అవసరాలు తీర్చుకోవడానికి ఆసరా ఏమో!
అబద్ధపు స్నేహం అత్యవసరమని అన్నావు..
అనవసరం అని చెప్పే ధైర్యము లేక ఏమో!
ఆవేశాన్నే అణచివేసానని అలుగుతున్నావు..
అనునయించడం నీకసలు చేతకాకనో ఏమో!
అనురాగమని అక్కడక్కడా తాకుతున్నావు..
అధముడివైనావు నీకదేమి జాడ్యమో ఏమో!
అణువణువూ కొవ్వెక్కి ఆబగా చూస్తున్నావు..
అందిన అందమే జుర్రుకుని అలసినావో ఏమో!
ఆశ్రయించి అరచి గోల ఏలని అణచివేసినావు..
అబలకి దక్కిన వరం శాపంగా మారెను ఏమో!
అబాసుపాలైనావని అంతిమతీర్పు ఇచ్చినావు..
Madam you are having artistic mind. Paintings which you are posting are mind bowing.
ReplyDeleteకమెంట్ పెట్టాలి అంటే కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి పద్మార్పితగారు. మళ్ళీ వచ్చి కమెంటుతాను. షాక్ లో ఉన్నాను.
ReplyDeleteప్రతి కవితలో రాసే పదాలు, భాష పై మీకున్న పట్టు మీ స్తిరత్వాన్ని, జీవితం పై మీకున్న అవగాహన్ని తెలియజేస్తున్నాయి. చిత్రాల ఎంపిక కడుప్రశంసనీయం. కొనసాగించండి.
ReplyDeleteసమాజంలో జరుగుతున్నది ఇదేనండి.
ReplyDeleteసున్నితంగా చెప్పకనే చెబుతున్నట్లుగా చైతన్యవంతుల్ని చేస్తుంటారు మీరు కవితల్లో. కవితా వస్తువు ఏదైనా అద్భుతంగా పండిస్తారు. పెయింటింగ్స్ కి పూర్తిగా పడిపోయేను. చూసినవే పదే పదే చుస్తుంటాను. మీ కళాతృష్ట్ణ అమోఘం.
మీరు ఎన్నుకున్న కవితావస్తువుతో పండించిన భావాలు నిత్యజీవితంలో జరుగుతున్న వాస్తవాలకు అద్దంపడుతున్నట్టుగా ఉన్నాయండి. అభినందనా సుమాలు మీ కవితకు... చిత్రం ఎన్నిక అద్భుతం మేడం!
ReplyDeleteచాలా బాగా రాసారు
ReplyDeleteచాలా బాగా రాసారు
ReplyDeleteఅంతిమతీర్పు అర్పిత ఇచ్చి ఉంటే ఇన్స్పైరింగ్ గా ఉండేది. ఏమైనా అబల సబల కదా!
ReplyDeleteమేడం మోసం చేసి తీర్పులు చెప్పేది మగవాళ్ళేనా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
ReplyDeleteఅంతం కాదు ఇది ఆరంభం అనండి. అంతిమతీర్పు ఏంటి అందమైన బొమ్మకి ఆ భావానికి పొంతనలేదు.
ReplyDeleteఅధముడివైనావు నీకదేమి జాడ్యమో ఏమో!
ReplyDeleteఅణువణువూ కొవ్వెక్కి ఆబగా చూస్తున్నావు.
అమ్మో ఇలా తిడితే ఎలా? మీకే సాధ్యంలె
మరో మంచి కవిత . మరీ అలా ఆడిపోసుకోకు వాళ్ళని అబాసుపాలయ్యేవు!
ReplyDeleteకలలన్నీ కన్నీరై జారి.. ఆ కన్నీరు కూడా ఇంకి.. ఇంకేదో ఓదార్పు కోసం చూస్తున్న ఆ కళ్లను అడిగితే... బహుశా మీరు రాసిన అక్షరాలనే బాష్పాలుగా జారుస్తుందేమో. ఆశనిరాశల మధ్య ఊగిసిలాడుతున్న చిగురుటాకు... తుఫానులో చిక్కుకున్నట్టు... ఆకాశమంత భారాన్ని మోస్తున్న ఆ గుండెనడిగితే... ఆ గుండెచప్పుడు బహుశా... బాధను ఇలాగే వెళ్లగక్కుతుందేమో. అర్పించిన తనువు... మనసు, మనువు అడిగితే... గత అనుభవాల గ్రీష్మ తరువుని, రాల్చే కొద్దీ రాలే జ్ఞాపకాల అకుల శబ్ధాన్ని... నిద్రలేని రాత్రులను ఇచ్చిన ఆ బండరాయిని శిల్పంగా చెక్కాలనుకోడం... ఆ శిల్పాన్ని ఆరాధించాలనుకోడం... అవివేకమే మరి. బరువెక్కిన ఆలోచనలకు మెదడు భారమైన వాలిన తల కోరుతోంది... చిరునవ్వుల ఓదార్పు, కన్నీటిని తుడిచే ఓ చేయి. మీరు రాసిన అక్షరాలకు నా ప్రతి అక్షరాలివి. ఆ చిత్రం చూడగానే నాలో ఏదో తెలియని అలజడి. ఆ అలజడివాన జల్లులే.. ఈ స్పందనాక్షరాలు.
ReplyDeleteఅద్భుతంగా రాశారు. ఇంతకన్నా గొప్పగా చెప్పలేకపోతున్నాను.
Deleteసతీష్ గారు...మీరంటే చిత్రం గురించి వర్ణించి మార్కులు కొట్టేస్తారు. మరి నా సంగతి ఏంటి. మీ కమెంట్స్ చదివి షాక్ నుండి తేరుకున్నాను.. మన్నించాలి మీ లైన్స్ పెట్టి డిటో అంటే పోతుంది :-)
నిజానికి ఆకాంక్ష గారి మాటలే నాకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మీరు ఒక్క మాట చెప్తే చాలు. నేను వందమాటలు చెప్తే గాని... మీకు పోటీ కాలేనుగా...
Deleteఅద్భుతంగా చెప్పారు. చిత్రానికి తగిన భావం దానికి తగ్గ వివరణ బాగుంది.
Deleteఅద్భుతంగా రాశారు. ఇంతకన్నా గొప్పగా చెప్పలేకపోతున్నాను.ఇంతకన్నా ఏం వ్రాయడం వచ్చని నవ్వుతున్నారు కదా! నవ్వండి నవ్వండి :-)
ReplyDeleteఇక నుంచి మీరు నేను కలిసి కామెంట్లు పెడదాం.. ఏమంటారు...?
Deleteసమాజంలో జరుగుతున్నది ఇదే అని తెలిసినా ఒప్పుకుని ఓర్చుకునే వారే కానీ వివరించి ఎదిరించలేని అభాగినులు ఎందరో ఉన్నారు. ఏవిధంగా ఎదిరించి నిలబడాలో కూడా చెప్పండి పద్మార్పితగారు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఅబ్బా ఏం చెప్పారండి
ReplyDeleteపద్మా నాకు ఇలాంటి డీమోరల్ పోయంస్ నీ కలం వెంట రావడంగాని చదవడంగానీ ఇష్టం ఉండదు. సారీ ఇంకెప్పుడూ వద్దు.
ReplyDeleteFacts happening in life. well narrated padma
ReplyDeleteఆలోచించాల్సిన అంశాన్ని ఎన్నుకున్నారు. బాగుంది.
ReplyDeleteఅబల అనుకుంటారు కానీ మీరు సబలలు మీకు దక్కేవి అన్నీ వరాలే. మంచి కవిత పద్మగారు.
ReplyDeleteస్పందించి వ్యాఖ్యలతో స్ఫూర్తినిస్తున్న అందరికీ నమోవందనం _/\_
ReplyDeleteఇలా ఒక్క మాటతోనా...?
Deleteఅడిగి అరిచి అలసినాను...మీరు ఇంత మెల్లగా అడిగితే ఎలా? :-)
Deleteస్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ గారు.
Deleteఆకాంక్షగారు....కలహభోజుడి సోదరిగా మారిపోయారు. :-) మరీ ఇలా రెచ్చగొట్టకండి నా పై యుధ్ధానికి :-)
Deleteపద్మార్పితగారు,
Deleteకలహభోజుడి కాదండి కలహభోజనుడి అనండి. బోజ భోజన శబ్దాలు వేరు వేరు అర్థాలు కలవి.
మీరు కోపగించుకోనంటే మరొకమాట కూడా ఉందండి. అంతిమతీర్పు అనకూడదండి. ఆఖరితీర్పు అనండి. అంతిమ అన్నది సంస్కృతపదం కదా , దానిపక్కనే తీర్పు అని తెలుగుమాట వేసి సమాసం చేయకూడదు. ఆఖరితీర్పు అన్నపుడు రెండూ తెలుగుమాటలే ఆసమాసంలో కాబట్టి ఇబ్బంది లేదు.
ఒక్క నిముషం లోనే రెండు బ్లాగుల్లో ఇలా సంస్కృతపదం పక్కనే తెలుగు మాట వేసి సమాసం చేయకూడదు అని చెప్పవలసి వచ్చినందుకు విచారంగా ఉంది. మన రచనాకారులు ముఖ్యంగా బ్లాగర్లు భాషామర్యాదలపట్లు కొంచెం శ్రధ్ధవహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయం మీకు నచ్చకపోతే మన్నించండి - క్షంతవ్యుడను.
మీలాంటి తెలుగు పండితులు తప్పులు సరిచేస్తే తిట్టుకోవడం ఎందుకండి? తెలిసీ తెలియని నా తెలుగు పాండిత్యాన్ని చదివి సరిచేస్తున్నారు అన్న సంతోషం. "క్షంతవ్యుడను" లాంటి మాటలను అనకండి. మీలాంటి వారు చెబితేనేగా తప్పులు తెలుసుకుని సరిచేసుకునేది. ఇక పై కూడా సరిచేస్తారని ఆశిస్తూ...ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్యామలీయంగారు._/\_
Deleteతీర్పులు వీినే తీరిక కూడా ఉందా మీకు?
ReplyDeleteవాస్తవాలని ఈ విధంగా వెల్లడించారన్నమాట. బాగుందండి.
ReplyDeleteరిప్లైస్ ఇవ్వండి పద్మగారు.
ReplyDeleteసమయభారం వలన రిప్లైస్ విడిగా ఇవ్వలేకపోయాను. మన్నించాలి. ఇప్పుడు ఇస్తే "దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు" అని నయనిగారు దూసుకువస్తారు అందుకే...ఈసారికి ఒగ్గేయండి :-) _/\_
ReplyDeleteనన్ను మీరు తలచుకున్నారని సంబరం
Deleteనేను మిమ్మల్ని అంటానని అభియోగం
ఏం అనుకోకండి అది మీపైన అభిమానం
పద్మగారు మీ స్టైల్ లో కవిత వ్రాసిన ఫీల్ నాలో :-) :-)
అత్యుత్తమ తీర్పు
ReplyDeleteబావుంది
ReplyDeleteమీ మిగతా వాటితో పోలిస్తె నాకు ఇది అంతలా తాకలా.... ఎమనుకోవద్దండి బావుంది ....,,నాకే అంతగా అర్థమవలేదండి...,.. సో ....కీపిటప్ పద్మార్పిత గారూ