మరచిన జ్ఞాపకాల్లారా మరలిరాకండి
ప్రశాంతగా ఉండమని, వెంటపడకండి!
రాలిన తారలనే ఒడిదాల్చి కూర్చున్నా
కలలనే తోడుగా ఉండమని కోరుకున్నా
వ్యధచెంది ఉన్నా వెర్రిదాన్ని చేయకండి!
కన్నీట తడిచిన వస్త్రాలువిప్పి దోచకండి
కోరికల గాట్లుపెట్టి, గాయాలు చేయకండి!
ఆశల గాలమేదో వేసి ఎదురు చూస్తున్నా
ఆసరాగా ఆత్మస్థైర్యానే అప్పడుగుతున్నా
పరామర్శని పలుకరించి పళ్ళికిలించకండి!
నవ్వులపాలు చేసి చోద్యమేదో చూడకండి
కుదిరితే, కొత్తవెలుగు వైపు దారి చూపండి!
పడిలేచే ప్రయత్నాన్ని నే పదేపదే చేస్తున్నా
నమ్మకాన్నే పెట్టుబడి పెట్టి బేరమాడుతున్నా
అందుకే మరచిన జ్ఞాపకాల్లారా మరలిరాకండి!
వేదనాభరిత కావ్యం హృదయాన్ని తడిమింది.
ReplyDeleteథ్యాంక్యు కల్కి
Deleteమనసుని తడిమిన మీదైన శైలి బాగుంది పద్మగారు
ReplyDeleteమెచ్చిన మీకు థ్యాంక్యు
Deleteమరలి రావద్దు, మరచిపోవాలి అనుకుంటే మాత్రం సాధ్యమా, వద్దన్నా వచ్చిపోయేవే వేదనలు. మంచికవిత మేడం
ReplyDeleteవద్దు వద్దు అని వందసార్లు అనుకుంటే కొన్నిసార్లైనా తగ్గకపోతాయా జ్ఞాపకాలు అని ఆశ.:-)
Deleteపడిలేచే ప్రయత్నాన్ని నే పదేపదే చేస్తున్నా..Inspiring words
ReplyDeleteప్రయత్నం చేస్తూనే ఉండాలి అని పెద్దలు అంటుంటారు కదాండి
Deleteధైర్యమై వస్తా... స్తైర్యమై నిలబడండి...
ReplyDeleteఅలాగే తప్పకుండా :-)
Deletegnapakaala gurunchi baaga cheppaarulendi....
ReplyDeletethank you nestam
Deleteఆశల గాలమేదో వేసి ఎదురు చూస్తున్నా
ReplyDeleteఆసరాగా ఆత్మస్థైర్యానే అప్పడుగుతున్నా
fantastic lines once again...
మనిషి ఆశాజీవి కదాండీ. తప్పదు.
Deleteమరచిపోతే కదా మరలిరానీకి
ReplyDeleteటైం అన్నింటినీ మరిపిస్తుంది
Deleteమధురాతిమదురం మీ కవిత్వం దానికి తగిన చిత్రం.
ReplyDeleteధన్యవాదాలు మీకు
Deleteజ్ఞాపకాలనేవి గుర్తు చేసుకోవడానికే తప్ప మరచిపోవడానికో మరలిపొమ్మనడానికో కాదు పద్మా. వేదన అంతా చిత్రంలోను, ప్రతి పదంలోను రంగరించావు.
ReplyDeleteమధురజ్ఞాపకాలైతే మీరన్నట్లు గుర్తుచేసుకోవచ్చు...అవే వ్యధలైతే :-)
DeleteAK-47 tho shoot cheyali jnapakalani :)
ReplyDeletesupply chesedi evaru AK-47 ni :-)
Deleteheart touching lines. impressive art.
ReplyDeletethank you Sindhoo
Deleteఆర్ద్రతని సింపుల్ వాక్యాలతో చక్కగా అందించారు మాడం. పెయింటింగ్ కూడా బాగుంది
ReplyDeleteథ్యాంక్యూ నందూగారు.
Deleteమరచిన జ్ఞాపకాల్లారా మరలిరాకండి
ReplyDeleteకుదిరితే, కొత్తవెలుగు వైపు దారి చూపండి!
రావద్దు అంటూనే దారి చూపమనడం బాగుంది
నయాన్నో భయాన్నో బ్రతిమిలాడాలి కదాండి ;-)
Deleteమనిషికి మనసుతోపాటు మెదడుని వాటికి సరిపడే జ్ఞాపకాలని కూడా మెండుగానే ఇచ్చాడు. కాలక్రమేణా వాటిని మరచిపోయే శక్తిని కూడా ప్రసాదించాడు. క్రమంగా మరుగున పడిపోయే జ్ఞాపకాలని తలుచుకుంటూ వగచడం కన్నా టైం కి వదిలేస్తే అవే సర్దుకుంటాయి-హరినాధ్
ReplyDeleteమీరు చెప్పింది నిజమే . మరచిపోవడానికి పట్టే సమయమే చాలా భారంగా గడుస్తుంది అని నా అభిప్రాయమండి.
Deleteమీ కవితల్లో అక్షరాలు ఎన్ని కథలు చెప్తాయో.. అంత కంటే ఎక్కువగా మీ చిత్రాలు చెప్తుంటాయి. మరిచిన జ్ఞాపకాలు ఒక్కోసారి మధువులు చిలికిస్తాయి. మరోసారి గాయాలు చేస్తాయి. ఇక్కడ రెండోది ఎక్కువ. అలాంటి జ్ఞాపకాలను చెదిర్చిన ఆ కుంకుమ బొట్టు.... జ్ఞాపకాలను ఎప్పుడో చెరిపేసింది. కనులు జారిన కన్నీటి చుక్కలు రాలిన తారల్లో ఒడిని తడిపినా... ఆందులో వేడి చల్లారి.. ఎప్పుడో జ్ఞాపకాన్ని చెరిపేసి ఉంటాయి. కన్నీటితో పీడకలను ఎప్పుడో తరిమేసిన ఆ కళ్లు కొత్త లోకాన్ని చూస్తున్నాయిప్పుడు. కన్నీట తడిపిన వస్త్రాలతో కపట ఓదార్పులు, పరామర్శల గాట్లు మనసుని రాటు దేల్చాయి. పడి లేచే ప్రయత్నానికి బహుమతిగానే చుట్టూ పచ్చని పూల పలకరింపులు ఎదను తాకుతున్నాయి. గొప్ప భావానుభవ కవిత. భావోద్వేగాల సంచిక. చిత్రం అద్భుతం.
ReplyDeleteఇక్కడ చిత్రం చాలా ఊసులే చెప్పింది :)
Deleteసతీష్ గారు...
Deleteతింటే గారెలే తినాలి,
వింటే భారతమే వినాలి!
అనేది పాత నానుడి.
పద్మార్పితగారి కవిత చదవాలి,
బొమ్మల భాష్యం మీరే చెప్పాలి!
ఇదే సరైన బ్లాగ్ జోడి.
ఆకాంక్ష చెప్పింది కరెక్ట్.
Deleteచిత్రవర్ణనలో మీరు ధిట్ట.
మీ కమెంట్ చదివిన ప్రతీసారి నాకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. మీరు CC కెమెరాలు ఏమైనా పెట్టి నా భావాలని(చిత్రం యొక్క) చదివేస్తున్నారా ఏంటని. నిజానికి నాకన్నా చాలా బాగా నా చిత్రాల లోగుట్టుని అంచనావేస్తారు. ఇన్ని తెలిసిన మీరు, నా చిత్రాల్లో మీ కమెంట్ లేని లోటుని చూడకపోవడం వింతగా ఉందండి. Just kidding.Satishgaru thanks a lot for your wonderful description.
Deleteఅనికేత్...సతీష్ గారితో అక్షరాలే కాదు బొమ్మలు కూడా మాట్లాడతాయి అన్నది అతిశయోక్తి కాదు :-)
Deleteఆకాంక్షగారు...బుల్లి బుల్లి కవితలతో భలే మురిపిస్తున్నారు. నా రాతలు చదవడం ఏమో కానీ సతీష్ గారి విషయంలో మీరన్నది 100% కరెక్ట్.
Deleteనయనీ యస్ యు ఆర్ రైట్
తర్కించనూ లేను మరచిపోనూ లేను.
ReplyDeleteహమ్మయ్యా మిమ్మల్ని మెప్పించాను :-)
Deleteరావద్దంటే రాకుండా ఉంటాయా? పేరే జ్నాపకాలు కదా? ఈ కవిత మాస్టర్ పీస్ ఈ ఏడాదిలో..అభినందనలతో..
ReplyDeleteఅలా అనుకుంటే అయినా కాస్త మనసుకి ఊరట కదండీ :-) మీ అభిమానస్ఫూర్తిదాయక స్పందనకు నెనర్లు.
Deleteఇంత సున్నితంగా చెబితే జ్ఞాపకాలకే మనసుంటే తప్పక మరలి వస్తాయి మీరు వద్దన్నా..:)
ReplyDeleteమరలివస్తే మరల మరల వేడుకుంటానుగా :-)
Deleteకన్నీటితో తడిచిన తనువు అందాలని చూసి దోచుకోవద్దంటూ, కోరికల గాట్లు పెట్టి గాయాలు చేయవద్దంటూ....ఆహా ఎంతో హృదయారవిందంగా చెప్పారు. మీ పదపద్మాలకు నా వ్యాఖ్యాక్షరాలు వంగి చేస్తున్నాయి వందనం.....ఏంటో మీ కవితకు నేను వ్రాసిన కమెంట్ చదువుకుని నేనే మురిసిపోతున్నాను :) తప్పదు మరి ఆ భావం అటువంటిది :-)
ReplyDeleteమీరేంటి!? నేను తెగ మురిసిపోతున్నాను. మీ వ్యాఖ్యలను చూసి చదివి మరీ. థ్యాంక్యూ వెరీమచ్
Deleteగడచిన కాలం తిరిగిరాదు. అన్నీ మరచి హాయిగా సాగిపో
ReplyDeleteఅదే ప్రయత్నం అందరూ చేయాలని :-)
Deleteనమ్మకాన్నే పెట్టుబడి పెట్టి బేరమాడుతున్నా..ఆ నమ్మకం ఎప్పుడూ వమ్ముకాకూడదు. వేదనని చక్కగా చెప్పారు
ReplyDeleteనమ్మకం ఉంటే చాలా వరకు అసాధ్యం కానివి అంటూ ఉండవని :-)
Deleteభవ్యమైన భావం పద్మ
ReplyDeleteధన్యవాదాలండి
Deleteమీరు గ్రేట్ మిత్రమా
ReplyDeleteఆశ....వెల్ కం
Deleteprofile rabbit so cute. :-)
talachukoku
ReplyDeleteఅలాగే మహీ ;-)
Deleteఆత్మస్థైర్యం మీలో మెండు. అప్పడిగితే మాకేం మిగులు. చెప్పవలసింది నికార్సుగా చెప్పే సత్తా మీలో ఉంది. అందుకే మీ కవితలు అంతగా నచ్చేస్తాయి. మరో మంచికవిత పద్మా.
ReplyDeleteఅత్మస్థైర్యం అందరికీ అవసరమే. అది అప్పు ఇచ్చే కొద్ది రెట్టింపు అవుతుంది. మీరు హైరానా పడకండి. థ్యాంక్యూ...నయని
Deleteవ్యధాభరిత క్షణాలు జ్ఞాపకాలై మనసును బాధపెడుతుంటే, అలాంటి జ్ఞాపకాలు మరిలి వచ్చి ఇంకా గాయపరుస్తూ, కోరికలు రేపుతూ, ఆశల గాలాలేస్తూ ఓదార్పు పొందమని సలహా ఇవ్వడం సబబు కాదని ..... ఎంత హృద్యంగా చెప్పారు....!!!
ReplyDeleteగాయాలురేగుతాయని తెలియని అజ్ఞాన జ్ఞాపకాలకు ఇంత అందంగా ఆజ్ఞాపిస్తూ మాకు విజ్ఞానం పంచిన మీకు కృతజ్ఞతలు పద్మార్పిత గారూ...
ఎవరికి వారే అజ్ఞానులం అనుకుంటే వారి జ్ఞాపకాలు అజ్ఞాతంలో కలిసిపోయే ఛాన్స్ ఏమైనా ఉందేమో ఈసారి ట్రై చేయాల్సిందే. :-)
Deleteమీ ప్రశంసాపూర్వక అభిమాన స్పందనలకు వందనాలు.
బాగుంది పద్మ
ReplyDelete