బాసచేయకనే బదులు ఇవ్వమని
నన్ను విడిచి నీవు వెళ్ళిపోరాదని!
చాన్నాళ్ళుగా నాదో బుల్లి కోరిక..
ఒట్టేసి చెప్పేయరాదా తీర్చేస్తానని
నేనుగాక ఎవరు నీకు గుర్తుండరాదని!
చిన్నిదాని న్యాయమైన తీరే కోరిక..
మాటవరుసకి మనసారా అలాగేనని
నిన్ను నమ్మిన నా సకలం నీతోనేనని!
చీటికిమాటకీ అడగలేని చివరి కోరిక..
తొణికిసలాడకనే తీర్పు చెప్పేయమని
కోరికలన్నీ సమంజసమైనవే తీరుస్తానని!
చులకనగా చూడకు ఇదే తుది కోరిక..
తుదిశ్వాశకైనా విడదీయలేని బంధమని
నావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని!
అట్లగట్లనే గింత చిన్ని కోర్కెలు కోరితే ఎట్లా :))
ReplyDeleteఅందాలన్నీ ఒలకబోస్తూ చిన్ని కోరికలే కాదు పెద్ద పెద్ద కోరికలు కోరికలు కోరినా కాదన గలిగే మగవాళ్ళే లేరు . ఆ అందానికి ముగ్ధులై , మూగవాళ్ళైపోతున్నారు .
ReplyDeleteమాడం ఎప్పుడూ తీపి తిన్నా మొహం మొత్తుతుంది
ReplyDeleteప్రేమ కవితలు కొన్నాళ్ళు ఆపేయండి
మీ నుండి ఇంకేదో ఆశిస్తున్నారు జనాలు :-)
పద్మార్పిత అంటేనే ప్రేమార్పిత అని ఎందరో అన్నారు. సార్థక నామధేయురాలు అనిపించుకోవాలి మరి. మీరు ప్రేమలేని కవిత వ్రాయమంటే ఫలితం లేని పూజలా ఉంటుందేమో ఆలోచించాలి-హరినాథ్
Deleteచిన్న కోరికలని ఇంత పెద్ద పెద్ద తీరని కోరికరా కోరేది. బొమ్మ సూపర్ ఉంది
ReplyDeleteనావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని, చిక్కనైన చక్కని భావాన్ని కోరి మరీ అందించావు పద్మా-హరినాధ్
ReplyDeleteముద్దు ముద్దు పదాలతో ముచ్చటైన కవిత
ReplyDeleteకల్మషం లేని కోర్కెలే అయిన చాలా మంచివే కోరారు.. ప్రేమలో ఈ మాత్రం స్వార్థం ఉండాలన్నమాట పద్మర్పిత గారు...
ReplyDeleteఅందమైన కోర్కెల కవిత సూపర్ మేడం!!
ఇవి పద్మార్పిత భావాలా లేక కోరికలా...ఏమోలే, మొత్తానికి ముద్దుగుమ్మ చిత్రంతో మురిపించావు :)
ReplyDeleteఒట్టేసి చెప్పేయరాదా తీర్చేస్తానని
ReplyDeleteనేనుగాక ఎవరు నీకు గుర్తుండరాదని!
అయ్యబాబోయ్ ఆడవాళ్ళు ఇంత స్వార్థపరులా :)
ఇవి చిన్ని, బుల్లి, న్యాయమైన, తీరేకోరికలా.
ReplyDeleteతుదిశ్వాశకైనా విడదీయలేని బంధమని
ReplyDeleteనావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని super like bumper painting.
కోరికల తూటాలా ఈసారి
ReplyDeleteబాగున్నాయి మీ న్యాయసమ్మతమైన కోరికలు :-)
ReplyDeleteభావాత్మకంగా మీ కోరికల్ని చెప్పిన విధానం బాగుందండి పద్మగారు.
ReplyDeletemari konni korikalu koravalasindi. chinnavi aipoenavi madam :)
ReplyDeleteపద్మ గారు
ReplyDeleteకోరికల భావాలే తెలియపరిచారు . మూడాడుగులే కదా అని చిన్నవాడు కోరగా వామానుడు త్రివిక్రాముడాయేను అలానే మీ కవితలోని కోరిక ఏమో కానీ పెను గాలి ఉప్పెన మాదిరి గా ఉండండి ఇది మీ నుండి మరోమచ్చు తునక. --- శ్రీ
వచ్చే వచ్చే SSS(Satish, Sridhar, Sattaiah) లో ఒక(Sridhar Bukya) వసంతం మరల వచ్చే. ఏమైపోయినారు మహాశయా :-)
Deleteత్వరలోనే ఉగాది కదా ఆకాంక్ష గారు, పైగా చైత్ర మాసం లో నా పుట్టిన రోజు కూడానూ మరందుకే వసంతాలా కోయిలలా వచ్చాను :P :-)
Deleteఆకాంక్ష గారు నేను బాగున్నను ఆండీ
మీ చిట్టి కవితలు 'సరదా' గా, పద్మ గారి కవితలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ కామెంట్ పెట్టలేదు.
బాగున్నాయి మీ కోరిక, ఎప్పుడు తీరునో ఏమో:)
ReplyDeleteతీరక మిగిలేవే కోరికలు అయిపోతాయి పద్మార్పితగారు.
ReplyDeleteనావల్ల కాదు తల్లీ ఈ కోర్కెలు తీర్చడం అంటే
ReplyDeleteమిమ్మల్ని అడగలేదుగా ఆకాంక్ష అంటారని తెలుసులే :-)
భలే స్పాట్ పెట్టారు... :-)
ReplyDeleteనాలుగొందల పోస్ట్లు ఒకదాన్ని మించి ఒకటి రాసిన పద్మగారి అకుంఠిత దీక్షకు అభివందనాలు.
ReplyDelete401వ పోస్ట్ అదరగొడతారని ఆశగా ఎదురు చూస్తున్నాము అర్పితగారు.
మేధో మధనమా లేక మనోవ్యధనా పద్మార్పితా. ఆలస్యమెందుకు వ్రాసి అలరించేయి మరో మదినిదోచే కవితతో, ఆశీస్సులతో-హరినాధ్
ReplyDeleteనా ప్రతి కోరిక వెనుకా ఒక భావం, దానికి మీ అభిమానం తోడుగా ఉండబట్టే నేను రాయగలుగుతున్నది.
ReplyDeleteస్పందనలతో నన్ను నా భావాలని జీవింపజేస్తున్న అక్షరాభిమానులకు...శతకోటి నమస్కారాలు.
(బ్లాగ్ లో 400 పోస్ట్లని రాసి మీ అభిమానాన్ని పొందాలని నేను చేసిన ప్రయత్నంలో మీరు ఇబ్బందిపడి నన్ను సంబరపెట్టిన మీ అందరికీ అంజలి ఘటిస్తూ పద్మ అర్పిస్తున్న చిరు చందన కుసుమాలే ఈ వందనాలు_/\_ _/\__/\_ )