నమ్మకం

నా మనసుని మళ్ళీ మళ్ళీ
తూట్లు చేస్తూనే ఉంటావు
నేను నవ్వుతూ నవ్విస్తూ
పెదవులకి కుట్లు వేస్తుంటాను.


నా దారిలో అడుగడుగునా
నీవు వదిలి వెళ్ళిపోతుంటావు
నేను స్నేహ హస్తం అందిస్తూ
హితుల జాబితాలో జోడిస్తుంటాను.


నాది నాదన్న స్వార్థంతో
అబధ్ధాన్ని ఆసరా కోరుతుంటావు
నేను మాత్రం నిజమని నమ్మేస్తూ
ఆశల వంతెననే నిర్మిస్తుంటాను.


నా నిర్మల మదిని తిట్టుకుంటూ
నిన్ను నీవు మెచ్చుకుని మురుస్తావు
నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.

70 comments:

  1. మనసు ఎరిగిన మనిషి నమ్మకానికి నిదర్శనం మీ భావ కవిత పద్మ గారు

    పెదవులపై నవ్వు సంతకమె ఎప్పటికీ చేరగాదు.
    ప్రతి అడుగు మడుగులో చేతిని అందివ్వాలనే తపన కానవస్తుంది
    స్వార్థం ఎప్పటికీ నిలిచి ఉండదు ఆది మనిషిని లోలోపల కృంగాదీసే మాయరోగం సూమి
    మనసులో మాదిలే భావాల ఏరులో ప్రతిబింబం తేటతెల్లమై నిఖీలమై నిలిచేను. నమ్మకమె పునాది దేనీకైనా. జీవితానికి పరమార్థం అదే. చక్కని కావ్యరూపకం.

    ReplyDelete
    Replies
    1. ఫేస్ బుక్ జనాలకి పద్మార్పిత గారు మీ కమెంట్ చదివే నమ్మకం నమ్మకం నమ్మకం అనే పాటను లింక్ ఇచ్చారు కామోసు!. మనమేం పాపం చేసామని ;-(

      Delete
    2. ఆకాంక్ష గారు ఫేస్ బుక్ సంగతేమోగాని నాకైతే ఎం తెల్వది
      ఈడ నా కామెంట్ జనాలకి నచ్చనికి కాదు సొచాయించనికి
      గదేం పెద్ద పాపం గాదు పాపపుణ్యాల బేరీజు వేసే వారు సమవర్తి
      గాని ఇక్కడ కామెంట్ ను నమ్మకం గా చూస్తె అందులో దాగుంది సమయస్పూర్తి

      నమ్మకం అనే పాట కాదు కదా నమ్మకానికి ఏ తార్ఫిదు అవసరం లేదని చెప్పనికి ఈ కవిత రాసినారు ఆకాంక్ష గారు. ఎవరి పాపానికి వారే బాద్యులు అందరి పుణ్యానికి దేవుడే ఆద్యుడు కాదంటారా. అదే నిజమైతే రెండు చేతులు జోడించి "ఓం నమో కేశవాయ మదుసూదనాయ నమామ్యహం" అనుకోండి. మీ యాకులత తీరి ఆనందం మీ కంప్యూటర్ స్క్రీన్ తడుతుంది :-)

      ;-( ఇలా వద్దండి :-) ఇలా ఐతే ఓకే

      Delete
    3. * వ్యాకులత కు బదులుగా యాకులత అని అచ్చైనది మన్నించగలరు

      Delete
    4. అమ్మోయ్ నేనేదో సరదాగా అనంటే ఇంతలా ఉపదేశం చేయవలసింది అంటారా :-)

      Delete
    5. మీరు చెప్పింది అక్షరాల నిజం శ్రీధర్ గారు. థ్యాంక్యూ.

      Delete
    6. ఆకాంక్షగారు మీరు ఫేస్ బుక్ విషయాలు ఇక్కడ చెప్పి కలహాలు పెడుతున్నారు కామోసు! మీలో నారదుని లక్షణాలు కనబడుతున్నాయి :-) Just kidding :-)

      Delete
  2. Very nice poem with lovely painting mam.

    ReplyDelete
  3. నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
    కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.... ఎదుటి వారిలో కానరాని ( లేని ) మంచితనాన్ని కూడా నమ్మే మీ మంచితనానికి నిజంగా అభినందనలు ... మీ అందమైన మనసులా పెయింటింగ్ కూడా....

    ReplyDelete
    Replies
    1. మీలోని మంచితనమే నాలో దాగిన మంచిని చూసింది మెహదీగారు. మీ స్పందనలు సదా స్మరణం నాకు.

      Delete
  4. vaha vaah eam rasinaru. bagundi mie kavita

    ReplyDelete
  5. Madam where you will get such wonderful paintings. Poem is simply superb.

    ReplyDelete
  6. హృదయాన్ని తాకింది మీ కవిత ... సారీ డైరెక్టుగా పొగిడేశా :-)

    ReplyDelete
    Replies
    1. ఇండైరెక్టుగా కూడా పొగిడి ఉండాల్సింది వినోద్ గారు.

      Delete
  7. అపనమ్మకాలని సైతం అందమైన నమ్మకాలుగా మార్చి కవితని అందించారు. బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీకు.

      Delete
  8. nammakam lo yantha andhamundo telisina manasulani tirigi palakarinche tolakari me kavitha padma g

    ReplyDelete
    Replies
    1. అందమైన అహ్లాదకర కమెంట్ కి అభివందనం

      Delete
  9. మరో మంచి కవిత మీ కలం నుంచి

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ లిపిగారు. ఈ మధ్య ఏం రాయడంలేదు ఎందుకనో?

      Delete
  10. ఒకరిపై స్త్రీ ఇష్టం పెంచుకుంటే అది ఎంత పారదర్శకంగా స్వచ్చంగా ఉంటుందో మీ ఈ కవిత ప్రస్పుటంగా ప్రతిబింబిస్తోంది మేడం... మీరు వేసిన ఈ చిత్రం నాకెంతో నచ్చింది.. చక్కని కవితకు మరోమారు అభినందనలు....

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలు ఎప్పుడూ నాకు ఉత్తేజకారకులే.

      Delete
  11. నాది నాదన్న స్వార్థంతో
    అబధ్ధాన్ని ఆసరా కోరుతుంటావు
    నేను మాత్రం నిజమని నమ్మేస్తూ
    ఆశల వంతెననే నిర్మిస్తుంటాను.

    ప్రేమ పట్ల ఎంతో ఆశావహ దృక్పధాన్ని మీ ప్రతి కవితలో చూపుతారు. మీ కలం నుండి మరో ఆణిముత్యం. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ఆశావాద దృక్పధమే ఆనందానికి హేతువు అని మీబోటి గొప్పవ్యక్తుల ద్వారా తెలుకున్నదేనండి. మీ స్పూర్తిదాయక స్పందనలకు నెనర్లు.

      Delete
  12. ప్రేమ పై మీకున్న నమ్మకమే మీతో ఇన్ని అందమైన కవితలు వ్రాయిస్తుందనుకుంటాను. మరొక్కమారు మురిపించారు ముగ్ధాక్షరాలతో.

    ReplyDelete
    Replies
    1. రాగిణిగారు మీ పేరులాగే మీరు రాసిన అక్షరాలు నన్ను మురిపిస్తున్నాయి. థ్యాంక్యూ.

      Delete
    2. జవాబుల్లో కూడా మీ ప్రత్యేకతని నిరూపించుకున్నారు సున్నితంగా చెప్పి.

      Delete
  13. ప్రేమంటే మీకు నమ్మకం
    మీరు మంచి సాహిత్యాన్ని అందిస్తారని మా నమ్మకం.
    చిత్రం చూడ ముచ్చటగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే నా ప్రయత్నం. థ్యాంక్యూ.

      Delete
  14. ఒకవైపు నిందిస్తూనే హితుల జాబితాలోకి చేర్చుకోవడం... ఆహా ఎంత జాలి పాపం ! ప్రేమికుడి స్థానం నుంచి హితుడి స్థానానికి నెట్టేయడం ఎంత అన్యాయం!
    నాది అన్న స్వార్ధం లేకుండా ప్రేమ అనేది ఉంటుందా ఎక్కడన్నా? ప్రేమ కావాలి స్వేచ్చ కావాలి అంటే కుదిరే పనా? కుదరదంటే అతగాడిని ఇలా నిందిస్తారా? ఇదేనా నమ్మకం?

    ReplyDelete
    Replies
    1. నేను ఏదో అమాయకంగా అందరినీ నమ్మేస్తుంటే మీరు ఇలా నిందవేయడం న్యాయమా :-) మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  15. కానరాని నిజాన్ని నమ్మడం కొందరికే చెల్లితుంది. ఆ వరం మీకుంది.

    ReplyDelete
    Replies
    1. తెలిసీ తెలియనితనం కూడా అయ్యి ఉండవచ్చునేమో ! :-)

      Delete
  16. ప్రేమంటేనే స్వార్థం కదండీ పద్మగారు. అందరూ మనలా ఉండాలి అనుకోవడం కూడా ఒక రకమైన స్వార్థమే. మీ నమ్మకం మీది. మా స్వార్థం మాది. కాదంటారా? :-)

    ReplyDelete
    Replies
    1. నాలా ఉండమని నేనెందుకు అంటాను. నానమ్మకం నాది. మీ మనసు మీది అంతె కదండీ :-)

      Delete
  17. అతి మంచితనం, నమ్మకం ఒకోసారి ప్రమాధకరం. చూసి మసలుకోవాలి. కవిత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పదు మంచి ఎప్పుడూ మెతగ్గానే ఉంటుంటుంది. ఆలస్యంగానే వెలుగులోకి వస్తుంది :-) థ్యాంక్యూ.

      Delete
  18. నీవు కలలలో మేల్కొని ఊహల్ని శ్వాశిస్తావు
    నేను నిజాల నిష్ఠూరం అనుభవిస్తూ నిన్ను మేల్కొల్పాలని ప్రయత్నిస్తాను
    నీవు నన్ను స్వార్థమని ముద్రిస్తూ నిన్ను నీవు పొగుడుకుంటావు

    ReplyDelete
    Replies
    1. హన్నన్నా ఎంతమాట...
      నన్ను నేను పొగుడుకుంటూ మిమ్మల్ని కూడా పొగిడేస్తాను.
      మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

      Delete
  19. నేను నమ్మనుగాక నమ్మను

    ReplyDelete
    Replies
    1. నమ్మను అనుకోవడమే మీ నమ్మకం :-)

      Delete
  20. ఎవరిని నమ్మాలో
    ఎందుకు నమ్మాలో
    నాకేం అర్థం కావడంలేదు
    మీరు నమ్మిన వాటిపై నమ్మకం లేదు :-)

    ReplyDelete
    Replies
    1. అదేంటి ఆకాంక్షా...అంత ఖచ్చితంగా నమ్మకంలేదు అంటే ఎలా? జీవితాన్ని నమ్ముకుని సాగించాల్సిందే పయనమని మీకు నేను చెప్పాలా :-)

      Delete
  21. మరో మంచి భావం ఉన్న కవితను ఇచ్చారు. మనసులో దాగిపోవు భావం.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు యోహంథ్.

      Delete
  22. మాసెడ్డ దొడ్డమనసు మీది

    ReplyDelete
    Replies
    1. బులెట్ లేకుండా పేల్చారు కమెంట్ :-)

      Delete

  23. ఓ కె అలా నమ్మకంతోనే బ్రతికేయండి.

    ReplyDelete
  24. మనసుని మనిషిని కుదురుగా కూర్చోనీయవు కదా నీ కవితలు. అలరించావు అర్పితా-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. కుదురుగా కూర్చొని నేనూ ఉండనుగా :-) thank you sir.

      Delete
  25. నీవు వదిలి వెళ్ళిపోతుంటావు
    నేను స్నేహ హస్తం అందిస్తూ
    హితుల జాబితాలో జోడిస్తుంటాను.
    ante friend request pedutu undama madam. meke add request tho panenti :-)

    ReplyDelete
    Replies
    1. Add request petti delete cheyadam enduku. asalu list antoo maintain cheyaka povadame best :-)

      Delete
  26. నాకు ఈ కవిత చదవాలనిపించలేదు.. ఎందుకంటే ఆ చిత్రం నన్ను చదవనివ్వలేదు. ఎంత ట్రై చేసినా.. నా మనసు కవిత చదవడం వైపు వెళ్లలేదు. కానీ.. ఆ చిత్రం చూస్తుంటే... పక్కన ఏం రాసుందో మాత్రం అర్థమైపోయింది. మగువ మనసు సున్నితత్వాన్ని ఆ మనసులో దాగిన ఎన్నో భావాల గుబాళింపుని... ఆ అక్షరాలు వెదజల్లాయని నాకు తెలుసు.. కానీ.. నా మనసు చదివిన చిత్రం ఊసులకు, పద్మ కలం నుంచి జారిన సిరాక్షరాలకు పొంతన కుదరమదేమో అన్న ఆందోళనలో ఆ కవిత చదవదలుచుకోలేదు. ఆ వాల్జడను అలా విసురుగా పడేస్తే... మేమేం కావాలి? ఛర్నాకోలు లాంటి ఆ వాలుకనుల దగ్గరే గాలం వేస్తే.. ఆ కవితనెలా చదవాలి...? సింగారాన్ని చీరలో రంగరించి వదిలేసి... కవిత చదవమంటే ఎలా మరి...? మొత్తానికి అతి బలవంత మీద... చదివాను కవిత. కవిత కాదది మనసు గీసిన కావ్యచిత్రమాలిక. మగువ మదిని దాటని.. ఏన్నో భావాల దృశ్యమాలిక. స్నేహానికి, ఆరాధనకు మధ్య ఏదో తెలియని ఊగిసిలాట. పెదవులతో కుట్లు వేసినా,ఆశ వంతెన వేసినా... అదో మరపురాని కథ. గెలుపైనా, ఓటమైనా... కమ్మని కల. చాలా బాగుంది అక్షరం, అక్షరాన్ని మించిన అందం.

    ReplyDelete
    Replies
    1. నాకు మరో కమెంట్ పెట్టి విసుగు తెప్పించాలి అనిపించలేదు. మీరు అలా ఉండనిస్తే కదా! :-) చదవను కవితను అన్నారు ఏంటా చూద్దాం అని వచ్చి చదివితే షాక్...అంటే భయంతో కాదు మీ వాక్య చతురతకీ, మీ మీరు చెప్పిన సునిశితశైలికి పడిపోయాను పూర్తిగా అంటే ఫ్లాట్ అయిపోయాను మీ అక్షరాల కూర్పుకి. ఇంక తప్పదు కవిత చదవకుండా కమెంట్ వ్రాయగలరు కాని నేను వ్రాసింది చదవకుండా నాకు జవాబు ఇవ్వలేరు :-) హా హా హా :-)

      Delete
    2. రాసింది చదవరేమో అని నిరుత్సాహంతో నీరసంగా కమెంట్ చదివి....వెయ్యి వోల్ట్స్ వెలుగుతో ఎగిరి గెంతులేసింది నా మనసు. ఇది నిజం నమ్మండి.
      నా రాతలకి, చిత్రాలని మీరు ఎప్పుడూ అద్భుతమైన మరో కోణంలో చూపిస్తుంటారు.
      " సింప్లీ సెల్యూట్ టు యువర్ కమెంట్స్"
      No more words Satishgaru.

      Delete
    3. ఆకాంక్షగారు...మీరు రాయను కమెంట్స్ పెట్టను అంటే నేను పడిపోతాను (ప్లాట్ కాదు మూర్చపోతాను ) రాసేద్దురూ :-)

      Delete
  27. మరో మంచి కవిత పద్మార్పితగారు

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అనికేత్

      Delete
  28. పోయం
    కమెంట్స్
    రిప్లైస్
    అన్నీ బాగున్నాయి.

    ReplyDelete
  29. నా నిర్మల మదిని తిట్టుకుంటూ
    నిన్ను నీవు మెచ్చుకుని మురుస్తావు
    నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
    కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.ఎంత నర్మగర్భంగా వ్యక్తీకరించారు పద్మాజీ..

    ReplyDelete
  30. >నిర్మల మదిని
    నిర్మలహృది అనండి. (space ఇవ్వకూడదు. సమాసం అంటే ఏకపదం కదా). నిర్మల మది అని ఎందుకు అనకూడదంటే నిర్మల(సంస్కృత) అని ప్రక్కన మది (తెలుగు) మాటతో సమాసం చేయరాదు కాబట్టి.

    ReplyDelete