చావుగడియ

ఆత్మలన్నీ ఏకమై అనందంగా నర్తించమంటూ
ఆశలనే అణచివేయమంటూ అర్తనాదమేచేస్తూ
తీరనికోరికలు ఎందుకే నీకు కొరివిదెయ్యమంటే
తీరికేలేదని తెగ నీలిగి తిట్టుకున్నాను అప్పుడు!


 
జీవిత అంతరార్థమే భోధపడినాక బోరుమంటూ
జీవంలేని నికార్సైన నిండుచీకటినే నే ప్రేమిస్తూ
పిశాచాలనే పీడకలలో పండువెన్నెలై రమ్మంటే
పిచ్చని ప్రేతాత్మలే పగలబడి నవ్వాయి ఇప్పుడు!


సమస్త బంధాల్ని కాల్చి బూడిదచేసి వీడ్కోలంటూ
సమాధిలోపల స్వఛ్ఛమైన మనసునే పూడుస్తూ
గంపెడు ఆశతో చావునే చెలికాడుగా మారమంటే
గడియవస్తే గొంతు నులుముతాననె అది ఎప్పుడు!25 comments:

 1. అర్పితా.... చంపెసావ్... వన్ ఆఫ్ ది బెస్ట్స్!!

  ReplyDelete
  Replies
  1. వినోద్ గారు...అర్పిత అరిపించారు అనాలి :-)

   Delete
 2. కెవ్వువ్వూవ్వూ కేక :) :) :) హడలి చచ్చాను :-) సూపర్ అదరకొట్టారు

  ReplyDelete
 3. Mam ultimately good pic and heart touching words.

  ReplyDelete
 4. పద్మగారు ఇలాంటి హృదయ ఆర్ద్రత కవితలు అవి భయంకరమైనా హాస్యాన్ని జోడించినా మీరే వ్రాయాలి మేము చదివి తరిచాలి. సరైన చిత్రం అత్యధ్భుతం.

  ReplyDelete

 5. ఈ చావు గడియ లో 'బావ' ఎక్కడా కనపడ లేదేమిటి చెప్మా !??

  జిలేబి

  ReplyDelete
 6. అర్పితా...నీ అక్షరాల్లో పటుత్వం పెరిగింది అని ఈ కవిత మరోమారు సూచిస్తున్నప్పటికీ వేదన అక్షరాల్లోనే కానీ నిజజీవితంలో బాగుండదు తల్లీ. సంతోషగా ఉండి నలుగురికీ ఆనందాన్ని పంచు అంతే తప్ప చావుకోసం ఎప్పుడూ అంటూ వేచి చూడకూడదు అని. చిత్రం చాలా బాగుంది-హరినాధ్

  ReplyDelete
 7. సమస్త బంధాల్ని కాల్చి బూడిదచేసి వీడ్కోలంటూ..అధ్భుతంగా వేదనని పండించారు!

  ReplyDelete
 8. వామ్మో నాకు చాలా భయ్యమేస్తుంది తల్లో:-)

  ReplyDelete
 9. అప్పుడు చావమంటే No
  ఇప్పుడు చావు చెప్పింది No
  ఇప్పుడు చావు ఎప్పుడో..:-)

  ReplyDelete
 10. ఈ కవిత మనుషుల కోసమా?కొరివి దయ్యాల కోసమా!

  ReplyDelete
 11. మరో మంచి కవిత పద్మా.
  అనుకున్నప్పుడు చావు రమ్మంటే రాదు. సమయం వచ్చినప్పుడే చస్తాము అని సున్నితంగా చెప్పావు.

  ReplyDelete
 12. beautiful painting. ur poetry is too good.

  ReplyDelete
 13. భయపెట్టి బాధపెట్టడం ఎందుకు పద్మా. నీకే చెల్లులే దెయ్యాలతో, ఆత్మలతో డాన్స్ వేయిస్తావు.

  ReplyDelete
 14. బొమ్మలోని కళ్ళని చూసి భయపడాలో
  మీరు పిలిచిన చావు పిలుపుని చదివి భాదపడాలో తెలియడం లేదు.

  ReplyDelete
 15. బ్రతకడం కన్నా చావడం మిన్న అనా మీ ఉద్దేశ౦?

  ReplyDelete
 16. This is too hard to digest but heart touching.

  ReplyDelete
 17. జీవిత అంతరార్థమే భోధపడినాక బోరుమంటూ
  జీవంలేని నికార్సైన నిండుచీకటినే నే ప్రేమిస్తూ
  పిశాచాలనే పీడకలలో పండువెన్నెలై రమ్మంటే
  మీ రచనలు కన్నీరు పెట్టిస్తాయి.

  ReplyDelete
 18. ఆత్మలూ దెయ్యాలు అంటూ జీవిత సారాన్ని అధ్బుతమైన కవనంలో అందించారు. గొప్పగా ఉన్నాయి మేడం పంక్తుల్లో మీరు పలికించిన భావాలు.

  ReplyDelete
 19. చావు... జీవితానికి కడసారి వీడ్కోలు. ఆ వీడ్కోలు... సస్పెన్స్‌లా ఉంటేనే చావు కూడా థ్రిల్‌. అదే వీడ్కోలు తెలిసి వస్తే.. అంత థ్రిల్‌ ఉండదేమో. చిత్రంలో నాయికను చూస్తే... చావు కూడా యవ్వనాన్ని పోగు చేసుకుని... మదన బాణమవుతుంది. కొరివిదెయ్యాలు కూడా పూలపాన్పులై రమ్మంటాయి. చావు ఘడియలు... సుమధుర క్షణాలుగా మారిపోతాయి. ఆ ఆనంద క్షణాలతో చావునే చంపే ధైర్యం మీ అక్షరాలకుండగా... మరణం.. ఒక మధుర క్షణం... అమరం.

  ReplyDelete
  Replies
  1. దెయ్యాలు భూతాల సంగతి ఏమో కాని సుపర్ ఉంది బొమ్మ. నిజంగా దెయ్యలు ఇంతందంగా ఉంటే అవి మన వెంట పడ్డం కాదు మనమే వాటి వెంట పడతాం కదా సతీష్ గారు :-)

   Delete
  2. అంతే మరి... అందంగా ఉంటే వెంటపడకుండా ఉండగలమా చెప్పండి...

   Delete
 20. అంతే వచ్చినప్పుడు వద్దంటే రమ్మన్నప్పుడు రాదు
  ఎదురుచూస్తే దొరకదు. సమయం వచ్చినప్పుడే ఏదైనా అవుతుంది చావే కాదు అన్నీ. కవిత చిత్రం రెండు అదిరినవి అర్పిత.

  ReplyDelete
 21. This comment has been removed by the author.

  ReplyDelete