చూపొకటే


నా కళ్ళు నిన్ను చూసినంతనే..
కలలకి ప్రతిరూపమే కనపడింది!

సరిహద్దులు దాటిన ఆనందమే..
శ్వాసను సువాసనతో నింపింది! 

అలలే మైమరచి తెమ్మెరై ఎగసే..
వాలుజడ నల్లనికురులే విప్పింది!

ఆగలేనన్న జవ్వని యవ్వనమే..
కౌగిలిలో ఒదిగిపోయి మురిసింది!
 సిగ్గుతో గుండె చెప్పలేని ఊసులే..
సడిచేయని కంటిభాషగా మారింది!

నింగి సంబరంతో నేలనే తడిమేసె..
ఇరువురొకటై సాక్ష్యం చెబుతామంది!

చేతులే కలిసి మనసులు బాసచేసె...
రెండుకళ్ళే అయినా చూపొకటేనంది!

50 comments:

  1. అలలే మైమరచి తెమ్మెరై ఎగసే..
    వాలుజడ నల్లనికురులే విప్పింది!
    Lovely feeling madam. Pic bagundi

    ReplyDelete
  2. కనుల్లో ఒదిగి ఉండే భాష కలల రూపమే సంతరించుకుంటుంది
    ఆనందాతిరేకమే నవనాడుల్లో సరికొత్త ఉల్లాసానికి నాంది పలుకుతుంది
    చంచలమైన అలలే ఉవ్వెత్తున ఎగిసి పడేలా మదిలోని భావాలు సైతం ఉరకలేయగా
    గుండెచప్పుడు కూడా హాయిరాగమే ఆలపించదా నింగి నేల సంబరమే సాక్షి కాగా
    మది ఇరువురిది గుండెలయ ఒక్కటే కదా
    మనసు ఇరువురిది భావం ఒకటే కదా
    కన్నులు ఇరువురివి కాని అవి చూసేవి ఇరువురిగా వున్నా ఒక్కరినే కదా
    ఆ రాధకృష్ణులే కదా
    జై శ్రీమన్నారాయణ

    పదాల కూర్పు లో ఇమిడిన నాకు ఈ కవిత చదువుతున్నప్పుడు ఆ రాధాకృష్ణ మాత్రమె కనిపించారు పద్మ గారు . ఔను .. సీత రాముల తరువాత అంతటి మహోన్నతమైన జంట రాధ కృష్ణులదే కదా. ఓం నమో వెంకట నారసింహాయ. బహుచక్కని కావ్యం పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. మీకు రాధాకృష్టులపై ఉన్న అభిమానమో లేక మీలో దాగిన ప్రేమభావమో...మీకు వారిరువురే కనబడేలా చేసింది....కాదంటారా!

      Delete
  3. ప్రేమని లాలిస్తూ వెళ్ళబుచ్చి జోలపాడినట్లుంది మీ కవిత. అయినా ఈ విద్య మీకు కొట్టినపిండి. కొట్టి పిండితో పిండివంటలు చేయమని అనకండి పద్మార్పితగారు :-)

    ReplyDelete
    Replies
    1. Laalanuchu Noocheru Lalanalirugadala Baala Gandavara gopaalaa ninu chaalaa.. Laali Jo Laali..

      Delete
    2. ఔరౌరా గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
      ఔరౌరా గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
      ఓ హో రే అరెసెలుల్ల
      భళేరె లడ్డు లందు భబ్బేణి బోణి ఇందు
      భళేరె లడ్డు లందు భబ్బేణి బోణి ఇందు
      అబ్బెయేది ఏది ముందు
      మఝారె అప్పడాలు పులిహోర తప్పళలు
      మజారే అప్పడాలు పులిహోర తప్పళలు
      వహ్వారే పాయసాలు

      Delete
    3. నోరూరిస్తున్నారా! :-)

      Delete
    4. మీరే కదా లాలిస్తున్నారా అని అడిగారు అంచేతే ఆ గోవిందుని లాలిపాట.. పిండివంటలన్నాక ఆ మాత్రం నోరూరటం సబబేనండి ఆకాంక్ష గారు :-) [అప్పటి కాలం లో ఘటోత్కచ మాయ ఇప్పుడేమో డిజిటల్ మాయాంతర్జాల మహిమ :-)) ]

      Delete
    5. మీరే అన్నీ చెప్పేస్తే ఇంక నేనేం చెప్పను/అడగను చెప్పండి

      Delete
    6. Sridhar Bukyagaru...paatalu kuudaa padataaraa :-)

      Delete
  4. సుందర ప్రేమ దృశ్యకావ్యం
    కనులకు ఇంపైన చిత్రం

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు అభివందనము.

      Delete
  5. కవితకు చూపొకటే అని టైటిల్ పెట్టి చక్కనైన దృష్యకావ్యంతో సున్నిత ప్రేమభావాలను అందించి మా చూపుల్ని తిప్కపుకోకుండా ట్టిపడేశారు మేడం.....

    ReplyDelete
    Replies
    1. అభిమానాత్మక స్పందనకు నెనర్లు.

      Delete
  6. ప్రేమని అంతా కుమ్మరించారు...బాగు బాగు ;)

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  7. కనులను కవ్విస్తున్న ప్రేమాక్షరాల సవ్వడికి గుండెలో అలజడి. జవ్వని వాల్జడ కురుల ప్రవాహమైన వేళ ఆ ప్రవాహాన నేనొక అలనైతే ఎంత బాగుండో. సడిచేయని ఊసులే.. ఆ ఊసుల్లో కనిపించని కావ్యాలెన్నో. మూగమనసులో దాగిన.. ప్రేమ దాహాన్ని... పదాలలో కూరి.. ఇలా అల్లరి చేయడం... న్యాయమా.

    ReplyDelete
    Replies
    1. మీరు ప్రశ్నించడం ఏమిటి జవాబు చెప్పాలిగాని :-)

      Delete
    2. సతీష్ గారు...మీకు చెప్పేంత ధైర్యమా! :-) :-) :-)

      Delete
  8. చాలా రోజులకి సొంపైన ప్రేమకావ్యాన్ని అందించారు పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. అంటే ప్రేమ తగ్గిందనేగా మునుపటి కవితల్లో :-)

      Delete
  9. కనులు రెండైనా చూపు ఒకటే వాహ్ ఏం చెప్పారండి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ స్పందనకు

      Delete
  10. సరళమైన శైలితో మధురమైన ప్రేమని ఒలకబోసారు కవితా చిత్రంలో.

    ReplyDelete
  11. గుండె చెప్పలేని ఊసులు కంటి చూపు చెప్పింది అంటున్నారు నిజమైన ప్రేమకి మనసు చేసే చప్పుడే చాలేమో కదాండి పద్మగారు :-)

    ReplyDelete
    Replies
    1. మీరే చెప్పాలి.:-)

      Delete
  12. ప్రేమ ఎప్పుడూ మదురంగానే ఉంటుంది
    దక్కిన వారు అదృష్టవంటులు. కవిత చిత్రం రెండూ బాగున్నాయి ఎప్పటిలాగానే

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు ఏంటి నాలాగే చెప్పేసారు :-)

      Delete
  13. రసరమ్యభావం మీ రచనల్లో
    రంగులు అద్దే ఆ కుంచెలో.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీకు

      Delete
  14. మీరు ఇలాంటి కవితలు రాస్తూ ఉండండి వేసవి అంతా చల్లగా గడిచిపోతుంది వాటిని చదువుతుంటే.

    ReplyDelete
    Replies
    1. అప్పుడు మామిడి చెట్లు కాయలు ఉండవు, ఆవకాయా ఉండదు :-)

      Delete
  15. so romantic pic with lovely lines.

    ReplyDelete
  16. సుమధుర ప్రేమకావ్యం బాగుంది

    ReplyDelete
  17. చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీకలవరమూ..... :-(

    ReplyDelete
    Replies
    1. కలవరము మీకేనా వినోద్ :-)

      Delete
  18. రసరమ్యం నీ కవిత మరియు చిత్రం. ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  19. సుమధుర ప్రేమాక్షరాల మాలిక అల్లినారు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీకు అభివందనము.

      Delete
  20. ఎప్పటిలాగానే భావము చిత్రం రెండూ బాగున్నాయి పద్మా

    ReplyDelete
  21. మాడం పద్మగారు...కాస్త బ్లాగ్ వైపు కూడా ఒక లుక్ వేయండి. మాకు చెప్పి మీరే ఇలా చేస్తే ఎలా :-)

    ReplyDelete
    Replies
    1. సారీ ఆకాంక్ష. సమయ భారం వలన రిప్లైస్ విడిగా ఇవ్వలేకపోయాను. ఇకపై రెగ్యులర్ గా ఇవ్వడానికే ప్రయత్నిస్తాను.

      Delete
  22. జవ్వని యౌవనం కౌగిట్లో ఓదిగీనప్పుడు కనులు మూగబాస లాడుకుంటాయ్ ఓకరి ఉచ్వాసమే మరోకరి నిచ్వాసమై ఇరు తనువుల కోకమనసూ ఇరు మనసుల కోక తనువై ఓదీగారు ప్రేమకు ఆచంద్రతారార్కము చిహ్నంగా యెదిగారు ......
    పద్మార్పిత గారూ హాట్సాప్

    ReplyDelete