వ్రాయాలని కదం త్రొక్కితే పదం నేనౌతా
పదాలతో పాదమై నీ ప్రక్కనే నేనుంటా!
వేదనలే వ్రాయబోతే సాహిత్యం నేనౌతా
కధలు అల్లబోతే కాల్పనికల్లో నేనుంటా!
క్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా
క్షణికంలో కావ్యమై నీ కలంలో నేనుంటా!
ప్రేమాక్షరాలే వల్లించు ప్రతీవర్ణనా నేనౌతా
వశీకరించిన గజల్ అయి నీ ముందుంటా!
కొన్నిగంటలు నాతో గడిపితే నేను నీవౌతా
తెలుగు నిఘంటువునై నీలోనే నేనుంటా!!
పదాలతో పాదమై నీ ప్రక్కనే నేనుంటా!
వేదనలే వ్రాయబోతే సాహిత్యం నేనౌతా
కధలు అల్లబోతే కాల్పనికల్లో నేనుంటా!
క్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా
క్షణికంలో కావ్యమై నీ కలంలో నేనుంటా!
ప్రేమాక్షరాలే వల్లించు ప్రతీవర్ణనా నేనౌతా
వశీకరించిన గజల్ అయి నీ ముందుంటా!
కొన్నిగంటలు నాతో గడిపితే నేను నీవౌతా
తెలుగు నిఘంటువునై నీలోనే నేనుంటా!!
అమ్మో! ఇదేదో తెలుగు భాషా పండితుల ప్రేమ యవ్వారం లావుంది
ReplyDeleteసరస్వతీ మానసపుత్రికకు తెలుగుతల్లి దీవెనలు.
ReplyDeleteతెలుగుభాషా దినోత్సవ శుబాకాంక్షలు
తెలుగు నిఘటువుగా మారతారా, ఎంతో అద్భుతమైన భావాన్ని కలిగించారు.
ReplyDeleteమీకు ఇంకా తెలుగు తల్లికి అభివందనములు.
ReplyDeletemeru annee vishayalu sunnitamga cheppi meppistaru. great mam
ReplyDeleteపద్మా అక్షరాలతో సహా అన్నీ నువ్వు అవుతానన్న భావన చాలా బాగుంది, చిత్రం ఎంతగా నచ్చింది అంటే మొదటిసారి ప్రొఫైల్ పిక్ మార్చేంత.
ReplyDeletebavundi bhavam & bomma
ReplyDeleteకూర్పులో కమ్మదనం ఉంది
ReplyDeleteచిత్రం కుందనపు బొమ్మల ఉంది
so sweet encouraging words.
ReplyDeleteతెలుగుదనానికి అర్థం చెప్పి, నిఘంటువి అందాన్ని చేకూర్చినట్లుంది
ReplyDeleteఈ నిఘంటువులో తెలియని విషయాలకి అర్థాలు ఎన్నో.
ReplyDeleteవశీకరించిన గజల్ అయి నీ ముందుంటా wah beautiful
ReplyDeleteపద్మ గారే చాలా మంచోళ్ళు , మరి ఆవిడని తన చేతిలో చందమామగా , కంటిపాపలో మెరుపుగా , గుండెల్లో దాచుకున్న చెలియగా చేసుకున్న అతనెంత మంచోడో కదా ! అందుకేనేమో వినోద్ గారు అన్నట్టుగా ఈ కవితలో ఇన్నిన్ని భావాలు ?
Deleteమీ మనసులాగే మీ కవిత బాగుంది.
ReplyDeleteక్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా..నిజమాండి!
ReplyDeleteపదాల్లో కవిత్వం ఉట్టిపడేలా ... తెలుగుదనంతో కట్టిపడేశారు మాడం... అద్భుతం!
ReplyDelete