నిఘంటువు

వ్రాయాలని కదం త్రొక్కితే పదం నేనౌతా
పదాలతో పాదమై నీ ప్రక్కనే నేనుంటా!

వేదనలే వ్రాయబోతే సాహిత్యం నేనౌతా
కధలు అల్లబోతే కాల్పనికల్లో నేనుంటా!

క్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా
క్షణికంలో కావ్యమై నీ కలంలో నేనుంటా!

ప్రేమాక్షరాలే వల్లించు ప్రతీవర్ణనా నేనౌతా
వశీకరించిన గజల్ అయి నీ ముందుంటా!

కొన్నిగంటలు నాతో గడిపితే నేను నీవౌతా
తెలుగు నిఘంటువునై నీలోనే నేనుంటా!!

16 comments:

  1. అమ్మో! ఇదేదో తెలుగు భాషా పండితుల ప్రేమ యవ్వారం లావుంది

    ReplyDelete
  2. సరస్వతీ మానసపుత్రికకు తెలుగుతల్లి దీవెనలు.
    తెలుగుభాషా దినోత్సవ శుబాకాంక్షలు

    ReplyDelete
  3. తెలుగు నిఘటువుగా మారతారా, ఎంతో అద్భుతమైన భావాన్ని కలిగించారు.

    ReplyDelete
  4. మీకు ఇంకా తెలుగు తల్లికి అభివందనములు.

    ReplyDelete
  5. meru annee vishayalu sunnitamga cheppi meppistaru. great mam

    ReplyDelete
  6. పద్మా అక్షరాలతో సహా అన్నీ నువ్వు అవుతానన్న భావన చాలా బాగుంది, చిత్రం ఎంతగా నచ్చింది అంటే మొదటిసారి ప్రొఫైల్ పిక్ మార్చేంత.

    ReplyDelete
  7. కూర్పులో కమ్మదనం ఉంది
    చిత్రం కుందనపు బొమ్మల ఉంది

    ReplyDelete
  8. so sweet encouraging words.

    ReplyDelete
  9. తెలుగుదనానికి అర్థం చెప్పి, నిఘంటువి అందాన్ని చేకూర్చినట్లుంది

    ReplyDelete
  10. ఈ నిఘంటువులో తెలియని విషయాలకి అర్థాలు ఎన్నో.

    ReplyDelete
  11. వశీకరించిన గజల్ అయి నీ ముందుంటా wah beautiful

    ReplyDelete
    Replies
    1. పద్మ గారే చాలా మంచోళ్ళు , మరి ఆవిడని తన చేతిలో చందమామగా , కంటిపాపలో మెరుపుగా , గుండెల్లో దాచుకున్న చెలియగా చేసుకున్న అతనెంత మంచోడో కదా ! అందుకేనేమో వినోద్ గారు అన్నట్టుగా ఈ కవితలో ఇన్నిన్ని భావాలు ?

      Delete
  12. మీ మనసులాగే మీ కవిత బాగుంది.

    ReplyDelete
  13. క్షణం తలిస్తే విఛ్ఛిన్నమై క్షణికం నేనౌతా..నిజమాండి!

    ReplyDelete
  14. పదాల్లో కవిత్వం ఉట్టిపడేలా ... తెలుగుదనంతో కట్టిపడేశారు మాడం... అద్భుతం!

    ReplyDelete