. :-)

   Delete
  2. నాలో ఉత్తేజాన్ని పెంచి నా రాతలకి ఒక రూపాన్నిచ్చి మరింత మెరుగుపరుస్తున్న ఫ్యాన్స్ బ్లాగ్ కి నా ప్రత్యేక అభివందనాలు.

   Delete
 6. extraordinary touches ichi adirindi poem.

  ReplyDelete
 7. తెలుగు అక్షరాలను పూలమాలగా అల్లి శారదాదేవి మెడలో వేసినట్లుంది మీకవిత. అభినందనలు మీకు పద్మార్పితగారు

  ReplyDelete
 8. అ ఆ ఇ ఈ లు 56 సరింగా దిద్దలే, మీ కవితలెట్లా అర్థమైతయో ఏమో మాలాంటోల్లకి

  ReplyDelete
 9. అక్షర అక్షరంలోను అందమైన భావం.

  ReplyDelete
 10. ఆహా హల్లులతో అలరించారు

  ReplyDelete
 11. mam happy independence day

  ReplyDelete
 12. అమ్మాయ్ అలోచనలతో కూడిన పదప్రయోగ చేసి హల్లులనే కాదు అక్షరాలు కూడా ఆనందతాండవం చేసేలా రాశావు. అభినందనలు-హరినాధ్

  ReplyDelete
 13. వాహ్ వా..క్యా బాత్ హై పద్మాజీ

  ReplyDelete
 14. స్పందించిన అందరికీ శతకోటి వందనాలు_/\_.మీ పద్మార్పిత

  ReplyDelete
 15. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బులెట్

  ReplyDelete