తెల్లారిన తెలివి


నా అవగాహనే ఏదో అంతంత మాత్రం
మనఃస్థితినిబట్టి అదీ మారుతుంటుంది
ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది!



నిన్ను నీవు నిజాయితీగా ప్రశ్నించుకో
సమాధానం నీలోనే దాగుంటుంది అంది
మనఃసాక్షికి జవాబు చెప్పడం కష్టమని
ఎవరికి వారే శోధించి సాధించాలంటుంది!



చెప్పమంటూ ఒత్తిడిచేసి ప్రశ్నిస్తే మాత్రం
మూతిముడిచి అలిగి దూరమైపోతుంది
బ్రతిమిలాడి బుజ్జగించితే చెబుతానంటూ
తానుచెప్పే సత్యాలు నేనొల్లను అంటుంది!



తెలియని ప్రక్రియని ధ్యానంతో సాధించుకో
తెలిసిన తరువాత సరిదిద్దుకోమని చెప్పింది
అంతర్గత సంఘర్షణల పై పట్టు విడువబోకని
పరిష్కరించలేని సమస్య సమస్యే కాదనంది!

26 comments:

  1. సంఘర్షణల వలయమే కదా జీవితం. ఆటుపోట్లు తప్పవు

    ReplyDelete
  2. ఓహో..అంతరంగాన్ని ఆవిష్కరించారన్నమాట. బాగుంది

    ReplyDelete
  3. అంతర్గత సంఘర్షణల పై పట్టు విడువబోకని
    పరిష్కరించలేని సమస్య సమస్యే కాదనంది!
    అవును సమస్యలు వస్తేనే ఆలోచించి పరిష్కరించుకోగలం

    ReplyDelete
  4. మీకే అవగాహన అంతంతమాత్రం అంటే మాబోటి వాళ్ళ మాటేమిటి మేడం :-)

    ReplyDelete
  5. మీకే అవగాహన అంతంతమాత్రం అంటే నిమ్మిత్తమాత్రులం ఏమి చెప్పాలో అర్ధం కాకున్నది
    ఆలోచన తీరుబట్టి మారుతూ వుంటుంది మనస్తత్వం కాని మారనిది మనిషిలోని మానవత్వం
    అలకలకి మౌనమే సమాధానం చెప్పినా మాటలకందని సంతోషమే ఎదురునిలిచేకదా పద్మగారు
    గింతే ఎరికైనాది నాకు ఇగ సమజైతలే నాల్గు పంక్తి కవిత ఇది ఎట్లుందో ఏమో ఆకాంక్ష గారికే తెలియాలి

    ReplyDelete
    Replies
    1. అన్నీ తెలిసి సమజైంది ఇంతే అని నన్ను ఇన్వాల్ చేసి న్యాయం చెప్పమంటే మీకు రెండు పిల్లులు కోతి కధని చెప్పనా శ్రీధర్ గారు :-)

      Delete
    2. ఆ కోతి పిల్లుల కథ తెలిసిందే కదా న్యాయాన్యాయాలకు నిదర్శనం, ఇంతకు కోతి ఎవరో పిల్లులు ఎవరో సెలవివ్వ లేదు పోనీలెండి అవి కూడా మీరు నాలుగేసి లైన్స్ గా కవిత రాయగలరేమో నాకు అంతే తెలుసు మరి .

      Delete
  6. కనీసం మీ తెలివి తెల్లవారింది, మా మెదడు ఆలోచించ సోమరితనంతో నిద్రపోతుందండి.

    ReplyDelete
  7. ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
    జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది!
    woh..nice

    ReplyDelete
  8. అంతర్ముఖం.... మా చెడ్డది. మన తప్పులు చెప్తుంటుంది. మన ఇగోని క్షణక్షణం హర్ట్‌ చేస్తుంటుంది. క్వశ్చన్‌ బ్యాంక్‌లా ప్రశ్నలు వేస్తుంటుంది. బయటకు పూల గంధాలు లోపల దుర్గంధ ఆలోచనలు, బయటకు పూరెక్కల వికాసంలా చిరునవ్వుల పలకరింపులు లోపల అదే మనిషిని తిట్టుకోడాలు. అబ్బో అంతర్ముఖాన్ని డీ కోడు్‌ చేసే మిషన్‌ వస్తే.... ఈ ప్రపంచం బంధమే మిగలదేమో... యదార్ధ వాదం ముందు ఏ బంధమూ నిలబడదేమో. అలాంటి అంతరాత్మతో సంఘర్షణ... క్షణక్షణం ప్రపంచ యుద్ధమే. ప్రతీక్షణం అంతర్యుద్ధమే. మన ఆలోచనలను సముదాయించగలమేమో గాని మనసుని గెలవడం అంతసులువా? ఒక వేళ గెలిస్తే దేవుడవుతాడు, గెలుపు దాకా వెళ్తే మహర్షి అవుతాడు. గెలవడానికి నిరంతర ప్రయత్నం చేేసేవాడే అసలు సిసలైన మనిషవుతాడు. అబ్బో... సూపర్‌. చాలా మంది కాన్సెప్ట్‌తో కవిత రాశారు పద్మ. హాట్సాఫ్‌.

    ReplyDelete
    Replies
    1. అనంతమానస చదరంగం ప్రతీ ఒక్కరి అంతరంగం అని అంటారా సతీష్ జీ

      Delete
  9. మీరు మీ భావాలు ఎప్పుడూ అధ్భుతమే

    ReplyDelete
  10. నా అంతరంగమే నాకు అంతుచిక్కక హైరానా పడుతుంటే మధ్యలో ప్రశ్నించుకో నిజాయితీగా ఉండు నీతి నియమాలతో ఉండమని హెచ్చరిస్తే ఎలా తట్టుకోవాలో చెప్పండి మేడం. మీ అంతరంగం యమ తెలివైనదండోయ్ :-)

    ReplyDelete
  11. చెప్పమంటూ ఒత్తిడిచేసి ప్రశ్నిస్తే మాత్రం
    మూతిముడిచి అలిగి దూరమైపోతుంది
    నిజమే....బలవంతంగా ఏదీ చెప్పించలేం
    మనసుని అస్సలు ఒప్పించలేము.

    ReplyDelete
  12. అంతేలెండి అలోచించి చించి జీవించడమే :)

    ReplyDelete
  13. మరో మంచి కవితని అందించారు

    ReplyDelete
  14. మంచి కవిత. శీర్షిక మాత్రం అర్థవంతంగా లేదు అనిపిస్తుంది-హరినాధ్

    ReplyDelete
  15. అంతా కంఫ్యూజ్డ్..ఎందుకు తెల్లవారిందో ఎవరు ఎవరికి చెప్పారో :-)

    ReplyDelete
  16. అంతర్గత సంఘర్షణల పై పట్టు విడువబోకని
    పరిష్కరించలేని సమస్య సమస్యే కాదనంది!
    భలేగా చెప్పారు. నచ్చేసింది

    ReplyDelete
  17. మాకూ మీ తెలివిని పంచండి :-)

    ReplyDelete
  18. అందరికీ నా నమస్సుమాంజలులు

    ReplyDelete
  19. " నా అవగాహనే ఏదో అంతంత మాత్రం
    మనఃస్థితినిబట్టి అదీ మారుతుంటుంది
    ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
    జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది! "

    మానసిక సంధిగ్నతను చక్కగా
    విశ్లేషించారు. అభినందనలు మేడం గారు



    ReplyDelete
  20. " నా అవగాహనే ఏదో అంతంత మాత్రం
    మనఃస్థితినిబట్టి అదీ మారుతుంటుంది
    ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
    జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది! "

    మానసిక సంధిగ్నతను చక్కగా
    విశ్లేషించారు. అభినందనలు మేడం గారు



    ReplyDelete
  21. అవగాహనకీ, అంతర్మధనానికి సున్నిత వ్యత్యాసం తర్కించడం, ప్రశ్నించడం. సమస్యని అధికమించడం రెండు విధాలు... దాటివేసి దూరంగా ఉండడం... పరిష్కరించి ముందుకేల్లడం... అపరీశ్కృత ప్రశ్నలు అసలు ప్రశ్నలే కావంటూ... అంతరంగ మధనంతో అన్నీ పరిష్కరించి సాధించవచ్చని ఇలా చెప్తూనే తెలివి తెల్లారిందని టైటిల్ పెట్ట్టడం ఏం బాగోలేదు మాడం...

    ReplyDelete